పోలింగ్ కేంద్రాల్లో వైద్యశిబిరాలు | medical camps in polling centers | Sakshi
Sakshi News home page

పోలింగ్ కేంద్రాల్లో వైద్యశిబిరాలు

Published Wed, Apr 30 2014 12:26 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

medical camps in polling centers

 సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలోని 1,678 పోలింగ్ కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్‌చార్జి అధికారి డాక్టర్ పద్మ మ ంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబి రాల్లో ఒక పారా మెడికల్ సిబ్బంది, ఒక స హాయకుడిని నియమించినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో అత్యవసర చికిత్స, ప్రథ మ చికిత్స అందించడంతోపాటు మందులను  కూడా అందుబాటులో ఉంచుతున్నామని తెలి పారు. అవసరమైన ఓటర్లకు వైద్య సేవలు అం దేలా  మండల వారీగా ప్రత్యేకంగా బృందాల ను ఏర్పాటు చేశామన్నారు. వైద్య సహాయం కోసం జిల్లాలోని పది క్లస్టర్లలో హెల్ప్‌లైన్ నం బర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

 అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌చేసి సహాయం కోరవచ్చ ని ఆమె సూచించారు. ప్రతి మండలానికి ఒక డాక్టర్‌ను నియమించి అద్దె వాహనాల ద్వారా పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. వీరు కాకుండా జిల్లాకు ఐదుగురు ప్రత్యేక పరిశీలకులను నియమించినట్టు ఆమె వివరించారు. పరిశీలకులు ప్రతి రెండు నియోజకవర్గాలను పర్యవేక్షిస్తారన్నారు. క్లస్టర్ హెల్ప్‌లైన్‌లే కాకుండా జిల్లా హెల్ప్‌లైన్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రతి నియోజకవర్గంలో రెండు పెద్ద ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించామని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అత్యవసర వైదాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. ఈ సేవలతోపాటు ఇరవై 104 వాహనాలు, జిల్లాలోని 108 వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు.

 క్లస్టర్                 మొబైల్ నంబర్
 అందోల్                 9866838121
 నర్సాపూర్               9177254007
 సదాశివపేట              9908894923
 రామాయంపేట    7794806176
 కోహీర్              9949463466
 నారాయణఖేడ్    9440225893
 దుబ్బాక            9848515118
 గజ్వేల్              9959750791
 పటాన్‌చెరు        9949607036
 సిద్దిపేట             9848260740
 జిల్లా హెల్ప్‌లైన్ నంబర్లు
 9849903773, 9966024444,
 08455-274824లను సంప్రదించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement