AP: వైద్య నియామకాలకు స్పెషల్‌ మెడికల్‌ బోర్డు ఏర్పాటు | Special Medical Board Formed For Medical Appointments In AP | Sakshi
Sakshi News home page

AP: వైద్య నియామకాలకు స్పెషల్‌ మెడికల్‌ బోర్డు ఏర్పాటు

Published Wed, Mar 15 2023 8:12 PM | Last Updated on Wed, Mar 15 2023 8:12 PM

Special Medical Board Formed For Medical Appointments In AP - Sakshi

విజయవాడ: వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏపీ ఎంస్‌ఆర్‌బీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం

రాష్ట్ర, జోనల్‌, జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కొత్తగా మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17 పోస్టులతో బోర్డును చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ బోర్డుకు చైర్మన్‌గా వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మెంబర్‌ సెక్రటరీగా స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి, మెంబర్‌గా వైద్య ఆరోగ్య శాఖ నుండి జేడీ(అడ్మిన్‌) స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించింది. 

ఇప్పటి వరకు వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకంలో తలమునకలవుతున్న రాష్ట్ర, జోనల్ , జిల్లా స్థాయి అధికారులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ బోర్డు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.  బోర్డు ఏర్పాటుతో హెచ్‌వోడీ, జోనల్‌,. జిల్లా స్థాయి ఆసుపత్రులపై మరింత దృష్టిని కేంద్రీకరించే వీలుంటుంది. ఎప్పుడు ఏర్పడిన ఖాళీలను అప్పుడే నియమించేలా ఇప్పటికే సీఎం జగన్‌ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement