పరిపాలనా విభాగంలో కొత్త వివాదం రాజుకుంది. ఇటీవల జిల్లా పరిషత్ సీఈవోగా నియుమితులైన అనితాగ్రేస్‌ను జారుున్ చేసుకోకుండా కలెక్టర్ వెనక్కి పంపించటం చర్చనీయూంశంగా వూరింది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అనితాగ్రేస్‌ను సీఈవోగా నియుమిస్తూ ఈనెల 18న రాష్ట్ర పంచాయుతీరాజ్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. తన బాధ్యతలు చేపట్టేందుకు గురువారం జిల్లాకు వచ్చిన ఆమె కలెక్టర్‌ను కలిశారు. ఆయున వివుుఖత చూపటంతో వెనుదిరిగి వెళ్లారు. గతంలో ఎన్నికల పని చేసిన అనుభవం లేదని, రిటర్నింగ్ ఆఫీసర్‌గా పని చేయుటం కష్టవువుతుందని చెప్పి ఆమెను తిప్పి పంపినట్లు ప్రచారం జరిగింది. అదే సవుయుంలో ఈ వుూడు నెలలపాటు ఎన్నికల విధుల నిర్వహణకు వీలుగా రెవెన్యూ విభాగానికి చెందిన వారిని సీఈవోగా నియుమించాలని రాష్ట్ర పంచాయుతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి కలెక్టర్ ఫాక్స్‌లో లేఖ పంపించినట్లు తెలిసింది.
అప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో కలెక్టర్ ఏకంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం అధికారులందరిలో హాట్ టాపిక్‌గా వూరింది. తావుు జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెట్టడంతో పంచాయుతీరాజ్ విభాగం ఉన్నతాధికారులు సైతం కలెక్టర్ చర్యకు విస్తుపోరుునట్లు ప్రచారం జరిగింది. కేవలం రెవెన్యూ విభాగానికి చెందిన వారే ఎన్నికలు నిర్వహించటానికి సవుర్థులా... అనేది నాన్ రెవెన్యూ విభాగాలకు చెందిన గ్రూప్ వన్ అధికారుల్లో ఆందోళనకు తెర లేపింది.
గతంలో పని చేసిన జెడ్పీ సీఈవోను తిరిగి జిల్లాకు రప్పించే ఆలోచనతోనే కలెక్టర్ ఈ చర్యకు పాల్పడ్డారనే వివుర్శలు వ్యక్తవుయ్యూరుు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేవు శాఖలో డెప్యూటీ డెరైక్టర్ స్థారుు అధికారిగా ఉన్న అనితాగ్రేస్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వైద్య విధాన పరిషత్‌లో సంయుుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు. కలెక్టర్ వివుుఖత వ్యక్తం చేయుటంతో తిరిగి వెళ్లిన అనితాగ్రేస్.. తిరిగి పంచాయుతీరాజ్ విభాగం ఉన్నతాధికారులను ఆశ్రరుుంచినట్లు తెలిసింది. ఈ వరుస పరిణావూలతో ఆమె సీఈవోగా జారుున్ అవుతారా..? వేరే చోట పోస్టింగ్‌కు ప్రయుత్నం చేసుకుంటారా..? అనేది చర్చనీయూంశంగా వూరింది.
జెడ్పీ సీటు..చిచ్చు
Published Mon, Feb 24 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
Advertisement
Advertisement