![Telangana DGP Serious Fake Police Notification Viral In Social Media - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/04/4/DGP.jpg.webp?itok=RRgeEP_C)
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 1వ తేదీన నకిలీ లాక్‌డౌన్ జీవో సంగతి మరువక ముందే మరో కలకలం రేగింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రెక్రూట్‌మెంట్ బోర్డు పేరిట నకిలీ నోటిఫికేషన్ శనివారం ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. వాస్తవానికి 2018 నోటిఫికేషన్‌ను మార్ఫింగ్ చేసి 03–04–2021 డేట్‌తో ఫేక్ నోటిఫికేషన్‌ను తయారుచేశారు. దీంతో ఈ ఫేక్ నోటిఫికేషన్‌ను డీజీపీ ఆఫీస్ సీరియస్‌గా తీసుకుంది. సైబర్‌క్రైమ్ పోలీసులతో విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ మహెందర్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment