
ఇది తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమే
పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ్, ఇతర నేతలపై వెంకటరెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమేనని పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ విమర్శించారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయాన్ని ధిక్కరించేలా వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని, పార్టీ నియమావళి ప్రకారం అది క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.
ఆదివారం పార్టీ నేత అద్దంకి దయాకర్‌తో కలసి శ్రవణ్ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా టీఆర్‌ఎస్ ప్రేరేపితమేనని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ రాచరికపు నియంతలకు, కాంగ్రెస్ ప్రజాస్వామ్య వాదులకు మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో... టీఆర్‌ఎస్‌కు లాభం కలిగేలా మాట్లాడటం సరికాదన్నారు.