Health and Medical Department
-
TG: వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల్లో 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 స్టాఫ్ ఫార్మాసిస్ట్ పోస్టులున్నాయి.కాగా గత నెలలో 2,050 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ 2050 పోస్టులకు అదనంగా 272 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మొత్తంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్టు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు అయింది. అర్హులైన వారు ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిచ్చింది.. నవంబర్ 17న ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. -
ప్రభుత్వ వైద్య విద్యా రంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు
-
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల జాతర
-
ఏపీ వైద్యశాఖలో విప్లవాత్మక పథకాలు
-
వైద్య రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి
-
వైఎస్ జగన్ పాలనలో బలోపేతమైన వైద్య ఆరోగ్య వ్యవస్థలు
-
వైఎస్ జగన్ మనసున్న ముఖ్యమంత్రి: మంత్రి విడదల రజినీ
సాక్షి, విజయవాడ: వైద్య, ఆరోగ్య రంగం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనుచేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజనీ పేర్కొన్నారు. మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు కల్పించేందుకు నిత్యం తపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు గొప్ప సేవలు అందిస్తున్నారని అన్నారు. మరింత మెరుగైన సేవలను అందించాలనే ఉద్ధేశంతోనే రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనవని ప్రశంసించారు. ఈ మేరకు విజయవాడలో మంత్రి బుధవారం మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యుల సేవలు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో అందించే చికిత్సలను పెంచామని, 3255 వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చారని, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. గతంలో ఎన్నడూ జరగనంతగా వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 49వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. వైద్యానికి కావాల్సిన బడ్జెట్ పెంచాం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ‘సీఎం జగన్ మనసున్న ముఖ్యమంత్రి. ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించడం వల్ల ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. మెడికల్ కాలేజీలు తేవాలంటే చాలా ధైర్యం కావాలి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్నదే సీఎం ఆశయం. భావితరాలకు మెరుగైన వైద్యం అందించడం కోసం సీఎం ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఇప్పటికే కొంత మేర చెల్లించాం. త్వరలోనే మిగతా వాటిని కూడా చెల్లిస్తాం. నాణ్యమైన వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం రాజీ పడదు.’ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన..షెడ్యూల్ ఇదే.. అపర సంజీవని ఆరోగ్యశ్రీ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అపర సంజీవనిలా మారిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు తదితర అంశాలపై మంత్రి విడదల రజిని మంగళగిరిలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.3,336 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం 1,059 ప్రొసీజర్లకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసిందని, తమ ప్రభుత్వం కొత్తగా మరో 2,446 ప్రొసీజర్లను చేర్చిందని చెప్పారు. దీంతో ఏకంగా 3,255 ప్రొసీజర్లకు వైద్యం ఉచితంగా ప్రజలకు అందుతోందన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి రూ.వెయ్యి కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేసేదన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం రూ.3వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. అదేవిధంగా ఆరోగ్య ఆసరా కోసం రూ.445 కోట్లు, 108 వాహనాల నిర్వహణకు రూ.187 కోట్లు, 104 వాహనాల నిర్వహణకు రూ.164 కోట్లు, ఈహెచ్ఎస్ కోసం రూ.140 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని వివరించారు. ఏపీలో 2,061ఆస్పత్రులు, తెలంగాణలో 132, కర్ణాటకలో 49, తమిళనాడులో 22 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, అడిషనల్ సీఈవో మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
AP: వైద్య నియామకాలకు స్పెషల్ మెడికల్ బోర్డు ఏర్పాటు
విజయవాడ: వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీ ఎంస్‌ఆర్‌బీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కొత్తగా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17 పోస్టులతో బోర్డును చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ బోర్డుకు చైర్మన్‌గా వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మెంబర్ సెక్రటరీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి, మెంబర్‌గా వైద్య ఆరోగ్య శాఖ నుండి జేడీ(అడ్మిన్) స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకంలో తలమునకలవుతున్న రాష్ట్ర, జోనల్ , జిల్లా స్థాయి అధికారులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ మెడికల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బోర్డు ఏర్పాటుతో హెచ్‌వోడీ, జోనల్,. జిల్లా స్థాయి ఆసుపత్రులపై మరింత దృష్టిని కేంద్రీకరించే వీలుంటుంది. ఎప్పుడు ఏర్పడిన ఖాళీలను అప్పుడే నియమించేలా ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. -
ఏపీలో పీహెచ్‌సీల పనితీరుపై తప్పుడు ప్రచారం తగదు: కృష్ణబాబు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. కానీ, కొన్ని పత్రికలు మాత్రం ప్రజలకు అందిస్తున్న వైద్యం విషయంలో తప్పుడు వార్తలు రాస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో పీహెచ్‌సీల పని తీరుపై హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, కృష్ణబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతీ మండలంలో అందుబాటులోకి పీహెచ్‌సీలను తీసుకువచ్చాము. టెలి మెడిసిన్ సదుపాయంతో అందరికీ వైద్య సౌకర్యం అందుబాటులోకి తెచ్చాము. పీహెచ్సీలో అన్ని రకాల మందులు, పరికరాలు అందుబాటులో ఉంటాయి. పీహెచ్సీలో గర్భిణీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో వారిని క్షేమంగా ఇంటికి చేరవేస్తున్నాము. మూడేళ్లలో వైద్యారోగ్య శాఖలో 45వేల నియామకాలు జరిగాయి. అందులో 4500 వరకు డాక్టర్ల నియామకాలు కూడా జరిగాయి. ఇంకా వైద్యుల నియామకాలు కొనసాగుతున్నాయి. విలేజ్ హెల్త్ క్లీనిక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. రెఫరల్ ఆసుపత్రుల్లో గైనకాలజిస్టు సహా అన్ని విభాగాల వైద్యులు ఉన్నారు. ప్రతీ పీహెస్సీలో కూడా మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. డాక్లర్లు లేరని కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డాక్టర్లు ఉన్నప్పటికీ వారు లేరని పత్రికల్లో రాయడం సరికాదు. అన్ని చోట్ల వైద్యులు అందుబాటులో ఉన్నారు. స్పెషలిస్టులకు అన్ని రకాల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాము’ అని స్పష్టం చేశారు. -
కేరళలో కొత్త వైరస్ కలకలం.. ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
తిరువనసంతపురం: కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రెండు నోరోవైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ నోరోవైరస్ సోకినట్లు పేర్కొంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆందోళన చెందనవసరం లేదు విజింజంలోని ఎల్ఎంఎస్ఎల్పీ స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్, డయేరియాతో విద్యార్థులు బాధపడుతున్నారని తెలియడంతో వారి నుంచి నమూనాలు సేకరించామని మంత్రి తెలిపారు. నమూనాలను పరీక్ష కోసం రాష్ట్ర ప్రజారోగ్య ల్యాబ్‌కు పంపిమని, అయితే సదరు పరీక్షలో ఇద్దరికి నోరోవైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ పరిస్థితిని అంచనా వేసి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. కాగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానిస్తున్నారు. చదవండి: అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం నోరోవైరస్ అంటే నోరోవైరస్ అనేది అంటువ్యాది. ఇది తీసుకున్న ఆహారం లేదా కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తుంది. నోరోవైరస్ సోకిన ఉపరితలాలు, వస్తువులను తాకడం లేదా వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వల్ల కూడా వ్యాప్తి చెందవచ్చు. నోరో వైరస్ సోకిన రోగులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, శరీర నొప్పులతో బాధపడుతుంటారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండాలని, లావెటరీని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి జాత్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. ముందుగా అప్పుడే నవంబర్ 2021లో కేరళలో మొదటిసారిగా నోరోవైరస్ కేసులు నమోదయ్యాయి. వాయనాడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులు పాజిటివ్‌గా పరీక్షించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అదుపులోకి తెచ్చింది. ఆ తర్వాత వ్యాప్తి చెందలేదు. తాజాగా మరోసారి కేసులు వెలుగుచూశాయి. -
ముంగిళ్లలో వైద్యం
కణేకల్లుకు చెందిన సుబ్బయ్య దివ్యాంగుడు. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. సాయంగా ఎవరూ లేకపోవడంతో చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లలేకపోయాడు. రెండు రోజుల తర్వాత 104 వాహనం గ్రామానికి రాగా వైద్యులే సుబ్బయ్య ఇంటివద్దకు వచ్చి మరీ పరీక్షలు చేశారు. అవసరమైన మందులూ అందించారు. బొమ్మనహాళ్‌కు చెందిన సుశీలమ్మ వృద్ధురాలు. వయసుమీద పడటంతో నడవలేని పరిస్థితుల్లో ఉంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురికాగా 104 వైద్యులే ఆమె ఇంటికి వచ్చి చికిత్స చేశారు. ఇలా గ్రామీణ ప్రాంతాల వారికి ఎందరికో 104 వాహనం ద్వారా మెరుగైన వైద్యం అందుతోంది. రాయదుర్గం: వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ముంగిళ్లలోనే వైద్యసేవలు అందిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు, వైద్య పరికరాలతో కదిలే కార్పొరేట్ ఆస్పత్రి లాగా రూపొందించిన 104 మొబైల్ మెడికల్ క్లినిక్ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి వరంలా మారింది. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, సాంక్రమిక∙వ్యాధుల రోగులకు సంజీవనిలా మారింది. రూ.201 కోట్లు ఖర్చు చేసి 1,088 వాహనాలను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.... వాటిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి 104, 108 వాహనాలుగా తీర్చిదిద్దింది. 2020 జూలై 1వ తేదీన ఈ వాహనాలన్నీ సీఎం జగన్మోహన్రెడ్డి విడుదల చేసి చరిత్ర సృష్టించారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 1న అధునాతనమైన సౌకర్యాలతో కూడిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను సీఎం విడుదల చేశారు. ప్రతి గ్రామానికీ నెలలో రెండుసార్లు 104 వాహనం ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు వెళ్తుంది. సాధారణ జబ్బులతో పాటు చిన్నారుల్లో వచ్చే డయేరియా, కౌమారదశలో ఉన్నవారికి వచ్చే రక్తహీనత, సాంక్రమిక వ్యాధుల నిర్ధారణ, చర్మవ్యాధులు, మలేరియా, చికెన్ గున్యా, లెప్రసీ, క్షయ, మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధుల నిర్ధారణకు 9 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసీజీ, ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు వాహనంలో 32 రకాల వైద్య పరికరాలు, 74 రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ వాహనంలో వైద్యపరీక్షలు చేయడానికి డాక్టర్ సీటింగ్‌తో పాటు డేటా ఎంట్రీ కోసం ఆపరేటర్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 12,03,429 మందికి వైద్య సేవలు 2020 జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 104 వాహనాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లా (అనంతపురం, శ్రీసత్యసాయి) వ్యాప్తంగా ఉన్న 62 వాహనాల ద్వారా 896 గ్రామ సచివాలయాల పరిధిలో 2022 మార్చి వరకు 21 నెలల్లో 12,03,429 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇంటివద్దకే వైద్యం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓపీ చూసే 104 వైద్యులు 1.30 గంటల నుంచి నడవలేని లేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, ఇతర రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. అలాగే పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల పర్యవేక్షణతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక భారం తగ్గింది నాకు షుగర్, బీపీ ఉన్నాయి. పట్టణానికి వెళ్లి ప్రైవేటు వైద్యులతో పరీక్షలు చేయించుకుని, మందులు కొనుక్కురావడానికి నెలకు రూ.వెయ్యి ఖర్చు వచ్చేది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 104 వాహనాన్ని ప్రజల ముంగిటకే పంపి వైద్య సేవలు అందిస్తుండటంతో మాలాంటి వారికి ఆర్థిక భారం తగ్గింది. – సీతారామిరెడ్డి, కణేకల్లు క్రమం తప్పకుండా 104 వస్తుంది గతంలో నెలకోసారి, రెండు నెలలకు ఒకసారి వచ్చే 104 వాహనం ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా వస్తుంది. 104 వైద్యులు రోగులను పరీక్షించి మాత్రలు, ఇంజక్షన్లు వేస్తారు. అవసరమైతే రక్త పరీక్షలు, ఈసీజీ నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో 104 వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడం ఆనందంగా ఉంది. – తిప్పేస్వామి, బీఎన్‌హళ్లి గ్రామం, రాయదుర్గం మండలం 194 మంది సిబ్బందితో వైద్యసేవలు ఉమ్మడి జిల్లాలో 104 వాహనాలు 62 ఉన్నాయి. 62 మంది డాక్టర్లు, 66 మంది డీఈఓ(డేటా ఎంట్రీ ఆపరేటర్)లు, 66 మంది డ్రైవర్లు మొత్తం 194 మంది సిబ్బంది ప్రతినెలా నిర్ణయించిన తేదీల్లో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. 104 వాహనాల్లో 32 రకాల ఆధునిక పరికరాలతో పాటు పాము, తేలు, కుక్క కాటుకు మందులుంటాయి. –జి. కృష్ణమూర్తి, 104 ఉమ్మడి జిల్లా మేనేజర్ -
AP Budget 2022-23: ప్రజారోగ్యానికి పెద్దపీట
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు భారీగా కేటాయింపులు చేసింది. 2021–22తో పోలిస్తే 11.23 శాతం అదనంగా నిధులు కేటాయించింది. గత బడ్జెట్లో రూ.13,830.43 కోట్లు కేటాయించగా ఈసారి రూ.15,384.26 కోట్లకు పెంచింది. దాదాపు కోటిన్నర కుటుంబాలను ఆదుకుంటున్న అపర సంజీవని లాంటి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2 వేల కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం రూ.541.06 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం. ►నాడు–నేడుతో ఆస్పత్రులు బలోపేతం నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల ముఖచిత్రం మారిపోయింది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.1,603 కోట్లు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల అప్‌గ్రేడ్ కోసం రూ.350 కోట్లు కేటాయించారు. మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. కరోనాకు ఉచిత వైద్యం కరోనా బాధితులు వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలిచింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశంలో తొలిసారిగా అర్హతతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత వైద్యం అందించింది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,09,765 మందికి చికిత్స కోసం రూ.732.16 కోట్లు ఖర్చు చేసింది. తొలగిన చీకట్లు.. రాష్ట్రంలో 5.6 కోట్ల మందికి ఉచితంగా సమగ్ర, నాణ్యమైన కంటి సంరక్షణ సేవలు అందించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రెండు దశల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 16,64,919 మందికి కంటి పరీక్షలు నిర్వహించి సమస్యలున్న 8.50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు 1.55 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేశారు. -
వైద్య, ఆరోగ్యానికి ‘సూపర్’ ట్రీట్మెంట్
కంటికి కనిపించని కరోనా వైరస్ 2020లో మిగిల్చిన చేదు అనుభవాలు.. వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ తాలుకు చేదు జ్ఞాపకాలతో రాష్ట్ర ప్రజలు 2021లోకి అడుగుపెట్టారు. కానీ, కోవిడ్ ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఏప్రిల్, మే నెలల్లో ఊహించని రీతిలో వైరస్ రెండో విడతలో ఒక్కసారిగా విజృంభించింది. దీంతో 2021లో కూడా వైరస్ భయంతోనే బిక్కుబిక్కుమంటు గడిపారు. తాజాగా.. ఒమిక్రాన్ రూపంలో వైరస్ వ్యాప్తి మరోసారి మొదలైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 11.94 లక్షల మంది వైరస్ బారినడ్డారు. వీరిలో 11.86 లక్షల మంది కోలుకోగా 7,384 మంది మృత్యువాత పడ్డారు. ఊహించని రీతిలో వైరస్ విజృంభించినా సమర్థవంతంగా కట్టడి చర్య చేపట్టి జాతీయ స్థాయిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు పొందింది. – సాక్షి, అమరావతి వేగంగా టీకా పంపిణీ 2021 జనవరి 16న రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి శ్రీకారం చుట్టారు. విజయవాడ జీజీహెచ్‌లో పారిశుధ్య ఉద్యోగిని పుష్పకుమారి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తొలిడోసు టీకా వేసుకుంది. ఆ రోజు నుంచి దశల వారీగా ఎంపిక చేసిన వర్గాలకు టీకా పంపిణీలో ప్రభుత్వం వేగం పెంచింది. ఇలా సంవత్సరాంతానికి రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో తొలిడోసు టీకాను 100 శాతాన్ని అధిగమించగా.. 74.08 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తిచేసింది. కరోనా కట్టడికి రూ.3,683 కోట్లు ఇక ఈ ఏడాది నవంబర్ 24 నాటికి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,683.05 కోట్లు ఖర్చుచేసింది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న సమయంలో మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగింది. ప్రణాళికాబద్ధంగా ఆక్సిజన్, మందులు సరఫరా చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. ఈ అనుభవాలతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన 175 ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటుచేసింది. తద్వారా 24,419 పడకలకు ఆక్సిజన్ సరఫరా సమకూరుతోంది. ఆసుపత్రుల్లో విప్లవాత్మక మార్పులు మరోవైపు.. మొత్తం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్ ప్రభుత్వం నాడు–నేడు కింద శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కోసం ఆసుపత్రుల్లో వసతుల కల్పన, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ.16,255 కోట్లు ఖర్చుచేస్తోంది. ఇందులో భాగంగా 2021లో 14 మెడికల్ కళాశాలల నిర్మాణానికి ఈ ఏడాది మే 31న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. నిజానికి రూ.7,880 కోట్లతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. అలాగే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా భారీగా నియామకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు, కొత్తగా పోస్టులను సృష్టించి అక్టోబర్, నవంబర్ నెలల్లో 14,818 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేసింది. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తి అయ్యాయి. మరికొన్నింటి ప్రక్రియ కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరిలో ఇది మొత్తం పూర్తికానుంది. నీతి ఆయోగ్ ప్రశంసలు దేశంలో మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్న అత్యంత తక్కువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటని నీతి ఆయోగ్ ప్రశంసించింది. అంతేకాక.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసానిస్తోందని పేర్కొంది. నీతి ఆయోగ్ వెల్లడించిన 2019–20 ఆరోగ్య సూచీల్లో దేశంలో రాష్ట్రానికి నాలుగో ర్యాంకు దక్కింది. మాత, శిశు మరణాల కట్టడిలో ప్రభుత్వం సుస్థిర లక్ష్యాలను సాధించినట్లు ప్రశంసించింది. అలాగే, గతంతో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ స్పెషలిస్ట్ వైద్యుల కొరత, ఆసుపత్రుల్లో వసతుల కల్పన మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది. ఇక రాష్ట్రంలో ప్రజారోగ్యం మెరుగుపడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గుడ్ గవర్నెన్స్ 2020–21 నివేదికలో పేర్కొంది. గతంతో పోలిస్తే పీహెచ్‌సీల్లో వైద్యుల అందుబాటు 6 శాతం పెరిగినట్లు తెలిపింది. కోవిడ్ కట్టడికి గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్ఎంల ద్వారా ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్ మెచ్చుకుంది. రోగుల హోమ్ ఐసోలేషన్, వారి ఆరోగ్య పరిస్థితి నిత్య పర్యవేక్షణ, ఇతర చర్యలు భేషుగ్గా ఉన్నాయని తన అధ్యయనంలో పేర్కొంది. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: కోవిడ్, వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ముఖ్యమంత్రి ఆదేశాలు.. ►అధికారులు వ్యాక్సినేషన్‌ను మరింత ఉద్ధృతంగా చేయాలి..కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలి. ►వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారనేది మీ ముందున్న టాస్క్. టార్గెట్ పెట్టుకుని మరీ వ్యాక్సినేషన్ చేయండి. ►అందరూ కూడా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవడమే కాక జనాలు గుమిగూడకుండా చూడాలి. ►మాస్క్ విషయంలో మళ్ళీ డ్రైవ్ చేయండి, గతంలో ఉన్న నిబంధనలు అమలుచేయండి. ►క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే జరగాలి.. డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే రెండూ చేయండి. ►ఆక్సీజన్ పైప్లైన్లు సరిగ్గా ఉన్నాయా.. లేవా.. డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా చూసుకోండి. ►గతంలో కోవిడ్ చికిత్సకోసం వాడుకున్న అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా.. లేవా.. సరిచూసుకోండి. ►ఎంప్యానల్ ఆసుపత్రులలో వసతులు సరిగా ఉన్నాయా లేదా చూసుకోండి. ►క్వారంటైన్ సెంటర్స్, కోవిడ్ కేర్ సెంటర్స్, కోవిడ్ కాల్ సెంటర్లను తిరిగి పరిశీలించండి. ►ఏ అనారోగ్య సమస్య ఉన్నా 104కు కాల్ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలి. ►జిల్లా స్ధాయిలో కలెక్టర్లను, లైన్ డిపార్ట్మెంట్లను సిద్దం చేయండి. అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యం... ►మాస్క్‌కు సంబంధించిన గైడ్ లైన్స్ వెంటనే ఎన్ఫోర్స్ చేయండి. ►వ్యాక్సినేషన్ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యం. ►డిసెంబర్ నెలాఖరికల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేయాలన్న టార్గెట్ పెట్టుకోండి, వ్యాక్సినేషన్లో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ►అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సీజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్స్ మాక్ డ్రిల్ చేసుకోవాలని అధికారులకు సూచన, ఎండ్ టూ ఎండ్ అన్నీ కూడా ముందుగా చెక్ చేసుకోవాలి. ►హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో స్పెషల్ మెడికల్ టీమ్స్‌ను ఏర్పాటుచేసి ఏపీకి వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయాలి. ►ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు మాత్రమే చేయండి, ర్యాపిడ్ టెస్ట్‌లు వద్దు. ►టెండర్లు పూర్తయిన మెడికల్ కాలేజీలకు వెంటనే అగ్రిమెంట్లు పూర్తిచేయండి. దేశవ్యాప్తంగా కోవిడ్ పరిస్ధితులు వివరించిన అధికారులు ►ఏపీలో రికవరీ రేట్ 99.20 శాతం, పాజిటివిటీ రేట్ 0.64 శాతం, రోజుకు యావరేజ్‌గా 197 కేసులు నమోదు, యాక్టివ్ కేసులు 2,140 ఉన్నాయి. ►104 కు కాల్స్ కూడా తగ్గిపోయాయని వెల్లడించారు. ►థర్డ్ వేవ్ వస్తే ఎదర్కోవడానికి సన్నద్దంగా ఉన్నమన్నారు. ►అవసరమైన ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్స్ అందుబాటులో ఉంచామన్న అధికారులు, ఆక్సీజన్ డీ టైప్ సిలెండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ►100 బెడ్స్ పైగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు 82.. వ్యాక్సినేషన్ ఒక డోస్ పొందిన వారు 87.43 శాతం.. రెండు డోస్‌లు పొందిన వారు 62.19 శాతం మంది ఉన్నారు. ►డిసెంబర్, జనవరి కల్లా అందరికీ రెండు డోస్‌లు వ్యాక్సినేషన్ పూర్తిచేస్తాం. ఒమిక్రాన్‌పై ఏమన్నారంటే.. ►ఒమిక్రాన్ వేరియంట్లో మరింతగా మ్యుటేషన్స్ జరుగుతున్నందువల్ల చాలా వేగంగా విస్తరిస్తుందని.. ఇది విస్తరిస్తున్న దేశాల గురించి అధికారులు వివరించారు. ►ఈ వేరియంట్ పై వివిధ దేశాల్లో అధ్యయనం జరుగుతుందని వెల్లడించారు. ►ఈ వేరియంట్‌ను కనుగోవాలంటే జీనోమిక్ సీక్వెన్స్ కోసం ప్రతీ రోజూ 15 శాతం శాంపిల్స్ సీసీఎంబీకు పంపుతున్నామని అధికారులు తెలిపారు. ►కేంద్రం చెబుతున్నట్లుగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ►సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా, హంగ్‌కాంగ్ నుంచి వస్తున్న వారిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ►12 దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్రం సూచించిందన్నారు అధికారులు. ►త్వరలోనే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ►విదేశాల నుంచి వస్తున్న వారిలో పాస్‌పోర్ట్‌లో ఏపీ అడ్రస్ ఉన్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు అధికారులు. ఉప ముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి.కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంచార్జి ఏ.బాబు, ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి జీఎస్.నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్ చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్ రెడ్డి, ఏపీవీవీపీ కమీషనర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఇతర ఉన్నతాధికారులు హాజరు. చదవండి: వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం ఒమిక్రాన్ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో.. -
వరి కొనుగోలు కేంద్రాలుండవు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రగతిభవన్‌లో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసింది. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణతో పాటు ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో పంటలసాగుపై కేసీఆర్.. మంత్రులతో చర్చించారు. అనంతరం కోవిడ్ టీకాల పురోగతి, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంపై సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. (చదవండి: 'ప్లాన్'తో పంటలేద్దాం..) యాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుండవు.. సుమారు ఐదు గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో వేసవిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలిపారు. బాయిల్డ్ రైసును కొనబోమని కేంద్రం చేతులెత్తేసిందన్నారు. కనుక రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని.. పంటలసాగుపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. స్వంత వినియోగం, విత్తన కంపెనీలతో ముందస్తు ఒప్పందం కోసం వరి సాగు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం మాత్రం రైతుల నుంచి వరి కొనుగోలు చేయలదేని కేసీఆర్ స్పష్టం చేశారు. వరి ధాన్యం బఫర్ స్టాక్ పెట్టుకోవడం కేంద్రం బాధ్యతని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు. తన సామాజిక బాధ్యతను కేంద్రం విస్మరిస్తోందని అన్నారు. తన విధానాలతో రైతాంగాన్ని కేంద్రం గందరగోళ పరుస్తోందని తెలిపారు. లాభ నష్టాలు బేరీజు వేసుకుంటే అది ప్రభుత్వం అవుతుందా? అని నిలదీశారు. పలు దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిపై చర్చించిన సీఎం కేసీఆర్.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కొత్త వేరియంట్ నేపథ్యంలో ఏవిధంగా అప్రమత్తంగా ఉన్నామన్న దాని గురించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక అందజేశారు. కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేశాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రలకు సూచించారు. చదవండి: ఒమిక్రాన్ గుబులు.. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు 185 మంది -
కంటిని కాపాడుకుందాం!
సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైనది.. ప్రధానమైనది నేత్రాలే. వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం చీకటి మయమే. ఈ అందమైన ప్రపంచాన్ని చూసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరమయ్యే వరకు కళ్లను భద్రంగా చూసుకోవాల్సిందే. వీటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ ఏడాది ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ‘మీ కళ్లను ప్రేమించండి‘ నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా నేత్రాల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. శ్రీకాకుళం అర్బన్: కళ్లను ఎవరూ నిర్లక్ష్యం చేయరాదు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకూ వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. పిల్లల కంటి సంరక్షణలో తల్లి పాత్ర కీలకం. బిడ్డ కళ్లను పరిశుభ్రంగా ఉంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పుట్టిన బిడ్డ కళ్లను తల్లి నిత్యం గమనిస్తూ ఉండాలి. నేత్రాల్లో ఎటువంటి మార్పులు ఉన్న ఆలస్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించాలి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బ్లాక్ బోర్డ్‌పై ఉన్న అక్షరాలు చూడటంలో ఇబ్బంది ఉన్నా, పుస్తకాన్ని, టీవీని దగ్గరుగా చూస్తున్నా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. విద్యార్థి దశలో ప్రతి ఏడాది కంటి పరీక్ష చేయిస్తూ వారి చూపుని పరిరక్షించాలి. దృష్టిలోపం ఉన్నట్లయితే వైద్యుని సలహా మేరకు కళ్లద్దాలు వాడాలి. ఆధునిక జీవనశైలి– కంటిచూపుపై దుష్పరిణామాలు గతంలో పిల్లలకు తల్లి చందమామని చూపిస్తూ ఆహారం తినిపించేది. ఇప్పుడు సెల్‌ఫోన్ చూపిస్తూ తినిపిస్తోంది. దీనివల్ల పిల్లల కళ్లలో సున్నితమైన రెటీనా భాగాలు పాడై చూపు పోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఎక్కువగా సెల్‌ఫోన్ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం వల్ల మెల్లకన్ను, దృష్టి లోపంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు ఏర్పడుతున్నాయి. అందువల్ల వీలైనంత వరకు పిల్లలకు సెల్ ఫోన్ అందుబాటులో ఉంచకూడదు. ఇక సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవారు, కళాశాల విద్యార్థులు, కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ఉపయోగించినపుడు కళ్ల పట్ల శ్రద్ధ వహించాలి. స్క్రీన్‌పై వెలుతురు పడకుండా, కంటిపై నేరుగా గాలి తగలకుండా చూడాలి. కళ్లకు మధ్యలో విశ్రాంతిని ఇస్తూ అవసరమైతే వైద్యులు సూచించిన కంటి చుక్కల మందు ఉపయోగిస్తూ నేత్రాలను పరిరక్షించుకోవాలి. వయోవృద్ధుల్లో భద్రత 35 సంవత్సరాలు దాటిన చాలామందిలో చదివేటప్పు డు ఇబ్బందికరంగా ఉంటుంది. మధుమేహగ్రస్తులు, రక్తపోటు ఉన్నట్లయితే ప్రతి ఏడాది తప్పనిసరిగా నేత్ర వైద్యుని సంప్రదించాలి. దానివలన శాశ్వత అంధత్వాని కి గురికాకుండా కళ్లను భద్రంగా ఉంచుకున్నవారవుతా రు. ఎవరికైనా గ్లకోమా ఉన్నట్లేనా ప్రతి ఏడాది సంపూర్ణ కంటి పరీక్ష తప్పనిసరి. ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కంటిపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడగానే బీపీ, సుగర్ వ్యాధులకు గురవుతున్నారు. అటువంటి వారు డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. నిర్లక్ష్యం వద్దు కంటి చూపు, సంరక్షణ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చాలా అవసరం. ఏదైనా ఇబ్బంది గమనించినట్లయితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చాలామంది సరైన సమయంలో వైద్యులను సంప్రదించకపోవడంతో శాశ్వత అంధత్వానికి గురవుతున్నారు. – ఎం.ఆర్.కె.దాస్, పారామెడికల్ ఆప్తాల్మిక్ అధికారి అశ్రద్ధ చేయకండి మనిషి జీవితంలో ప్రతీది దృష్టితో ముడిపడి ఉంది. అందుకే కళ్లను నిర్లక్ష్యం చేయరాదు. ప్రస్తుత జీవన విధానంలో వస్తున్న మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులతో కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆరు నెలలకు ఒక్కసారి కంటి వైద్యుడ్ని సంప్రదించాలి. – డాక్టర్ వి.దినేష్కాంత్, రెటీనా నేత్ర వైద్య నిపుణులు జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో దశ కింద గత ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఈనెల 12వ తేదీ వరకూ నేత్ర పరీక్షలు ఇలా.. 60 ఏళ్లకు పైబడిన ఉన్న వృద్ధులు: 3,24,764 మంది కంటి పరీక్షలు చేసినవారి సంఖ్య: 96,128 ఉచిత కళ్లద్దాలకు సిఫారసు చేసిన వారి సంఖ్య: 41,995 కాటరాక్ట్ రిఫర్ చేసిన వారి సంఖ్య :11,857 శస్త్ర చికిత్సలు చేసిన వారి సంఖ్య : 9,600 స్క్రీనింగ్ బృందాలు : 27 చిన్నారి చూపు కార్యక్రమం ద్వారా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కంటి పరీక్షలు చేసిన విద్యార్థుల సంఖ్య: 3,69,371 కంటి అద్దాలకు రిఫర్ చేసిన వారి సంఖ్య: 12,089 కంటి శుక్లాలు ఉన్న విద్యార్థులు: 14 మెల్లకన్ను శస్త్ర చికిత్సలు : 10 -
అదుపులోనే కరోనా.. మూడో వేవ్ వస్తే సర్వం సిద్ధం: తెలంగాణ కేబినెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖపై చర్చిస్తున్నారు. మొదట కొవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్రాల్లో కరోనా స్థితిగతులు, కట్టడి చర్యలపై వైద్యాధికారులు మంత్రివర్గానికి వివరించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో పరిస్థితులు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అవకాశం: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్రంలో విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతరం కరోనా కేసుల్లో పెరుగుదల లేదని, మహమ్మారి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో ఉంన్నాయని చెప్పారు. ఇప్పటివరకు రెండు కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుంచి ప్రారంభమైందని, ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని మంత్రివర్గం తెలిపింది. ఇందులో భాగంగా రోజుకు 3 లక్షల టీకాలు వేసేలా పూర్తి సన్నద్దతతో ఉండాలని మంత్రివర్గం నిర్దేశించింది. అవకాశం: రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు కొత్త వైద్య కళాశాలలు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్అండ్బీ, వైద్యారోగ్య శాఖను మంత్రివర్గం ఆదేశించింది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ ఏర్పాటుపై సమీక్షించారు. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, మరింత పెంచి 550 గతంలో 130 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను మంత్రివర్గం ఆదేశించింది. రూ..133 కోట్లతో బెడ్స్, మందులు, ఇతర సామగ్రిని, చిన్నపిల్లల వైద్యం కోసం 5,200 బెడ్లు, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు వివరించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్దికి సమగ్రమైన ప్రణాళికలను సిద్దం చేసుకుని తదుపరి మంత్రివర్గ సమావేశానికి తీసుకురావాలని వైద్య శాఖాధికారులను ఆదేశించింది. మంత్రివర్గ నిర్ణయాలు గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే యేడాది నుంచి మద్యం దుకాణాల్లో.. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడయిన రోడ్ల మరమ్మతుకు ఇప్పటికే కేటాయించిన రూ.300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ. రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కోరిక మేరకు, నారాయణగూడలో 1,261 గజాల స్థలాన్ని, బాలికల వసతి గృహ నిర్మాణం కోసం కేటాయింపు. -
Covid Cases in India: 2 కోట్లు దాటిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా నమోదవుతోన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్తంత తగ్గింది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 3,57,229 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా సంక్రమించిన వారి సంఖ్య మొత్తంగా 2,02,82,833కు పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కేసులున్న రెండో దేశంగా భారత్ కొనసాగుతోంది. భారత్‌లో సంక్రమణ వేగం చాలా వేగంగా ఉంది. కేవలం 137 రోజుల్లో కరోనా సంక్రమణ కేసులు ఒక కోటి నుంచి రెండు కోట్లకు చేరుకున్నాయి. అంటే నాలుగు నెలల్లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. అంతకుముందు వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష నుంచి ఒక కోటికి చేరుకోవడానికి 360 రోజులు పట్టింది. అదే సమయంలో 3,449 మంది మరణించారు. వరుసగా ఏడు రోజులుగా 3 వేల మంది రోగులకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం వారంలో గణాంకాలను చూస్తే, ఈ వారంలో మరణాల సంఖ్య 41% పెరిగింది. ఈ సమయంలో 24,514 మంది రోగులు మరణించారు. ప్రపంచంలోని టాప్–10 దేశాలతో పోలిస్తే, భారత్‌తోపాటు టర్కీ, అర్జెంటీనా, జర్మనీ, కొలంబియా తదితర దేశాల్లో మరణాల సంఖ్య పెరిగింది. అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇరాన్ వంటి మిగతా దేశాల్లో గత వారంతో పోలిస్తే ప్రస్తుతం కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే గత 24 గంటల్లో కరోనా నుండి కోలుకున్న రోగుల సంఖ్య 3 లక్షల 20 వేల 289 గా ఉంది. ఇది దేశంలో మారుతున్న పరిస్థితులకు అద్దంపడుతోంది. దీంతో దేశంలో ఇప్పటివరకు 1 కోటి 66 లక్షల 13 వేల 292 మంది కోలుకున్నారు. దేశంలో కోవిడ్ సంబంధ గణాంకాలు ♦గత 24 గంటల్లో కొత్త కేసులు: 3,57,229 ♦10 రాష్ట్రాల్లోనే 71% కొత్త కేసులు ♦మొత్తం మరణాలు: 3,449 ♦గత 24 గంటల్లో కోలుకున్న రోగులు: 3,20,289 ♦గత 24 గంటల్లో చేసిన కరోనా టెస్ట్‌లు: 16,63,742 ♦దేశంలో పాజిటివిటీ రేటు: 21.47% ♦యాక్టివ్ కేసుల సంఖ్య: 34,47,133 ♦ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య: 2,02,82,833 ♦కోలుకున్న వారు: 1,66,13,292 ♦రికవరీ రేటు: 81.19% ∙మొత్తం మరణాలు: 2,22,408 ♦వ్యాక్సిన్ డోస్‌లు: 15,89,32,921 -
ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు!
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 35,962 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,096 కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన 20 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 2,194 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 9 లక్షల 5వేల 266 మంది కరోనా నుండి కోరుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 35,592 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,56,06,163 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. -
ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికారులు కీలక మార్పులు చేశారు. జాబితాలో పేరుండీ నిర్దేశిత రోజున వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తే వారికి మరోసారి టీకా వేసే అవకాశం ఇవ్వరాదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవడానికి కేటాయించినరోజు రాకపోతే, అందుబాటులో ఉన్న ఇతర అర్హులైన వారికి వేయాలని, తద్వారా వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు వేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, చాలాచోట్ల ఆరోజు నిర్దేశించిన జాబితాలోని వారందరూ రావడంలేదు. కొన్నిచోట్ల 60 శాతం, మరి కొన్నిచోట్ల 70 శాతం మంది టీకాలకు వస్తున్నారు. మరికొందరు తీసుకోవ డానికి తిరస్కరిస్తున్నారు. దీంతో నిర్ణీత తేదీన వేయాల్సిన వ్యాక్సిన్ టార్గెట్ పూర్తి కావడం లేదు. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యమవుతోంది. ఉదాహరణకు ఈ నెల 19న 73,673మంది లబ్ధిదారులను లక్ష్యంగా నిర్దేశించగా 51,997 మందికే టీకాలు వేశారు. అంటే ఆరోజు వేయాల్సినవారిలో ఇంకా 21,676 మంది రాలేదు. అందుకే ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. చదవండి: (వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి.. కేంద్ర ప్రభుత్వం ఆరా) అప్పటికప్పుడు ఇతరుల పేర్లు నమోదు చేసి టీకా నిర్ణీత కేంద్రంలో ఎంతమందికి టీకా వేయాలన్న వివరాల జాబితా సంబంధిత అధికారి వద్ద ఉంటుంది. కోవిన్ యాప్‌లో అవన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఎవరెవరికి ఎప్పుడు వేయాలో తేదీ, టైం స్లాట్ ప్రకారం లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వెళ్తాయి. ఆ ప్రకారం లబ్ధిదారులు వస్తారు. ఇది సాధారణంగా జరిగే వ్యాక్సినేష¯Œ ప్రక్రియ. అయితే, చాలామంది గైర్హాజరుకావడం వల్ల లక్ష్యం నెరవేరడంలేదు. కాబట్టి గైర్హాజరైన వారి స్థానంలో అప్పటికప్పుడు అర్హులైన ఇతర లబ్ధిదారులకు టీకా వేస్తారు. అప్పటి కప్పుడు వారు అదేరోజు వ్యాక్సిన్ వేసుకు న్నట్లు కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో వివరాలను నమోదు చేస్తారు. మున్ముందు ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి టీకాలు వేసే టప్పుడు, ఫ్రంట్‌లై¯Œ వర్కర్లకు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు. సాధారణ ప్రజలకు వేసేటప్పుడు కూడా ఇలాగే ఉండొచ్చని అంటున్నారు. ఇలా చేయకుంటే టార్గెట్ పూర్తికాక మానవ వనరులు, సమయం వృథా అవుతాయని భావిస్తున్నారు. తిరస్కరిస్తే మరోసారి టీకా వేయరు... కరోనా టీకా వేసుకోబోమని ఎవరైనా వచ్చి తిరస్కరిస్తున్నట్లు చెబితే, దాన్ని కోవిన్ యాప్‌లో నమోదు చేస్తారు. అలా ఒకసారి తిరస్కరిస్తున్నట్లు యాప్‌లో నమోదైన తర్వాత మరోసారి వారికి టీకాలు వేసే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. యాప్‌ను ఆ విధంగా తీర్చిదిద్దుతారని చెబుతున్నారు. ఇదిలావుండగా ఇప్పటివరకు కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కారమైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నుంచి 99.9 శాతం యాప్ ద్వారానే వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. ఇప్పటివరకు మూడు రోజులపాటు వ్యాక్సినేషన్‌ను 50 శాతం యాప్ ద్వారా, మరో 50 శాతం మాన్యువల్ పద్ధతిలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. గురువారం నిర్దేశించిన అన్ని కేంద్రాల్లో 35 వేలమందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. -
రాష్ట్రంలో డిసీజ్ మ్యాపింగ్: ఈటల
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఫ్లోరైడ్, మలేరియా, బోదకాలు.. తదితర జబ్బులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయన్న దానిపై ‘డిసీజ్ మ్యాపింగ్’ చేయాలి. దానికి అనుగుణంగా ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్లు, మందులుండేలా చూడాలి’ అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణ లకు శ్రీకారం చుట్టాలని ఈటల ఆదేశించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో, ఇతర ఆసుపత్రుల్లో ఏం జరుగుతుందో.. హైదరాబాద్‌లో కమాండ్ కం ట్రోల్ సెంటర్లో ఉండి చూడగలిగే విధంగా ఏర్పాట్లు చేయాలన్నా రు. పీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న మందుల గడువు వివరాలను కంప్యూటరీకరించాలని సూచించారు. పీహెచ్‌సీల్లో అనవసర మందు లుంచవద్దన్నారు. మొదటిసారి గడువు ముగిసిన మందులను కంపెనీలకు తిప్పి పంపి డబ్బులు వెనక్కి తీసుకున్నా మ న్నారు. ప్రభు త్వాసుపత్రుల్లో రెఫరల్ విధా నం, ఆశ వర్కర్లు రోగులను పెద్దాసుపత్రులకు పంపించే విధానం అమలు కావాలన్నా రు. ప్రతి ఆసుపత్రిలో రిసెప్షన్ సెంటర్ ఉం డాలన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బంధువులకు ఎప్పటికప్పుడు చెప్పాలన్నారు. -
డాక్టర్ వైఎస్సార్ టెలి మెడిసిన్‌ను ప్రారంభించిన సీఎం
-
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించి..ఆ మేరకు జీతాలు పెంచాల్సిందిగా సూచించిన నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వైద్యుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలను సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌కు.. నివేదికలోని అంశాలను సుజాతారావు వివరించారు. ఈ క్రమంలో కమిటీ చేసిన 100కు పైగా సిఫారసుల గురించి సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లోని పలు లోపాలను కూడా కమిటీ బయటపెట్టింది. ఈ క్రమంలో ఈ విషయాలపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మన విద్యావ్యవస్థల్లో సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వృత్తివిద్యా కోర్సు ఏదైనా సరే.. చివరి ఏడాది వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండాలని.. అప్రెంటిస్ అన్నది పాఠ్యప్రణాళికలో ఒక భాగం కావాలని పేర్కొన్నారు. చదువుకున్నదాన్ని ఏవిధంగా అమల్లో పెట్టాలన్నదానిపై పాఠ్యప్రణాళికలో ఉండాలని..ఈ అంశంపై సూచనలు చేయాల్సిందిగా నిపుణుల కమిటీకి సూచించారు. ఆయన కొనసాగిస్తూ... ‘ప్రభుత్వాసుపత్రుల దశ,దిశ మారుస్తాం. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతలేకుండా, సదుపాయాలు కల్పించగలిగితేనే వ్యవస్థ బతుకుతుంది. రోగులు ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా ఉండాలి. బెడ్లు, దిండ్లు, బెడ్షీట్లు, బాత్రూమ్స్, ఫ్లోరింగ్, గోడలు వీటన్నింటినీ కూడా మార్చాలి. ఫ్యాన్లు, లైట్లు అన్నీకూడా సరిగ్గా పనిచేయాలి. అవసరమైన చోట ఏసీలు ఏర్పాటు చేయాలి. ఈ మార్పులు చేయగలిగితేనే ప్రభుత్వ ఆస్పత్రుల మీద ప్రజల దృక్పథం మారుతుందని సంబంధిత అధికారులతో పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో కొన్ని సీఎం జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు-నవంబర్ 1 నుంచి ప్రారంభం డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు కింద అమలు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్ ప్రాజక్ట్ అమలు మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్ ప్రాజెక్టు కింద అమలు వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ఏప్రిల్ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ జిల్లాల వారీగా అమలు ప్రారంభం ఆపరేషన్ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం కాగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్‌ను విస్తరించడంపై సమావేశంలో చర్చ జరిగింది. ఇక తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రభుత్వం ఇప్పటికే రూ.10వేల పెన్షన్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరీ కిందకు తీసుకు వచ్చి వారికి కూడా నెలకు రూ. 5వేలు ఇవ్వాలని..ఆ మేరకు మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలు ఆరోగ్య రంగంలో ప్రభుత్వం దృక్పథం మారాలి దీర్ఘకాలిక వ్యాధులపై దృషిపెట్టాలి ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజలు పెద్దగా రావడంలేదు జాతీయస్థాయితో పోలిస్తే చాలా తక్కవ మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు: ఆరోగ్యరంగంలో బడ్జెట్ చాలా వరకు జీతాలకే సరిపోతుంది పెద్దసంఖ్యలో ఉన్న సిబ్బంది సేవలను సమర్థవంతగా వాడుకోవాలి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరికరాలను కల్పించాలి మందుల కొనుగోలు, వ్యాధినిర్దారణ పరీక్షలు ప్రజలకు భారంగా మారాయి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో స్పష్టత, బాధ్యత రెండూ లేవు సరైన సమీక్ష, పర్యవేక్షణఉండడంలేదు రోజువారీ పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి ఒకరు చేసే పనిని ఇంకొకరు చేస్తున్నారు, డూప్లికేషన్ అధికంగా ఉంది ఆస్పత్రుల్లో పరికరాలన్నీ పాతబడ్డాయి ఇది నాది అన్న భావన ఉండడం లేదు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి వ్యాధి నిరోధకతపై దృష్టిపెట్టాలి 30 శాతం మంది హృద్రోగ, క్యాన్సర్‌లాంటి వ్యాధుల అంశాలతో బాధపడుతున్నారు మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలి ప్రతి 5వేలమందికి ఒక సబ్ సెంటర్‌ఉండాలి ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి ప్రతివేయి మందికి జనాభాకు విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి చిన్న చిన్న వాటికి అక్కడికక్కడే చికిత్స అందించాలి రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్న వారు సుమారు కోటిమంది ఉన్నారు వారి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి యూత్ క్లబ్బుల తరహాలో క్లబ్బులను ఏర్పాటుచేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలి సబ్సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాల్సి ఉంది ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలి ప్రతి పీహెచ్సీలో ముగ్గురు వైద్యులు ఉండాలి ఒక కౌన్సెలర్ లేదా సోషల్ వర్కర్ ఉండాలి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు నడిచేలా చూసుకోవాలి 2 బెడ్ ఐసీయూ సదుపాయం ఉండాలి ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించాలి..వారి బేసిక్ శాలరీని పెంచాలి ప్రభుత్వ డాక్టరుచేత ప్రైవేటు హాస్పటిల్‌లో ఆరోగ్య శ్రీ కేసు చేయిస్తే సీరియస్‌గా తీసుకుని, ఆ ఆస్పత్రిని జాబితా నుంచి తప్పించాలి ప్రతి లక్ష జనాభాకు కమ్యూనిటీ హాస్పటల్ ఉండాలి కచ్చితంగా ఫ్యామిలీ మెడిసిన్‌లో ఎండీ చేసిన వారి పర్యవేక్షణలో ఆస్పత్రి సామాజిక ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేయడానికి సదుపాయాలు ఆప్తమాలజీ, ఈఎన్టీ కేర్ స్పెషలిస్టులు ఉండాలి అన్ని మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండాలి టీచింగ్, నాన్ టీచింగ్ కేటగిరీలను వేర్వేరుగా చేయాలి హెచ్ఆర్ బాధ్యతలనుంచి వైద్యులను తప్పించాలి ఏడాదికి రెండు వారాలు హెచ్ఆర్లో శిక్షణ ఇవ్వాలి..ఖాళీలను భర్తీ చేయాలి నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి మరిన్ని కాలేజీలను ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో నర్సింగ్ విద్య పటిష్టంగా లేదు నర్స్ ప్రాక్టీషినర్స్‌కు ప్రత్యేక కేడర్ ఏర్పాటు చేయాలి నర్సింగ్కు దేశవ్యాప్తంగా, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలను, వసతులను పెంచాలి జిల్లా ఆస్పత్రుల స్థాయిని 500 బెడ్లకు పెంచాలి బోధనాసుపత్రుల్లో 2వేల బెడ్లవరకూ పెంచాలి 30 మహిళా ఆరోగ్య కేంద్రాలను 500 బెడ్లతో ఏర్పాటు చేయాలి ప్రసవాలకోసం, మహిళల ఆరోగ్యం కోసం ఈ కేంద్రాలను వినియోగించవచ్చు డ్రగ్ రెగ్యులేటరీ కమిటీ ఉండాలి, దాన్ని బలోపేతం చేయాలి కనీసం 150 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి ప్రతి మందుల దుకాణంలో అమ్ముతున్న మందుల కంప్యూటరీ కరణ ఉండాలి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందుకున్న రోగికి ఏ సేవలు అందాయన్నదానిపై ఒక రశీదు ఇవ్వాలి ఎంత విలువైన వైద్యం ఉచితంగా అందిందన్న దానిపై ఆ రశీదులో పేర్కొనాలి వైద్యం మీద ప్రజల ప్రస్తుతం 62శాతం ఖర్చు చేస్తున్నారు దాన్ని 2025 నాటికి 30 శాతానికి తగ్గించాలి -
వైద్య విధాన పరిషత్ డాక్టర్లకు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో పనిచేస్తున్న స్పెష లిస్టు వైద్యులకు వైద్యఆరోగ్య శాఖ షాక్ ఇచ్చింది. వైద్య విద్య అధ్యాపకుల పోస్టులకు సంబం ధించి అసిస్టెంట్ పోస్టుల నియామకాల్లో టీవీవీ పీ డాక్టర్లకు మొండిచేయి చూపింది. ఇన్ సర్వీస్ కోటా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో నిబంధనల ప్రకారం టీవీవీపీ స్పెషలిస్టు డాక్టర్లకు అవకాశమివ్వాలి. కానీ వైద్య విద్య అధ్యాపకుల నియామ కాల్లో వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దాంతో తెలంగాణ వైద్యుల సంఘం నేతలు డాక్టర్ లాలూ ప్రసాద్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ నరహరి ఆధ్వర్యంలో డాక్టర్లు సోమ వారం మంత్రి ఈటల రాజేందర్‌ను సచివాల యంలో కలిశారు. తమకు జరిగిన అన్యాయా న్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇన్ సర్వీస్ కోటా భర్తీపై జీవో నెంబరు 154లో వైద్య విద్య కళాశాలల్లో పనిజేస్తున్న ట్యూటర్లు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, టీవీవీపీలో పీజీ అర్హత ఉన్న వారంతా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అర్హులు. ఆ మేర కు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో టీవీవీపీ లో 120 మంది డాక్టర్లు, ప్రజారోగ్య సంచాల కుల పరిధిలో 220 మంది వైద్యులు దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి అసిస్టెం ట్ ప్రొఫెసర్‌గా పోస్టింగ్ ఖాయమని టీవీవీపీ వైద్యులు భావించారు. కానీ డీహెచ్ పరిధిలో ఉన్నవారికే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అవకాశమివ్వాలని వైద్యారోగ్యశాఖ సర్క్యులర్ ఇచ్చింది. ఈ విషయాన్ని వైద్య విద్యా సంచాలకులు దృష్టి కి తీసుకొచ్చారు. ఉపయోగం లేకపోవడంతో ఈటలను కలిశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు. -
గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు
సాక్షి, నల్లగొండ టౌన్: జిల్లా కేంద్రంలో లింగనిర్ధారణ పరీక్షల దందా మూడు పూలు..ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రం నడిబొడ్డులోనే అధికారుల కళ్లు గప్పి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లింగనిర్ధారణ పరీక్షలను కొనసాగిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్యను పెంచుకుందామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నప్పటికీ లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించి ఆడపిల్ల అని తేలితే తల్లికడుపులోనే చిదిమేస్తున్న తీరు బాధాకరం. ఇప్పటికే ప్రతి వెయ్యిమంది బాలురకు కేవలం 922 మంది బాలికలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖగణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొందరు వైద్యులు సిండికేట్‌గా ఏర్పడి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ స్కానింగ్ సెంటర్‌ను ప్రోత్సహిస్తూ లింగనిర్ధారణ పరీక్షల కోసం కేసులను రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్ సెంటర్లో భాగస్వాములుగా ఉన్న వైద్యులతోపాటు మరికొంత మంది వైద్యులు స్కానింగ్‌ల పేరుతో గర్భిణులను పంపించి గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలను చేయిస్తున్నారన్నది విశ్వసనీయ సమాచారం. గర్భిణి వెంట వచ్చిన వారిని మాటల్లో కలిపి.. ప్రతి గర్భిణి నెలనెలా వైద్య పరీక్షల కోసం వైద్యుల వద్దకు వెళ్తుంటారు. బిడ్డ ఎదుగుదలకు వెళ్లిన సమయంలో డాక్టర్లు వారి అమాయకత్వాన్ని, బిడ్డ ఆడ, మగ తెలుసుకోవాలన్న ఆతృతను గమనిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని స్కానింగ్ తీయించుకోమని ఉచిత సలహా ఇవ్వడంతోపాటు నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రం నడిబొడ్డులో గల స్కానింగ్ సెంటర్‌కు రెఫర్ చేస్తున్నారు. చెకప్‌కు వచ్చే వారి తల్లినో, అత్తనో మాటలలో కలిపి ఆడపిల్ల, మగబిడ్డ అని తెలుసుకోవాలని ఉందా అని అడిగి..వారు ఒకే అన్న వెంటనే సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చి స్కానింగ్‌లో లింగనిర్ధారణ చేసి తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు గర్భిణులకు విషయం తెలియజేయకుండా కేవలం రెఫర్ చేసిన వైద్యులకే లింగనిర్ధారణ రిజల్ట్‌ను వెల్లడిస్తారు. దీంతో అడపిల్ల అని తేలిందని, ఆడపిల్లకావాలా వద్దా అని వారిని అడిగి వద్దు అని సమాధానం వచ్చిన వెంటనే అబార్షన్ చేయించుకోవాలని, దానికి రూ.10 నుంచి రూ15 వేల వరకు, లింగనిర్ధారణలో ఆడ, మగ అని చెప్పినందుకు రూ. 6 నుంచి రూ.10 వేల వరకు వారి వారి స్థాయిని బట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు జాతీయ రహదారిపై ఉన్న పట్టణాలలో మొబైల్ స్కానింగ్ వాహనాలను తీసుకువచ్చి లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించడం విశేషం. ప్రతి నిత్యం పదుల సంఖ్యలో లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నప్పటికి సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అంతరించి పోతున్న ఆడపిల్లలను రక్షించుకోవాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు తూట్లు పొడుస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు , లింగనిర్ధారణ పరీక్షలను నివారించకపోతే ఆడపిల్లలు అంతరించిపోయే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంటోంది. ఆర్ఎంపీలు కూడా అక్కడికే.. ఇప్పటికే ఒక ఆడపిల్ల ఉండి మరోమారు గర్భం దాల్చిన మహిళలు మగపిల్లాడు కావాలని కోరుకుంటారు. అలాంటి వారిని గ్రామాల్లోని ఆర్ఎంపీలు గుర్తించి వారికున్న పరిచయంతో ఆ స్కానింగ్ సెంటర్‌కే రెఫర్ చేస్తుండడం గమనార్హం. ఇలా ప్రతి కేసుకు సదరు ఆర్ఎంపీలకు కమీషన్ వెళ్తుంది.