
వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతుల కౌన్సెలింగ్
హాజరైన నాలుగు జిల్లాల ఉద్యోగులు
కడప రూరల్ : కడప నగరంలోని పాత రిమ్స్‌లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్ కార్యాలయంలో బుధవారం ఆ శాఖ ఉద్యోగుల పదోన్నతులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న 104 మంది (పురుషులు) మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ) నుంచి మల్టీ పర్పస్ హెల్త్ సూపర్‌వైజర్ (ఎంపీహెచ్‌ఎస్)లకు కౌన్సెలింగ్ జరిగింది.
ఇన్‌చార్జి ఆర్డీ డాక్టర్ ఎన్.దశరథరామయ్య చాంబర్‌లో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించారు.
ఈ సందర్భంగా దశరథరామయ్య మాట్లాడుతూ నిబంధనలు, ఉద్యోగుల సర్వీసు ప్రకారం పదోన్నతులను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ శాఖ డీడీ (అడ్మిన్) ఎల్.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.