సాక్షి ఖమ్మం: ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం అంకమ్మ దేవాలయం నుంచి పునః ప్రారంభించిన సంగతి తెసిందే. ఈ క్రమంలో ఇనగాలి గ్రామంలోని రాజుదేవరపాడులో ప్రజలను పలకరిస్తూ... వారి వ్యక్తిగత సమస్యలు వింటూ.. భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..."కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పట్ల అవలంభిస్తున్న తీరుని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీల పై ఈడీ దాడులు నిర్వహించి అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ బీజేపీ పై మండిపడ్డారు. అంతేకాదు ఈ నెల 13న అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందని హెచ్చరించారు కూడా.
అలాగే తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అరాచకపాలన సాగిస్తోదంటూ విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పంచి ఇచ్చిన భూములను కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం లాగేసుకుంటుందంటూ ఆరోపణలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని" అన్నారు.
(చదవండి: ఒకరికి పబ్‌లు తప్పా ఏం తెల్వదు.. ఇంకొకరు విచిత్రమైన మనిషి: కేటీఆర్)
Comments
Please login to add a commentAdd a comment