![Download APP Written Test Hall Tickets - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/10/17/Untitled-2.jpg.webp?itok=KdPC0bj7)
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నేతృత్వంతో జరుగుతున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియామక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18న ఉదయం 8 గంటల నుంచి 23వ తేదీ అర్ధరాత్రి వరకు అభ్యర్థులు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.
అక్టోబర్ 24న రాత పరీక్ష ఉంటుందన్నారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని కలర్ జిరాక్స్ లేదా మామూలు జిరాక్స్ అందుబాటులో పెట్టుకోవాలని, హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఏదైనా సమస్యలుంటే రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment