pachayat raj
-
నిధులున్నా.. మరమ్మతు జాడేది?
జగిత్యాల రూరల్ : ‘అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందంగా ప్రభుత్వం పాఠశాలల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసినా అధికారుల మధ్య సమన్వయం లేక పనులు ముందుకు కదలడం లేదు. దీంతో ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లోనే నిధులు మూలుగుతున్నాయి. వంట గదుల నిర్మాణానికి మంజూరైన నిధులను డిజైన్ లేదనే సాకుతో మురగబెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 218 ప్రభుత్వ పాఠశాలల మరమ్మతు కోసం ఆర్వీఎంఎస్ ద్వారా ఒక్కో పాఠశాలకు రూ.2 లక్షల చొప్పున రూ.4.36 కోట్లను ప్రధానోపాధ్యాయుల ఖాతాలో తొమ్మిది నెలల క్రితం జమ చేసింది. పనులు ప్రారంభించాలని డీఈవో పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈకి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ని ధులు ఆ శాఖ ఆధీనంలో లేవంటూ పనులు చేపట్టేం దుకు ముందుకు రాలేదు. మండలస్థాయిలో ఒకరికి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ అప్పగిస్తామని చెబుతూ కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం పడితే ఊరుస్తున్నాయి. ఎప్పుడు కూలుతాయో ఎవరికీ తెలియడం లేదు. నిధులు మంజూరై.. ఖాతాల్లో మూలుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం సంభవించి.. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే పాఠశాలలకు మరమ్మతు చేయించాలని కోరుతున్నారు. వంట గదులదీ అదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా వంట గదులు నిర్మించాలని ప్రభుత్వం 874 పాఠశాలలకు రూ.13.11 కోట్లు విడుదల చేసింది. వాటిని సీసీవో ఖాతాలో జమచేసింది. అయితే వంట గదుల డిజైన్ లేకపోవడంతో నిర్మాణం ఎలా చేయాలో ఆదేశాలు రాకపోవడంతో ఆ డబ్బులు నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో ఆరుబయటనే వంటలు చేస్తూ వర్షం పడిన రోజు నిర్వాహకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. -
జెడ్పీ సీటు..చిచ్చు
పరిపాలనా విభాగంలో కొత్త వివాదం రాజుకుంది. ఇటీవల జిల్లా పరిషత్ సీఈవోగా నియుమితులైన అనితాగ్రేస్ను జారుున్ చేసుకోకుండా కలెక్టర్ వెనక్కి పంపించటం చర్చనీయూంశంగా వూరింది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అనితాగ్రేస్ను సీఈవోగా నియుమిస్తూ ఈనెల 18న రాష్ట్ర పంచాయుతీరాజ్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. తన బాధ్యతలు చేపట్టేందుకు గురువారం జిల్లాకు వచ్చిన ఆమె కలెక్టర్‌ను కలిశారు. ఆయున వివుుఖత చూపటంతో వెనుదిరిగి వెళ్లారు. గతంలో ఎన్నికల పని చేసిన అనుభవం లేదని, రిటర్నింగ్ ఆఫీసర్‌గా పని చేయుటం కష్టవువుతుందని చెప్పి ఆమెను తిప్పి పంపినట్లు ప్రచారం జరిగింది. అదే సవుయుంలో ఈ వుూడు నెలలపాటు ఎన్నికల విధుల నిర్వహణకు వీలుగా రెవెన్యూ విభాగానికి చెందిన వారిని సీఈవోగా నియుమించాలని రాష్ట్ర పంచాయుతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి కలెక్టర్ ఫాక్స్‌లో లేఖ పంపించినట్లు తెలిసింది. అప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో కలెక్టర్ ఏకంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం అధికారులందరిలో హాట్ టాపిక్‌గా వూరింది. తావుు జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెట్టడంతో పంచాయుతీరాజ్ విభాగం ఉన్నతాధికారులు సైతం కలెక్టర్ చర్యకు విస్తుపోరుునట్లు ప్రచారం జరిగింది. కేవలం రెవెన్యూ విభాగానికి చెందిన వారే ఎన్నికలు నిర్వహించటానికి సవుర్థులా... అనేది నాన్ రెవెన్యూ విభాగాలకు చెందిన గ్రూప్ వన్ అధికారుల్లో ఆందోళనకు తెర లేపింది. గతంలో పని చేసిన జెడ్పీ సీఈవోను తిరిగి జిల్లాకు రప్పించే ఆలోచనతోనే కలెక్టర్ ఈ చర్యకు పాల్పడ్డారనే వివుర్శలు వ్యక్తవుయ్యూరుు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేవు శాఖలో డెప్యూటీ డెరైక్టర్ స్థారుు అధికారిగా ఉన్న అనితాగ్రేస్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వైద్య విధాన పరిషత్‌లో సంయుుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు. కలెక్టర్ వివుుఖత వ్యక్తం చేయుటంతో తిరిగి వెళ్లిన అనితాగ్రేస్.. తిరిగి పంచాయుతీరాజ్ విభాగం ఉన్నతాధికారులను ఆశ్రరుుంచినట్లు తెలిసింది. ఈ వరుస పరిణావూలతో ఆమె సీఈవోగా జారుున్ అవుతారా..? వేరే చోట పోస్టింగ్‌కు ప్రయుత్నం చేసుకుంటారా..? అనేది చర్చనీయూంశంగా వూరింది. -
అక్రమ నియామకంపై లోకాయుక్త కన్నెర్ర
కోదాడటౌన్, న్యూస్‌లైన్: అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తే ఏనాటికైనా బండారం బయటపడక తప్పదని రుజువు చేస్తున్నది ఈ ఉదంతం. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై కనీస అర్హతలు, ఉద్యోగ వయసు లేకపోయినా తమ బంధువులను కోదాడ గ్రామపంచాయతీలో ఉద్యోగులుగా నియమించుకున్న వైనంపై హైదరాబాద్‌కు చెందిన సుప్రియా ఫౌండేషన్ లోకాయుక్తలో దాఖలు చేసిన కేసు అక్రమార్కుల నిజరూపాన్ని బయటపెట్టింది. కోదాడ గ్రామ పంచాయతీలో జరిగిన ఈ వ్యవహరంలో పాత్రధారులైన నాటి ఈఓతో పాటు సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేసిన డీపీఓ, బదిలీ చేసిన మరో డీపీఓ, డీఎల్పీఓలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశా రు. అర్హత లేకపోయిన కోదాడ గ్రామ పంచాయతీ నాటి పాలకవర్గ పెద్దలతో కుమ్మక్కై తొమ్మిది మంది.. ఎన్‌ఎంఆర్‌లుగా నియమితులయ్యారు. ఆ తర్వాత దొడ్డిదారిన సర్వీస్‌లను రెగ్యులరైజ్ చేయించుకున్నారు. దీనిపై లోకాయుక్తలో కేసు నమోదు కావడంతో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించారు. ఒకరిని ఉద్యోగం నుంచి తొలగించి, జీతం రికవరీ చేయడంతో పాటు అధికారులపై క్రిమినల్ కేసులు నమో దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నియమాకం చెల్లదని స్పష్టం చేసిన డీపీఓ సయ్యద్ గులాం అలీ నియామకంపై ఆరోపణలు రావడంతో 1995లో డీపీఓగా వచ్చిన రామారావు గ్రామ పంచాయతీకి 212 జీఓ వర్తిం చదని, గులాం అలీని ఆ జీఓ ప్రకారం రెగ్యులరైజ్ చేయడం చెల్లదని తిరిగి ఎన్‌ఎంఆర్‌గా కోదాడకు పంపాలని ఉత్తర్వు నంబర్ బీ1/77/98/పీటీఎస్ తేదీ 28-05-95న ఆదేశాలు జారీ చేశారు. దీనిపై గులాం అలీ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌లో జీఓ నంబర్ 2513/1998 ద్వారా సవాల్ చేశారు. కానీ ట్రిబ్యునల్‌లో అతనికి వ్యతిరేకంగా తీర్పురావడంతో పాటు డీపీఓ చర్యలను సమర్థించింది. దీంతో గులాం అలీ ప్రభుత్వానికి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. తనను తొలగించవద్దని సర్వీసును కొనసాగించాలని కో రడంతో పంచాయతీరాజ్ కమిషనర్ ఎస్.చెల్లప్ప మెమో నం బర్ 17490/ఈ/9/98 తేదీ 29-01-1998న దీనిపై స్టేటస్ కో ఇస్తూ సమగ్ర విచారణ చేసి నివేదికను ఇవ్వాలని ఇక్కడి అధికారులను ఆదేశించారు. దీనిని అడ్డుపెట్టుకొని అప్పటినుంచి గులాంఅలీ ఉద్యోగిగా కొనసాగుతునే ఉన్నాడు. బట్టబయలు చేసిన విచారణాధికారి ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ అధికారిగా అప్పటి డీఎల్పీఓ మోహన్గుప్తాను నియమించారు. ఆయన దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను ఏ1/238/98 తేదీ 16-07-98న డీపీఓకు అందజేశారు. దానిలో ఇతను ఉద్యోగంలో నియమింపబడిన నాటికీ 18 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నాడని, అప్పటికీ ఇంకా టైప్ పరీక్ష కూడా పాస్ కాలేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇతను 1988లో ఉద్యోగంలో చేరగా 1994 వరకు ఇంగ్లిష్ లోయర్పరీక్ష కూడా పాస్ కాలేదని స్పష్టం చేశారు. అందువల్ల ఇతని నియామకం చెల్లదని ఆ నివేదికలో పేర్కొన్నారు. లోకాయుక్తను ఆశ్రయించిన సుప్రియా ఫౌండేషన్ ఈ మొత్తం వ్యవహరంపై హైదరాబాద్‌కు చెందిన సుప్రియా ఫౌండేషన్ నిర్వాహకుడు జి.శ్రీనివాసరావు 2394/2011/బీ1 తేదీ 19-10-2001న లోకాయుక్తలో కేసు వేశాడు. దీనిపై స్పందించిన లోకాయుక్తా పూర్తి వివరాలను తెలపాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్రస్తుత పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.నాగిరెడ్డి పంచాయతీరాజ్ కమిషనర్‌కు మెమో నంబర్ 12363/ఇ8/ఎ1/2013 తేదీ 4-01-2014న ఉత్తర్వులు జారీ చేశారు. గులాంఅలీ అనే అతను అసలు ప్రభుత్వ ఉద్యోగే కాదని, ఇప్పటివరకు జీతం పేరుతో తీసుకున్న ప్రజాధనాన్ని రికవరీ చేయడంతో పాటు సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేసిన అప్పటి అధికారులు డీపీఓ కోటిరెడ్డి, బదిలీ చేసిన మరో డీపీఓ రాజారెడ్డి.. ఈ మొత్తం వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న డీఎల్పీఓ హెచ్.జనార్దన్‌రెడ్డి, కోదాడ ఈఓ మున్వర్‌పై యాక్ట్ 2/94 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఉత్తర్వులు జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరినట్టు తెలిసింది. ఇదే విధంగా కోదాడ గ్రామపంచాయతీలో అక్రమంగా నియమించబడి సర్వీస్‌ను క్రమబద్ధీకరించుకున్న మరికొంత మందిపై సుప్రియా ఫౌండేషన్ లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సర్పంచ్‌ని సైతం ప్రశ్నించండి.... 1988లో కోదాడ సర్పంచ్‌గా ఉన్న పి.సత్యబాబును కూడా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తప్పుపట్టారు. అధికారం లేకున్నా నియమాకాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. జీఓనంబర్ 138 పంచాయతీరాజ్ తేదీ 16-03-82 ద్వారా సీనియర్ అసిస్టెంట్కన్నా దిగువగా ఉన్న పోస్టు నియామకాన్ని డీపీఓ భర్తీ చేయాలి. సర్పంచ్‌కు అధికారం లేదు. తీర్మానం ద్వారా ఎందుకు చేయాల్సి వచ్చిందో నాటి సర్పంచ్‌ను సమాధానం కోరాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
తీరిక లేదట!
అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతో నానాపాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు ఎరగా వేయాలని చూస్తున్నారు. వాటిని తామే ప్రవేశ పెట్టించామనే భావనను కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరకు స్త్రీశక్తి భవనాల విషయంలోనూ రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. వాటిని మహిళలు స్వయంగా ప్రారంభించకుంటే తమకు ఎలాంటి ఉపయోగమూ ఉండదని భావించి తాము రిబ్బన్ కటింగ్ చేసే వరకూ వేచి చూడాల్సిందేనంటూ స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీలు)పై ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా జిల్లాలో 30 స్త్రీ శక్తి భవనాలు నెలలు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. జిల్లాలోని ఎస్‌హెచ్‌జీల సభ్యులు మండల సమాఖ్య సమావేశాలను నిర్వహించుకునేందుకు, ఉపాధి హామీ పథకం అమలు తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ఉపయోగపడేలా 63 మండల కేంద్రాల్లోనూ పక్కా భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి స్త్రీశక్తి భవనాలుగా నామకరణం చేసింది. ఒక్కో భవనానికి రూ.25 లక్షల చొప్పున 63 భవన నిర్మాణాలకు రూ.15.72 కోట్ల నిధులను ఉపాధి హామీ పథకం కింద రెండేళ్ల క్రితం మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్, పనుల పర్యవేక్షణను ఐకేపీ అధికారులకు అప్పగించింది. ఐకేపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. 63 భవనాల్లో 50 పూర్తయ్యాయి. పూర్తయిన వాటిలో 20 మాత్రమే ప్రారంభానికి నోచుకున్నాయి. వీటిలోనూ చాలా వరకు నిరుపయోగంగా మారాయి. మిగిలిన 30 భవనాలు ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తున్నాయి. 12 భవనాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఆత్మకూరు మండలంలో ఇంకా పనులే ప్రారంభించలేదు. ఫలితంగా 50 మండల సమాఖ్యల కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఒక్కో భవనానికి నెలకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.లక్ష అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. పంచాయతీరాజ్ అధికారులను సమన్వయపరచి స్త్రీశక్తి భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు ఐకేపీలో ఓ అధికారిణిని ప్రత్యేకంగా నియమించారు. ఆమె కేవలం కార్యాలయానికి పరిమితం అవుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఎన్ని భవనాలు పూర్తయ్యాయన్న సమాచారం కూడా తెలియని స్థితిలో ఉన్నారు. రాజకీయ పెద్దల పెత్తనం ప్రభుత్వ నిధులతో ఎక్కడ ఏ అభివృద్ధి పని చేపట్టినా కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. అధికారులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరగాల్సిన నిర్మాణాలను సైతం తమ అనుచరులు, కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. కాంట్రాక్టర్లు నేరుగా పనులు చేయడానికి నిబంధనలు అంగీకరించక పోవడంతో మహిళల ముసుగులో పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని మండలాల్లో స్త్రీశక్తి భవనాల పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇసుక, ఇటుకలు, ఇనుము తదితర నిర్మాణ సామగ్రి నాసిరకమైనవి వాడుతున్నారన్న ఆరోణలున్నాయి. ప్రస్తుతం నిర్మించిన భవనాల్లో అధిక శాతం నాసిరకంగా ఉన్నట్లు సమాచారం. నాణ్యత లేని తలుపులు అమర్చి బిల్లులు దండుకున్నట్లు తెలుస్తోంది. -
మాటలు కాదు.. మనసు చూడండి
ఆత్మకూరు, న్యూస్‌లైన్: ‘మాటలు కాదు మనసు చూడండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రజల మధ్యలోనే ఉంటా’ అంటూ వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. ఆత్మకూరులోని పంచాయతీరాజ్ అతిథిగృహంలో శుక్రవారం ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన కుమారుడు గౌతమ్‌రెడ్డిని అందరికీ పరిచయం చేశారు. అనంతరం గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఎప్పటికీ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని చెప్పారు. ‘ఇది మా ఆత్మకూరు. ప్రజల మధ్యే ఉంటా. మీ మధ్యలో ఉండి నడిపిస్తాం’ అన్నారు. తాను ఎప్పుడో నియోజకవర్గానికి రా వాల్సి ఉందని, అయితే పార్టీ అధినేత కొన్ని ముఖ్యమైన పనులు అప్పగించడంతో కొంచెం ఆలస్యమైందన్నారు. ‘నేను ఎప్పటికీ మీ వాడినే’ అని అన్నారు. సొంతగడ్డకు మేలు చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు. మీ అందరి ఆశీర్వా దం కోసం వచ్చానని, ఆశీర్వదించాలని కోరారు.గౌతమ్‌రెడ్డి ప్రసంగం అందరిని ఆకట్టుకొంది. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎంపీ మేకపాటిని ఆత్మకూరులో కలిశారు. భారీ ర్యాలీ తొలుత గౌతమ్‌రెడ్డి, ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మురళీధర్ తదితరులు మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి జేఆర్‌పేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజలు నిర్వహించి అక్కడి నుంచి పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులతో కూలిపోయిన దుకాణాలను పరిశీలించారు. అనంతరం దర్గాకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి జెడ్పీ బాలికల ఉన్నతపాఠశాల సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్దకు వెళ్లి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కన్వీనర్లు రాపూరు వెంకటసుబ్బారెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, ఐవీ కృష్ణారెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, కుమారస్వామిరెడ్డి, సంజీవులు, బండ్లమూడి అనిత, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బాలచెన్నయ్య, బాలకొండయ్య, సొసైటీ డెరైక్టర్లు దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, రఘురామిరెడ్డి, మైనార్టీ నేత ఖాజావలి, పాండురంగారెడ్డి, విజయకుమార్, స్థానిక నేతలు సూరా భాస్కర్‌రెడ్డి, పూనూరు రమేష్‌రెడ్డి, ఉల్సా పెంచలయ్య, జమీర్, గుండాల మునిరెడ్డి, జమీర్, గడ్డం శ్రీనివాసులు రెడ్డి, సర్పంచులు వేణుగోపాల్‌రెడ్డి, రఘురామిరెడ్డి పాల్గొన్నారు. హజ్రత్, అమ్మాజీలను దర్శించుకున్న గౌతమ్‌రెడ్డి అనుమసముద్రంపేట : స్థానిక శ్రీహజ్రత్ సయ్యద్ ఖాజా రహంతుల్లా నాయబ్ రసూల్ వారిని వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆత్మకూరులో శుక్రవారం పరిచయ కార్యక్రమం అనంతరం గౌతమ్‌రెడ్డి ఏఎస్‌పేట దర్గాకు వెళ్లారు. గౌతమ్‌రెడ్డితో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డికి దర్గా సజ్జదా నషీన్ షాగులాం నక్షాబంద్ హఫీజ్ పాషా స్వాగతం పలికారు. హజ్రత్, అమ్మాజీల సమాధులపై గలేపులు, పూలచద్దర్లు వేశారు. గౌతమ్‌రెడ్డితో పాటు నాయకులకు దేవుని వస్త్రాన్ని అందజేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నాయకులు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, దేవరపాటి శ్రీనివాసులురెడ్డి, అనంతసాగరం మండల కన్వీనర్ వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
పెరిగిన ఎంపీటీసీ స్థానాలు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ముగిసింది. ఎంపీటీసీ స్థానాల తుది జాబితాను జిల్లా, మండల పరిషత్ అధికారులు మంగళవారం విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్తగా 52 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం గతంలో జిల్లాలో 802 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ఐదు నగర పంచాయతీలతో 37 ఎంపీటీసీ స్థానాలు కనుమరుగై వాటి సంఖ్య 765కు చేరింది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనతో ప్రస్తుతం జిల్లాలో 817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల నుంచి నాలుగు వేల లోపు జనాభా ఉండే విధంగా నియోజకవర్గాలను విభజించారు. మండల జనాభాను 3500తో భాగించి వచ్చిన సంఖ్యకు అనుగుణంగా ప్రాదేశిక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఈ పునర్విభజనపై జిల్లావ్యాప్తంగా 42 అభ్యంతరాలు రాగా, ఆమోదయోగ్యంగా ఉన్న 14 అభ్యంతరాలను పరిష్కరించి, 28 అభ్యంతరాలను తిరస్కరించారు. మంగళవారం విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 21 మండలాల్లోని ఎంపీటీసీ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పు జరగలేదు. తిమ్మాపూర్ మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గగా.. మిగిలిన 35 మండలాల్లో స్థానాల సంఖ్య పెరిగింది. జిల్లా పరిషత్ అధికారులు ఈ జాబితాను బుధవారం పంచాయతీరాజ్ శాఖకు పంపించనున్నారు.