నిజామాబాద్ : కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితాను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సెప్టెంబర్ రెండో, లేదా మూడో వారంలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్‌లో ఎ న్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ముందుగానే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పోలీస్‌శాఖతో పాటు వివి ధ విభాగలైన జైళ్లశాఖ, ఫైర్, ఆర్‌టీఏ(రవాణా), ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్‌లను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 266 సివిల్ కానిస్టే బుల్స్, ఏఆర్ పోస్టులు 134 ఉన్నాయి. వివిధ విభాగాల సంఖ్య హైదరాబాద్ కమిషనర్ పరిధిలో ఉంది.
జిల్లాకు కేటాయింపుల ప్ర కారం జైళ్లశాఖ, ఫైర్, ఆర్‌టీఏ (రవాణా), ఎకై ్సజ్‌శాఖలో కానిస్టేబుల్‌లను భర్తీ చేస్తారు. కానిస్టేబుల్ మెయిన్ పరీక్ష ఫలితాల ను మే 30న పోలీస్ నియామక మండలి ప్రకటించింది. జూన్ 1న ధ్రువపత్రాల పరిశీల న ప్రక్రియ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ఎస్సై పరీక్ష ఫలితాల్లో బాసర జోన్ పరిధిలోని 35 ఎస్సై పోస్టులకు ఎస్సైలను ఎంపిక చేశారు. ఎస్సై పోస్టులకు ఎంపికై న వారి వివరాలను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు(ఎస్బీ) ఎంకై ్వరీ చేశారు.
ఎస్సైగా ఎంపికై న అభ్యర్థులకు మెడి కల్ టెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఎస్సైల ఎంపిక పూర్తి కావడంతో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కానిస్టేబుళ్ల ఎంపికపై దృష్టి సారించింది. జిల్లాలో 5313 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్టిఫి కెట్ల వెరిఫికేషన్ చేశారు. మిగితా విభాగాల పోస్టులు కాకుండా సివిల్, ఏఆర్ పోస్టులకు జిల్లాలోని ఒక్కో పోస్టుకు 13 మంది పోటీ పడుతున్నారు. వీరికి సంబంధించిన అన్ని రికా ర్డులు, ఆయా జోన్లు, పోలీ స్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న ట్లు తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం జరిగే వరకు రెండు నుంచి మూడు వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment