సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖపై చర్చిస్తున్నారు. మొదట కొవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్రాల్లో కరోనా స్థితిగతులు, కట్టడి చర్యలపై వైద్యాధికారులు మంత్రివర్గానికి వివరించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో పరిస్థితులు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
అవకాశం: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్
రాష్ట్రంలో విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతరం కరోనా కేసుల్లో పెరుగుదల లేదని, మహమ్మారి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో ఉంన్నాయని చెప్పారు. ఇప్పటివరకు రెండు కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుంచి ప్రారంభమైందని, ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని మంత్రివర్గం తెలిపింది. ఇందులో భాగంగా రోజుకు 3 లక్షల టీకాలు వేసేలా పూర్తి సన్నద్దతతో ఉండాలని మంత్రివర్గం నిర్దేశించింది.
అవకాశం: రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు
కొత్త వైద్య కళాశాలలు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌అండ్‌బీ, వైద్యారోగ్య శాఖను మంత్రివర్గం ఆదేశించింది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ ఏర్పాటుపై సమీక్షించారు. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, మరింత పెంచి 550 గతంలో 130 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను మంత్రివర్గం ఆదేశించింది.
రూ..133 కోట్లతో బెడ్స్, మందులు, ఇతర సామగ్రిని, చిన్నపిల్లల వైద్యం కోసం 5,200 బెడ్లు, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు వివరించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్దికి సమగ్రమైన ప్రణాళికలను సిద్దం చేసుకుని తదుపరి మంత్రివర్గ సమావేశానికి తీసుకురావాలని వైద్య శాఖాధికారులను ఆదేశించింది.
మంత్రివర్గ నిర్ణయాలు
- గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే యేడాది నుంచి మద్యం దుకాణాల్లో.. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం
- రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడయిన రోడ్ల మరమ్మతుకు ఇప్పటికే కేటాయించిన రూ.300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ.
- రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కోరిక మేరకు, నారాయణగూడలో 1,261 గజాల స్థలాన్ని, బాలికల వసతి గృహ నిర్మాణం కోసం కేటాయింపు.
Comments
Please login to add a commentAdd a comment