
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరిగింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్‌లో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆమోదం తెలిపింది. టిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని నిర్ణయించింది. చెస్ట్ ఆస్పత్రి, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణాల్లో ఆస్పత్రుల నిర్మాణం, అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరో ఆస్పత్రి నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్‌డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత అంశాలతో పాటుగా గోదావరి వాటర్ లిఫ్ట్, హైడల్ పవర్ ఉత్పత్తిపై కేబినెట్ చర్చించింది.
చదవండి: లాక్‌డౌన్, బడులు, కర్ఫ్యూనే మంత్రివర్గ అజెండా
రసవత్తరంగా టీపీసీసీ పీఠం: ఐదుగురిలో ఎవరో..?
Comments
Please login to add a commentAdd a comment