రైతులను మోసం చేస్తున్న సీఎం | KCR is cheating farmers. | Sakshi
Sakshi News home page

రైతులను మోసం చేస్తున్న సీఎం

Published Wed, Aug 30 2017 4:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

రైతులను మోసం చేస్తున్న సీఎం - Sakshi

రైతులను మోసం చేస్తున్న సీఎం

వైఎస్‌తో కేసీఆర్‌కు పోలికా: శ్రవణ్‌
సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్, గవర్నర్‌ నరసింహన్‌ కలసి రైతులను మోసగించేలా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకి స్తున్నామని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ చెప్పారు. కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డును ప్రకటించిన ఐసీఎఫ్‌ఏకు రాసిన లేఖను మంగళవారం మీడియాకు విడుదల చేశారు.

రుణమాఫీ చేయకుండా, ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించకుండా కేసీఆర్‌ రైతులను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడు, రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్‌ కూడా సీఎం చేస్తున్న మోసపూరిత ప్రచారంలో భాగమయ్యారన్నారు. రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఈ అవార్డును ఇచ్చామని చెప్పుకోవడం సరికాదన్నారు. రైతు బాంధవునిగా పేరు సాధించిన వైఎస్‌తో.. రైతులను మోసం చేస్తున్న కేసీఆర్‌కు పోలికా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement