Omicron Effect CM YS Jagan Review Meeting Health And Medical Dept- Sakshi
Sakshi News home page

Omicron Effect: సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Mon, Nov 29 2021 7:20 PM | Last Updated on Mon, Nov 29 2021 8:35 PM

Omicron Effect CM YS Jagan Review Meeting Health And Medical Dept - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్, వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. ముఖ్యమంత్రి ఆదేశాలు..

అధికారులు వ్యాక్సినేషన్‌ను మరింత ఉద్ధృతంగా చేయాలి..కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలి.
వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారనేది మీ ముందున్న టాస్క్‌. టార్గెట్‌ పెట్టుకుని మరీ వ్యాక్సినేషన్‌ చేయండి.
అందరూ కూడా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవడమే కాక జనాలు గుమిగూడకుండా చూడాలి.
మాస్క్‌ విషయంలో మళ్ళీ డ్రైవ్‌ చేయండి, గతంలో ఉన్న నిబంధనలు అమలుచేయండి.
క్రమం తప్పకుండా ఫీవర్‌ సర్వే జరగాలి.. డోర్‌ టూ డోర్‌ వ్యాక్సినేషన్, ఫీవర్‌ సర్వే రెండూ చేయండి.
ఆక్సీజన్‌ పైప్‌లైన్లు సరిగ్గా ఉన్నాయా.. లేవా.. డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా చూసుకోండి.
గతంలో కోవిడ్‌ చికిత్సకోసం వాడుకున్న అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా.. లేవా.. సరిచూసుకోండి.
ఎంప్యానల్‌ ఆసుపత్రులలో వసతులు సరిగా ఉన్నాయా లేదా చూసుకోండి.
క్వారంటైన్‌ సెంటర్స్, కోవిడ్‌ కేర్‌ సెంటర్స్, కోవిడ్‌ కాల్‌ సెంటర్‌లను తిరిగి పరిశీలించండి.
ఏ అనారోగ్య సమస్య ఉన్నా 104కు కాల్‌ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలి.
జిల్లా స్ధాయిలో కలెక్టర్‌లను, లైన్‌ డిపార్ట్‌మెంట్‌లను సిద్దం చేయండి.

అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యం...
మాస్క్‌కు సంబంధించిన గైడ్‌ లైన్స్‌ వెంటనే ఎన్‌ఫోర్స్‌ చేయండి.
వ్యాక్సినేషన్‌ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యం.
డిసెంబర్‌ నెలాఖరికల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలన్న టార్గెట్‌ పెట్టుకోండి, వ్యాక్సినేషన్‌లో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి:
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సీజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్స్‌ మాక్‌ డ్రిల్‌ చేసుకోవాలని అధికారులకు సూచన, ఎండ్‌ టూ ఎండ్‌ అన్నీ కూడా ముందుగా చెక్‌ చేసుకోవాలి.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో స్పెషల్‌ మెడికల్‌ టీమ్స్‌ను ఏర్పాటుచేసి ఏపీకి వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ చేయాలి.
ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు మాత్రమే చేయండి, ర్యాపిడ్‌ టెస్ట్‌లు వద్దు.
టెండర్లు పూర్తయిన మెడికల్‌ కాలేజీలకు వెంటనే అగ్రిమెంట్‌లు పూర్తిచేయండి.

దేశవ్యాప్తంగా కోవిడ్‌ పరిస్ధితులు వివరించిన అధికారులు
ఏపీలో రికవరీ రేట్‌ 99.20 శాతం, పాజిటివిటీ రేట్‌ 0.64 శాతం, రోజుకు యావరేజ్‌గా 197 కేసులు నమోదు, యాక్టివ్‌ కేసులు 2,140 ఉన్నాయి. 
104 కు కాల్స్‌ కూడా తగ్గిపోయాయని వెల్లడించారు.
థర్డ్‌ వేవ్‌ వస్తే ఎదర్కోవడానికి సన్నద్దంగా ఉన్నమన్నారు.
అవసరమైన ఆక్సీజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ అందుబాటులో ఉంచామన్న అధికారులు, ఆక్సీజన్‌ డీ టైప్‌ సిలెండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
100 బెడ్స్‌ పైగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు 82.. వ్యాక్సినేషన్‌ ఒక డోస్‌ పొందిన వారు 87.43 శాతం.. రెండు డోస్‌లు పొందిన వారు 62.19 శాతం మంది ఉన్నారు. 
డిసెంబర్, జనవరి కల్లా అందరికీ రెండు డోస్‌లు వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తాం.

ఒమిక్రాన్‌పై ఏమన్నారంటే.. 
ఒమిక్రాన్‌ వేరియంట్‌లో మరింతగా మ్యుటేషన్స్‌ జరుగుతున్నందువల్ల చాలా వేగంగా విస్తరిస్తుందని.. ఇది విస్తరిస్తున్న దేశాల గురించి అధికారులు వివరించారు. 
ఈ వేరియంట్‌ పై వివిధ దేశాల్లో అధ్యయనం జరుగుతుందని వెల్లడించారు.
ఈ వేరియంట్‌ను కనుగోవాలంటే జీనోమిక్‌ సీక్వెన్స్‌ కోసం ప్రతీ రోజూ 15 శాతం శాంపిల్స్‌ సీసీఎంబీకు పంపుతున్నామని అధికారులు తెలిపారు.
కేంద్రం చెబుతున్నట్లుగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 
సౌత్‌ ఆఫ్రికా, బోట్స్‌వానా, హంగ్‌కాంగ్‌ నుంచి వస్తున్న వారిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.
12 దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్రం సూచించిందన్నారు అధికారులు.
త్వరలోనే విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
విదేశాల నుంచి వస్తున్న వారిలో పాస్‌పోర్ట్‌లో ఏపీ అడ్రస్‌ ఉన్న వారిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టామన్నారు అధికారులు.

ఉప ముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి.కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంచార్జి ఏ.బాబు, ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి జీఎస్‌.నవీన్‌ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌ రెడ్డి, ఏపీవీవీపీ కమీషనర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్, ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

చదవండి: 
వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

ఒమిక్రాన్‌ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement