టీఆర్‌ఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా గవర్నర్ | Governor as the TRS brand ambassador | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా గవర్నర్

Published Sun, Jan 24 2016 4:15 AM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM

టీఆర్‌ఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా గవర్నర్ - Sakshi

టీఆర్‌ఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా గవర్నర్

టీఆర్‌ఎస్ మేనిఫెస్టో అబద్ధాల కంపు: యాష్కీ, శ్రవణ్

 సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా గవర్నర్ పనిచేస్తున్నారని ఏఐసీసీ అధికారప్రతినిధి మధుయాష్కీ, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం అద్భుతమని గవర్నర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టో మూసీలోని మురికిని మించిన అబద్ధాల కంపుకొడుతున్నదని విమర్శించారు.

టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను చూస్తుంటే వాటిని అమలు చేయడానికి కనీసం 500 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. ఆ హామీలను పూర్తిచేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాదు వారి మునిమనుమడు వచ్చినా సాధ్యంకాదని యాష్కీ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement