TG: వైద్యారోగ్య శాఖ‌లో మ‌రో 371 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ | Telangana: Job Notification For 371 Posts In Health And Medical Dept | Sakshi
Sakshi News home page

TG: వైద్యారోగ్య శాఖ‌లో మ‌రో 371 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

Published Fri, Oct 11 2024 7:01 PM | Last Updated on Fri, Oct 11 2024 7:05 PM

Telangana: Job Notification For 371 Posts In Health And Medical Dept

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పోస్టుల్లో 272 నర్సింగ్‌ ఆఫీసర్లు, 99 స్టాఫ్‌ ఫార్మాసిస్ట్‌ పోస్టులున్నాయి.

కాగా గత నెలలో 2,050 నర్సింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ 2050 పోస్టుల‌కు అద‌నంగా 272 పోస్టుల‌తో అనుబంధ నోటిఫికేష‌న్ జారీ చేశారు. దీంతో మొత్తంగా 2,322 నర్సింగ్‌ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్టు పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు అయింది. అర్హులైన వారు ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిచ్చింది.. నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement