సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లో వృత్తి నిపుణుల పాత్ర కీలకం కాబోతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్(ఏఐపీసీ) జాతీ య సదస్సులో టీపీసీసీ తరఫున పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు, క్రియాశీలంగా వ్యవహరించేందుకు ప్రొఫెషనల్స్ కాస్త వెనకడుగు వేస్తున్నారని, ఈ నేపథ్యంలో వృత్తి నిపుణులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వృత్తి నిపుణులు సభ్యులుగా ఉండే ఈ వేదిక ద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మ్యాని ఫెస్టో)ను రూపొందించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
రాజకీయాల్లో చేరేందుకు, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వెనుకాడుతు న్న వృత్తి నిపుణుల్లో ఏఐపీసీ ఉత్సాహం నింపుతోం దని వెల్లడించారు. వారిలో ని సృజనాత్మకతను దేశాభివృద్ధికి వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వృత్తినిపుణుల కాంగ్రెస్‌కు అనూహ్య స్పందన వస్తోందని, తెలంగాణ యూనిట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 చాప్టర్లను ప్రారంభించిందని, ఇందులో సభ్యుల సంఖ్య 432కు చేరడంతో ఉత్సాహం రెట్టింపు అయిందన్నారు.
మొత్తం 25 ఈవెంట్స్‌ను నిర్వహించామని, ‘పెద్ద నోట్ల రద్దు–కుప్పకూలిన భారత ఆర్థిక వ్యవస్థ, ఈవీఎంల వల్ల అనర్థాలు–ప్రజాస్వామ్య పరిరక్షణ, బీమా బిల్లు–2017 వల్ల ప్రజలకు నష్టాలు, సమగ్రాభివృద్ధి–లక్ష్యాలు... వంటి 25 అంశాలపై వృత్తినిపుణులతో సదస్సులు నిర్వహించినట్లు డాక్టర్ శ్రవణ్ చెప్పారు. ఐటీ ఉద్యోగుల హక్కులు–కార్మిక చట్టాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలపై గ్రూపుల్లో చర్చలు నిర్వహించామని వివరించారు. వీటితోపాటు కథువా, ఉన్నావ్ రేప్ సంఘటనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించామని చెప్పారు.
తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక్కో చాప్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు ఒక్కో చాప్టర్‌ను వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికల ప్రణాళిక రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామ న్నారు. వృత్తి నిపుణుల సాయంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళికను రూపకల్పన చేస్తామని శ్రవణ్ పేర్కొన్నారు. సదస్సులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్ (ఏఐపీసీ) అధ్యక్షుడు శశిథరూర్, కేంద్ర మాజీమంత్రి మిలింద్ దేవరాతోపాటు పలువురు నిపుణులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment