Telangana DGP
-
2023 కంటే 2024 చాలా బెటర్..
-
‘కాంగ్రెస్ గూండాల దాడి.. ఇదా రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం?’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయటం అధికార దుర్వినియోగం చేయటమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. నిన్న( మంగళవారం) అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ గూండాల దాడి ఘటనలో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ప్రేమ దుకాణం’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ప్రత్యర్థులపై నిర్మొహమాటంగా దాడి చేయడం, అధికార దుర్వినియోగం చేయటమే. పోలీసుల దుర్వినియోగం, దాడిలో భాగం కావడం సిగ్గుచేటు. ఇది రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం. తెలంగాణ డీజీపీ.. ఈ గూండాలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులాగా ప్రేక్షక పాత్ర వహిస్తే.. మేము మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం జరిగేలా చూస్తాం’’ కేటీఆర్ ‘ఎక్స్’లో విమర్శించారు.Yahi Hai Kya Aapki “Mohabbat Ki Dukaan” @RahulGandhi ?Brazenly attacking opponents and abusing power. Shameful that police have become part of the abuse and attack @TelanganaDGP If you don’t act and book these goons and the spectator like cops, we will move the Human Rights… https://t.co/9VL4VjxD31— KTR (@KTRBRS) May 15, 2024 అచ్చంపేటలో కాంగ్రెస్ గూండాల దాడికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ ట్యాగ్ చేశారు. ప్రవీణ్‌కుమార్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్‌పై విధంగా స్పందించారు. -
మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ప్రాణ హాని ఉందని శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు 4+4 గన్మెన్లను కేటాయించాలని పిటిషన్లో కోరారు. శ్రీనివాస్‌గౌడ్ వేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థునను హైకోర్టు నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొంది. శ్రీనివాస్ గౌడ్‌కు గన్మెన్లు అవసరమో? లేదో? తెలపాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలనీ హైకోర్టు డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు.. మార్చి 19కి వాయిదా వేసింది. -
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ధ్వంసం.. ఆగ్రహించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజమంతా ఎంతగానో గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్యని అన్నారు. ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. Demand @TelanganaDGP to take stern action on the perpetrator of this heinous act Strongly condemn the atrocious act of destruction of the statue of Prof. Jayashankar Garu who is widely regarded and respected in Telangana https://t.co/mvkuBHOyxj — KTR (@KTRBRS) January 16, 2024 శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ఓ దుండగుడు.. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేటీఆర్ తన ‘ఎక్స్’ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: పెద్దజాతి కోడిపుంజులకు కేరాఫ్ శివపల్లి -
DGP Anjani Kumar: డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అయితే, అంజనీకుమార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. కాగా, అంజనీకుమార్ తన సస్పెన్షన్‌పై సీఈసీని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కౌంటింగ్ రోజున తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని తెలిపారు. ఎన్నికల రోజున సీఎం రేవంత్ రెడ్డి పిలిస్తేనే తాను ఆయన ఇంటికి వెళ్లినట్టు అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన చెప్పారు. దీంతో, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. #JustIn | Election Commission of India revokes suspension of Telangana DGP Anjani Kumar. He was suspended for meeting Telangana Chief Minister Revanth Reddy while votes for the assembly polls were being counted. pic.twitter.com/7Sk6xSdLkQ — NDTV (@ndtv) December 12, 2023 -
TS: ఎన్నికల నిర్వహణపై నేడు ఈసీ ఆరా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం నేడు(నవంబర్ 1) రాష్ట్రంలో పర్యటించనుంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆరా తీయనుంది. ఈ క్రమంలో అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించనుంది. ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం బుధవారం హైదరాబాద్‌కు రానుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మలతో కూడిన బృందం ఉదయం తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌తో భేటీ అవుతుంది. అనంతరం తనిఖీలు, స్వాధీనాలపై సమీక్షలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమావేశం కానుంది. మధ్యాహ్నాం నోడల్ అధికారులతో సమీక్ష, ఆపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో ప్రత్యేకంగా రివ్యూ కార్యక్రమం సాగనుంది. రేపు కూడా ఈసీ బృందం హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు తదితరాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలుదఫాలుగా కేంద్రం ఎన్నికల సంఘం.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు అధికారులతోనూ సమావేశాలు నిర్వహించింది. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 7న ఉదయం ఏడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం, ప్రచురించడం వంటివి చేయరాదని ఈసీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఒకే విడతలతో పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. -
Falaknuma Express: రైలు ప్రమాద ఘటనపై స్పందించిన డీజీపీ, రైల్వే జీఎం
సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. దర్యాప్తు తర్వాత ప్రమాద కారణాలు తెలుస్తాయని తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని చెప్పారు. మిగతా 11 బోగీలతో సికింద్రాబాద్‌కు రైలును తరలించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని అరుణ్‌కుమార్ పరిశీలించారు. మరోవైపు ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై డీజీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాలిపోయిన బోగీల్లోని ప్రయాణికులను బస్సుల్లో తరలించామని తెలిపారు. All passengers are safely evacuated and shifted in buses after a fire broke out in the Falaknuma Express near Bhongir rural PS limits. Police, Fire Dept, and Railways are working in coordination. So far, no fatalities have been reported. Out of 18 coaches 11 are detached and… pic.twitter.com/TtgD5BzFP6 — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 7, 2023 కాగా యాదాద్రి జిల్లాలోని పగిడిపల్లి వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి 7 బోగీలు దగ్ధమయ్యాయి. ప్రయాణికులు ముందుగానే దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రైలు హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. All passengers are safely evacuated and shifted in buses after a fire broke out in the Falaknuma Express near Bhongir rural PS limits. Police, Fire Dept, and Railways are working in coordination. So far, no fatalities have been reported. Out of 18 coaches 11 are detached and… pic.twitter.com/TtgD5BzFP6 — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 7, 2023 -
ప్రొ.హరగోపాల్‌పై కేసు ఎత్తేయండి: సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉపా చట్టం కింద ప్రొఫెసర్ హరగోపాల్ మీద దాఖలు చేసిన దేశద్రోహం కేసును ఎత్తేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖకు సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. హరగోపాల్ సహా 152 మందిపైనా కేసులు తక్షణమే ఎత్తేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. హరగోపాల్ సహా పలువురు మేధావులపై ఉపా చట్టం కింద కేసులు దాఖలైన పరిణామంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతుండడం, ముఖ్యంగా మేధోవర్గం నుంచి అభ్యంతరాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. 👉 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా-UAPA) కింద హరగోపాల్‌తో పాటు 152 మందిపైనా కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్‌పై యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అయితే ఈ దేశద్రోహం కేసు ఆలస్యంగా.. తాజాగా వెలుగు చూసింది. 👉 పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు పోలీసులు. అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను ప్రస్తావించడంతో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది. 👉 మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. 👉 తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామం వద్ద.. ఓ రోజు వేకువజామున మావోయిస్టులు సమావేశామవుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. సైలెంట్‌గా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేశారు. పోలీసుల కదలికలను గమనించిన మావోయిస్టులు.. అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేయగా.. విప్లవ సాహిత్యం, పలు వస్తువులు దొరికాయి. కాగ.. ఆ పుస్తకాల్లో ప్రముఖుల పేర్లు ఉండడంతో.. వారిని నిందితులుగా చేర్చారు 👉 మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడైన పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో సర్కారు ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, సర్కారును పడగొట్టటం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, యువతను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు రకరకాల అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. అయితే.. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రమౌళితో పాటు నిందితులుగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్‌తో పాటు ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్.. తదితర ప్రముఖుల పేర్లు ఉన్నాయి. 👉 సమాజంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంఘ విద్రోహ శక్తులను, సంఘాన్ని ఉద్రేక పరుస్తూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసే వారిని నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టమే ఉపా చట్టం (UAPA Act). ఇదీ చదవండి: ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్.. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోవాలి -
తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అంజనీకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మహేందర్‌రెడ్డి నుంచి డీజీపీగా బాధ్యతలు అందుకున్నారు. అనంతరం డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికే ఆదర్శం. ప్రతి అధికారి లీడర్‌గా పనిచేయాలి. క్విక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలకు నిరంతరం రక్షణగా ఉంటాం అని తెలిపారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్.. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్‌గా పని చేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. ఐపీఎస్ ట్రైనింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేశారు. 36 ఏళ్లలో13 మంది... 1986 నుంచి ఇప్పటి వరకు అటు ఉమ్మడి రాష్ట్రం, ఇటు విభజన తర్వాత అంజనీకుమార్‌తో కలిపి మొత్తం 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీపీలు/ఇన్చార్జి డీజీపీలు అయ్యారు. వీరిలో 13 మందికి నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అనురాగ్ శర్మ, మహేందర్‌రెడ్డి నేరుగా ‘సిటీ కమిషనరేట్’ నుంచి ‘డీజీపీ కార్యాలయానికి’ వెళ్లగా... మిగిలిన వారిలో అత్యధికులు ‘వయా’ చేరుకున్నారు. ఏకే మహంతి రోడ్ సేఫ్టీ అథారిటీ నుంచి, అరవిందరావు, ప్రసాదరావు తదితర అధికారులు అవినీతి నిరోధక శాఖకు చీఫ్లుగా పని చేస్తూ డీజీపీలుగా నియమితులయ్యారు. ప్రస్తుతం అంజనీకుమార్ కూడా అదే రూట్లో వెళ్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీ/ఇన్చార్జి డీజీపీలుగా నియమితులైన ముగ్గురూ సిటీ కమిషనర్లుగా పని చేసిన వారే. అంజనీ కుమార్ నిర్వర్తించిన పోస్టులు ఇవే.. - జనగామ ఏఎస్పీగా పనిచేశారు. - కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ చీఫ్‌గా పనిచేశారు. - ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ చీఫ్‌గా పనిచేశారు. - నిజామాబాద్ డీఐజీగా పనిచేశారు - వరంగల్ ఐజీగా పనిచేశారు. - హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. - తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు. - 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్‌గా చేరారు. - 2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు. -
పోలీస్ బాస్ అంజనీ కుమార్ ఐపీఎస్ ప్రస్థానం ఇదే..
తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. పోలీస్ బాస్(డీజీపీ) మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఐపీఎస్‌ల బదిలీల ప్రక్రియ అనివార్యమైంది. దీంతో, తెలంగాణ కొత్త డీజీపీ ఎవరు వస్తారనే ఊహాగానాలకు తెరదించుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇన్చార్జ్ డీజీపీగా ఐపీఎస్ అంజనీ కుమార్‌ను నియమించింది ప్రభుత్వం. అయితే, అంజనీ కుమార్.. బీహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్.. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్‌గా పని చేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. ఐపీఎస్ ట్రైనింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేశారు. అంజనీ కుమార్ నిర్వర్తించిన పోస్టులు ఇవే.. - జనగామ ఏఎస్పీగా పనిచేశారు. - కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ చీఫ్‌గా పనిచేశారు. - ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ చీఫ్‌గా పనిచేశారు. - నిజామాబాద్ డీఐజీగా పనిచేశారు - వరంగల్ ఐజీగా పనిచేశారు. - హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. - తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు. - 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్‌గా చేరారు. - 2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు. -
Telangana: డీజీపీ రేసులో పోటాపోటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీస్ విభాగాధిపతిగా ఎవరు వస్తారన్న చర్చ పోలీస్ వర్గాల్లో జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కొత్త డీజీపీగా నియమించనుందనే విషయానికి మరో వారంలో తెరపడనుంది. హెచ్ఓపీఎఫ్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) డీజీపీ రేసులో ఏసీబీ డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేసులో మాత్రం వీరి ముగ్గురితోపాటు మరో సీనియర్ ఐపీఎస్ రాజీవ్‌రతన్ సైతం ఉన్నట్టు సమాచారం. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు ప్రస్తుతం సీనియార్టీ ప్రకారం డీజీపీ ర్యాంకులో 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఉమేశ్ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్, రవిగుప్తా ఉన్నారు. సీఐడీ డీజీగా పనిచేసిన మరో సీనియర్ ఐపీఎస్ గోవింద్‌సింగ్ గత నెలలో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్‌కు డీజీ ర్యాంకు దక్కనుంది. అయితే, అందరిలోకి సీనియర్ అయిన ఉమేశ్ షరాఫ్ పదవీ కాలం 2023 జూన్‌తో ముగియనుంది. కేవలం ఆరు నెలల కాలమే ఉన్నందున ఆయనకు అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు పోలీస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా, గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన వారికి డీజీపీగా పదోన్నతి లభించింది. తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి విషయంలోనూ ఇదే మాదిరి జరిగింది. వారిద్దరు సైతం హైదరాబాద్ సీపీగా పనిచేస్తూ డీజీపీగా పదోన్నతి పొందారు. ఆ లెక్కన డీజీపీ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో అంజనీకుమార్ గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేయగా, సీవీ ఆనంద్ ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు. ఎక్స్‌కేడర్ కోటాలో సీవీ ఆనంద్‌కు పదోన్నతి? సీఐడీ డీజీగా పనిచేసి ఇటీవల రిటైరైన గోవింద్ సింగ్ స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్‌కు డీజీ ర్యాంకులో పదోన్నతి దక్కింది. అయితే ప్రభుత్వం ఎక్స్‌కేడర్ కోటా కింద ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించవచ్చు. అలా సీవీ ఆనంద్ అడిషనల్ డీజీ ర్యాంకు నుంచి డీజీ ర్యాంకుకు పదోన్నతి పొందుతారు. లేదంటే ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న మహేందర్‌రెడ్డి స్థానంలో సీవీ ఆనంద్‌కు డీజీ హోదా దక్కే అవకాశముంది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రవిగుప్తా పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని అదనపు డీజీపీ ర్యాంకులో ఉన్న వారిని సైతం డీజీపీ పోస్టులో నియమించే వెసులుబాటు ఉంది. దీని ప్రకారం 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ (ప్రస్తుతం శాంతి భద్రతల అడిషనల్ డీజీ) సైతం డీజీపీ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమేశ్ షరాఫ్ (1989), అంజనీకుమార్ (1990), రవిగుప్తా (1990), రాజీవ్ రతన్ (1991), సీవీ ఆనంద్ (1991) పేర్లు యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీకి పంపినట్టు సమాచారం. ఇందులోంచి కేంద్రం ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేస్తే వారిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనున్నారు. లేదంటే ముందుగా ఒకరిని ఇంచార్జి డీజీపీగా నియమించి, తర్వాత పూర్తిస్థాయి డీజీపీని నియమించే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: అదే జరిగితే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కోల్పోక తప్పదా?!) -
ఫ్రెండ్లీ పోలీస్ టీఆర్ఎస్కేనా?: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే క్రమంలో.. పోలీసులను జీతగాళ్లుగా, తమ కార్యకర్తలుగా అధికార పార్టీ టీఆర్ఎస్ వాడుకుంటోందని విమర్శించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. శుక్రవారం తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన ఆమె.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నేను ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించలేదు. నిందితులను వదిలేసి బాధితులను అరెస్ట్ చేశారు. ఇదే విషయాన్ని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశా’ అని వైఎస్ షర్మిల తెలిపారు. పోలీసులను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసులనే ప్రచారం కేవలం టీఆర్ఎస్ పార్టీకే వర్తిస్తుందని, మిగతా పార్టీలకు కాదని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందన్న ఆమె.. ప్రజల దృష్టిలో చులకన కావొద్దని పోలీసులకు సూచించారు. ఒకప్పుడు ఉదమ్యపార్టీగా ఉన్న టీఆర్ఎస్.. నేడు గుండాల పార్టీగా మారిందన్నారు ఆమె. ఇది తాలిబన్ల రాజ్యం అనడానికి ఎలాంటి సంకోచం లేదని చెప్పారు. వీళ్లు(టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి..) తాలిబన్లు కాదా? కేసీఆర్ తాలిబన్ల అధ్యక్షుడు కాదా? అంటూ విమర్శించారు. వాళ్ల బెదిరింపులకు భయపడేది లేదని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఎవరూ అడ్డుకోలేరని వైఎస్ షర్మిల తెలిపారు. ఇక్కడుంది రాజశేఖర్ బిడ్డ. ఎక్కడైతే మీరు పాదయాత్రను ఆపారో.. అక్కడి నుంచే మొదలుపెడతానని స్పష్టం చేశారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. అలాగే రాజశేఖర్‌రెడ్డిగారి సంక్షేమ పాలన తీసుకొచ్చేంత వరకు ఆగేది లేదు. నిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారామె. ఇక ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచే ప్రారంభిస్తానని ఆమె స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలను గమనించాలని తెలంగాణ ప్రజానీకాన్ని ఆమె కోరారు. ఆదివారం నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని, ఈ నెల 14వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. -
సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా.. నాగరాజు హత్య కేసుపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి(సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నోటీసులు పంపింది. సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా శుక్రవారం ఆదేశించింది. ఇక ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తమ దృష్టికొచ్చిందని, అయితే పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఇలాంటి ఘటనలు అరాచకత్వానికి నిదర్శమని, ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. మతాంతర, కులాంతర వివాహాలు జరిగినప్పుడు పరువుహత్యలు జరగకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏదైనా విధానం ఉందా? అంటూ చీఫ్ సెక్రటరీని కమిషన్ ప్రశ్నించింది. సీఎస్ తన నివేదికలో ఈ అంశంపై బదులివ్వాలని పేర్కొంది. ఈ హత్యోదంతం దర్యాప్తు స్థితిగతులు, బాధిత కుటుంబానికి కల్పిస్తున్న భద్రత, దర్యాప్తులో అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే అలాంటివారిపై తీసుకున్న చర్యల గురించి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. చదవండి: సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన గవర్నర్ తమిళిసై -
డీజీపీ ఎదుట లొంగిపోనున్న మావోయిస్టు నేత శారదక్క
-
డీజీపీ ఎదుట లొంగిపోనున్న మావోయిస్టు నేత శారదక్క
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ నేత హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ భార్య శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శారదక్క డీజీపి ఎదుట లొంగిపోనున్నారు. శారదక్క లొంగుబాటుపై డీజీపీ మహేందర్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. (చదవండి: చిన్నచూపు చూపడంతో.. వనం నుంచి జనంలోకి..) గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారదక్క.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం బెజ్జరి. ఇటీవల శాదరక్క భర్త హరిభూషణ్ కరోనాతో మృతిచెందిన సంగతి తెలిసిందే. నాటి నుంచి శారదక్క మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. దానికి తోడు కరోనా పాజిటివ్ రావడం తో కొంతకాలంగా అస్వస్థతకు గురై చికిత్స పొందారు. కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యం కారణంగా లొంగుబాటు కు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ: లాక్డౌన్ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీని అమలుపై రేంజ్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడుతూ.. సీనియర్ పోలీస్ అధికారులందరూ క్షేత్ర స్థాయిలో ఉండి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్క్వార్టర్లు, ప్రధాన నగరాల్లో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాపై ఎలాంటి ఆంక్షల్లేవని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై రవాణాపై కూడా ఎలాంటి ఆంక్షల్లేవని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు లేదా గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయ, గ్రామీణ ఉపాధికి మినహాయింపు.. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధి హామీ పనులను లాక్డౌన్ నుంచి మినహాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల వద్ద శాఖాపరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో జరిగే వివాహాలకు ఇరు వైపుల వారు 40 మంది మాత్రమే హాజరయ్యేలా చూడాలని చెప్పారు. వివాహాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని పేర్కొన్నారు. అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలన్నారు. కరోనా వాక్సినేషన్‌కు ఎవరైనా వెళ్లాల్సి వస్తే వారి మొదటి డోస్‌కు సంబంధించిన సమాచారం సెల్ఫోన్లో చూసి వెళ్లనివ్వాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులు జారీ చేయాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంతో పాటు ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేయాలని డీజీపీ పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ–పాస్ ద్వారా ప్రత్యేక పాసులు లాక్డౌన్ నేపథ్యంలో వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ–పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ–పాస్‌ల కోసం htt p://policeportal.tspolice.gov.in/ వెబ్సైట్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులు జారీచేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు మాత్రమే పాస్‌లు జారీ చేస్తారని వివరించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుంచే పాస్‌లు జారీ చేస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒక కమిషనరేట్ నుంచి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమిషనరేట్ నుంచే పాసులు జారీ చేస్తారని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని ఉద్ఘాటించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి పాసులు అవసరం లేదని, వారి ప్రయాణ టికెట్లు చూపిస్తే సరిపోతుందని తెలిపారు. చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా చదవండి: ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ -
అంతా తూచ్.. అది నకిలీ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 1వ తేదీన నకిలీ లాక్డౌన్ జీవో సంగతి మరువక ముందే మరో కలకలం రేగింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రెక్రూట్మెంట్ బోర్డు పేరిట నకిలీ నోటిఫికేషన్ శనివారం ఆన్లైన్లో వైరల్ అయింది. వాస్తవానికి 2018 నోటిఫికేషన్‌ను మార్ఫింగ్ చేసి 03–04–2021 డేట్‌తో ఫేక్ నోటిఫికేషన్‌ను తయారుచేశారు. దీంతో ఈ ఫేక్ నోటిఫికేషన్‌ను డీజీపీ ఆఫీస్ సీరియస్‌గా తీసుకుంది. సైబర్‌క్రైమ్ పోలీసులతో విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ మహెందర్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో లాక్డౌన్.. నకిలీ జీవో వైరల్! -
వికారాబాద్ ఎస్పీపై బదిలీ వేటు?
సాక్షి, వికారాబాద్: అవినీతి ఆరోపణలు.. కిందిస్థాయి సిబ్బందిని వేధించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న ఎస్పీ నారాయణపై పోలీసు ఉన్నతాధికారులు బదిలీవేటు వేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయనను డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఎస్పీగా జానకీ షర్మిలను నియమించినట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. జానకీ షర్మిల ప్రస్తుతం మహిళా రక్షణ, సైబర్ సెక్యూరిటీ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నారు. ఎస్పీ నారాయణను డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేయడంపై జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ధారూరు సీఐ మురళి కుమార్‌ను సప్పెన్షన్ చేయడంతోపాటు, ఓ ఠాణాకు చెందిన ఏఎస్ఐ.. ఎస్పీ తీరుపై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో డీఐజీ కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు. అదేవిధంగా ఈ విషయంపై డీజీపీ కార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు వారం రోజులుగా తాండూరు, వికారాబాద్‌లో గోప్యంగా విచారణ జరిపినట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారిపై పలు ఆరోపణలు రావడం.. పూర్తి నివేదికను డీజీపీ కార్యాలయానికి అందజేయడంతో వేటు పడినట్లు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా యాలాలలో ఇసుక దందాను ఉన్నతాధికారి ప్రోత్సహించారనే ఆరోపణలతో పాటు, పలు సివిల్ పంచాయతీల్లో తలదూర్చి పెద్దఎత్తున లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ప్రతి పెట్రోల్ బంక్ నుంచి నెలకు 25 లీటర్ల చొప్పున డీజిల్ తీసుకొని, సదరు ఇందనానికి సంబంధించిన బిల్లులను సర్కారు నుంచి సుమారు రూ. 75లక్షలు కాజేశారనే విమర్శలు వచ్చాయి. -
నిరాడంబరంగా డీజీపీ కుమారుడి వివాహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కుమారుడు నితీష్ వివాహం బుధవారం రాత్రి నిరాడంబరంగా జరిగింది. దివంగత పి.రామేశ్వర్‌రెడ్డి, మంజుల కుమార్తె వైష్ణవితో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్లో ఈ వివాహం జరిగింది. కోవిడ్ నిబంధనల్ని పక్కాగా పాటిస్తూ, షేక్‌పేట్ తహసీల్దార్ అనుమతితో జరిగిన ఈ వేడుకకు వధువరూల కుటుంబీకులతో పాటు అతి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరు అయ్యారు. వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు, అతిథులూ మాస్క్‌లు ధరించి, వ్యక్తిగత దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. -
కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన ప్రకాష్ రాజ్
కరోనా లాక్డౌన్ కారణంగా వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. లాక్‌డౌన్‌తో అన్ని కంపెనీలు, దుకాణాలు మూత పడటంతో కార్మికులు కాలి నడకన తమ సొంత ఊళ్లకు పయనమై పలు చోట్ల చిక్కుకపోయారు. అయితే వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు అనేక ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సంస్థలు, పలువురు ప్రముఖులు ఈ వలస శ్రామికులకు కావాల్సిన ఏర్పాట్లను అందించాయి. ఈ క్రమంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా వలస కార్మికుల కోసం తనవంతు సాయాన్ని అందించారు. ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా అనేక మంది వలసకార్మికులకు తన వ్యవసాయ క్షేత్రంలో ఆశ్రయం అందించి వారి ఆలనా పాలనా చూసుకున్నారు. కాగా వలస కార్మికులను వాళ్ల స్వస్థలాకు పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపుతున్నారు. బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లను నడుపుతూ వలస కార్మికులను తరలిస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ ఫామ్‌హౌజ్‌లో ఉన్న వలస కార్మికులు కూడా వారి స్వస్థలాలకు బయలుదేరారు. ‘వలస శ్రామికులను సురక్షితంగా తరలిస్తున్నందుకు కేటీఆర్ గారికి, తెలంగాణ డీజీపీ గారికి కృతజ్ఞతలు. 44 రోజుల పాటు కొంతమంది కూలీలకు నా ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం ఇచ్చాను. వాళ్లందరూ ఇప్పుడు తనను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. వారి జీవిత కథల నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. కష్టకాలంలో వారిని ఆదుకోగలిగిన ఒక తోటి వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. వాళ్లకు ఆశ్రయం ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ తన ఫామ్‌హౌస్‌లో వారందరిని ప్రత్యేక బస్సుల ద్వారా రైల్వేస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను కూడా ట్వీట్లో జతపరిచారు. Thank u @KTRTRS @TelanganaDGP for the safe passage ..44 days of sheltering them n sharing my farm ..I’m gonna miss them... learnt a lot from their stories of life n love ..im proud as a fellow citizen that I didn’t let them down .and I instilled hope n celebrated sharing .. bliss pic.twitter.com/GmFF5NdwjI — Prakash Raj (@prakashraaj) May 6, 2020 చదవండి: సీతమ్మ కష్టం తీరింది వలస కూలీల పట్ల ఉదారంగా ఉండాలి -
కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం
-
తప్పిపోయిన కేసుల్లో తక్షణం స్పందించండి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులు ఇప్పుడు మరోసారి చర్చానీయాంశమవుతున్నాయి. వాస్తవానికి ఇలా నమోదవుతున్న వాటిలో 67% పైగా కేసుల్లో తప్పిపోయినవారిని గుర్తిస్తున్నారు. కానీ, యువతులు, టీనేజీ బాలికల విషయంలో మాత్రం పోలీసులు అది ప్రేమ వ్యవహారమంటూ కొట్టిపారేస్తున్నారు. దీంతో కొన్నింటిలో బాధితులు విగతజీవులుగా కనిపిస్తున్నారు. గతంలో హాజీపూర్ గ్రామంలోనూ ఫిర్యాదు చేసినపుడు పోలీసులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. తాజాగా ‘దిశ’ కేసులోనూ పోలీసులకు యువతి అదృశ్యం పై ఫిర్యాదు చేయగానే.. తొలుత ప్రేమ వ్యవహారమంటూ తేలిగ్గా తీసుకున్నారు. మరునాడు ఆమె విగతజీవిగా మారింది. పోలీసులు అదేక్షణంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేదని బాధిత కుటుంబీకులు ఆరోపించడంతో ముగ్గురు పోలీసులపై వేటుపడిన సంగతి తెలిసిందే. 67 శాతం పురోగతి.. తెలంగాణలో మిస్సింగ్ కేసులు నమోదు భారీగా ఉంటోంది. వాటి పరిశోధన కూడా అంతేస్థాయిలో ఉంటుంది. నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ (ఎన్సీఆర్బీ) 2017 ప్రకారం.. నమోదైన ప్రతీ వంద కేసుల్లో 67 కేసులను పోలీసులు ఛేదిస్తున్నారు. మిస్సింగ్ కేసుల పురోగతిలో ఒడిశా 87%, కేరళ 85.4 శాతంగా ఉంది. వీటి తరువాత స్థానంలో తెలంగాణ నిలవడం గమనార్హం. సాధారణంగా మిస్సింగ్ కేసుల్లో ఇంటినుంచి పారిపోయిన, తప్పిపోయిన పిల్లలు, మతిస్థిమితి లేనివారు, వృద్ధులు, ప్రేమవ్యవహారాలు, కిడ్నాపులు అన్ని రకాలు ఉంటాయి. పిల్లలు, వృద్ధుల విషయంలో ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కేసులు నమోదు చేసే పోలీ సులు, యువతుల విషయంలో ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుతో తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. నిర్లక్ష్యం వద్దు : డీజీపీ కార్యాలయం ‘దిశ’కేసు నేపథ్యంలో యువతులు, బాలికల మిస్సింగ్ కేసుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల ఎస్పీ, కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. డయల్ 100కు వచ్చే కాల్స్‌లోనూ వీలైనంత త్వరగా ఘటనాస్థలానికి చేరుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
తెలంగాణలో పోలీసులకు వీక్లీ ఆఫ్
-
పోలీసులకు వీక్లీ ఆఫ్
సాక్షి, హైదరాబాద్: పోలీసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారాంతపు సెలవు అమలుకు రాష్ట్ర పోలీసుశాఖ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు డీజీ కార్యాలయం నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. డ్యూటీ రోస్టర్ చార్ట్ ప్రకారం.. సిబ్బంది నిష్పత్తి ఆధారంగా వీక్లీ ఆఫ్‌లు ప్లాన్ చేయాలని డీజీ కార్యాలయం అన్ని జిల్లా ఎస్పీ, కమిషనర్ కార్యాలయాలను ఆదేశించింది. చాలా మంది ఎస్పీలు, కమిషనర్లు నేటి నుంచే అమలు చేయడానికి మొగ్గు చూపించడం గమనార్హం. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం నుంచే ఈ డిమాండ్‌ను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కరీంనగర్‌లాంటి కొన్ని జిల్లాల్లో అమలు చేశారు. తరువాత అనివార్య కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది కూడా వీక్లీ ఆఫ్ ప్రస్తావన వచ్చినా.. అమలు చేసేలోగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త హోంమంత్రి మహమూద్ అలీ కూడా వీక్లీ ఆఫ్‌పై సానుకూలంగా స్పందించారు. కోడ్ కారణంగా కొండెక్కిన అమలు.. రాష్ట్రంలో సుదీర్ఘంగా నెలకొన్న ఎన్నికల కోడ్ కారణంగా వారాంతపు సెలవు అమలు కుదరలేదు. తరువాత సర్పంచి, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలతో వరుసగా రాష్ట్రంలో గత మే నెల వరకు ఎన్నికల కోడ్ ఉంది. దీంతో అమలు సాధ్యం కాలేదు. తాజాగా ఈ నెల నుంచి ఏపీ ప్రభుత్వం కూడా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేయడంతో తిరిగి తెలంగాణలోనూ ఈ విషయంపై కదలిక వచ్చింది. దీంతో నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు వీక్లీ ఆఫ్ అమలు చేయడం ప్రారంభించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ డిమాండ్ పెరగడం, పోలీసు అధికారుల సంఘం కూడా డీజీపీ మహేందర్‌రెడ్డిని కలసి వారంతాపు సెలవుపై విన్నవించడంతో మార్గం సుగమమైంది. వేధిస్తున్న సిబ్బంది కొరత.. వాస్తవానికి రాష్ట్ర జనాభాకు ఉన్న పోలీసులు ఇప్పుడు ఏమాత్రం సరిపోరు. ఉద్యోగుల కొరత కారణంగానే ఇంతకాలం వీక్లీ ఆఫ్ అమలు సాధ్యపడలేదు. పోలీసు మాన్యువల్ 617 ప్రకారం వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు. కానీ, డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బంది కొరత కారణంగా ఇది ఇంతకాలం సాధ్యపడలేదు. మొత్తానికి పోలీసుల చిరకాల డిమాండ్ నెరవేరబోతున్నందుకు డిపార్ట్మెంట్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం.. రాష్ట్రంలో ప్రతీ 400 మందికి ఒక పోలీసు చొప్పున ఉండాలి. కానీ, సిబ్బంది కొరత కారణంగా ప్రతీ 800 మందికి ఒక పోలీసు చొప్పున ఉన్నారు. పోలీసుశాఖలో ఇప్పుడు 54 వేల మంది సిబ్బంది ఉన్నారు. త్వరలో రిక్రూట్‌కాబోతున్న 18,500 మంది పోలీసులు విధుల్లో చేరితే, వీక్లీ ఆఫ్ అమలు మరింత సులువు కానుంది. డీజీపీ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు నిత్యం 24 గంటల డ్యూటీతో సతమతమయ్యే పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో డీజీపీకి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. పనిఒత్తిడి, విరామం లేని విధుల కారణంగా చాలామంది సిబ్బంది మధుమేహం, బీపీ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఎంతో స్వాంతన చేకూరుస్తుంది. -గోపీరెడ్డి, పోలీసు అధికారుల సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు -
వసూల్ రాజాలకు.. ముకుతాడు!
పోలీస్‌శాఖలో ‘వసూల్‌రాజా’ల జాబితా కలకలం రేపుతోంది. ఎవరు, ఎవరి కోసం వసూలు చేస్తున్నారో సవివరంగా విడుదలైన జాబితా జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. స్టేషన్ల వారీగా వారి పేర్లు, పీసీ నంబర్‌తో సహా బయటికి రావడం..వారందరిపై బదిలీ వేటు అన్న ప్రచారంతో జాబితాలో పేర్లు ఉన్నవారి గుండెల్లో గుబులు రేపుతోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : పోలీస్స్టేషన్ల నిర్వహణకు కావాల్సిన బడ్జెట్ నెలానెలా ఇస్తే .. ఇక, స్టేషన్లలో అవినీతి చోటు చేసుకోదని, పదికీ పరకకు చేతులు చాపాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలన్నీ గాలి బుడగలే అని తేలిపోయింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు కొత్త వాహనాలు, నిర్వహణకు నెలవారీ బడ్జెట్, తదితర సాధన సంపత్తి సమకూర్చినా అవినీతికి చెక్ పెట్టలేకపోయారని విదితమవుతోంది. రాష్ట్ర డీజీపీ నుంచి జిల్లాల ఎస్పీలకు అందినదిగా ప్రచారం జరుగుతున్న జాబితాలో పలువురు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలా 59 మంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో అత్యధికంగా సూర్యాపేట కొత్త జిల్లా పరిధిలో 40 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిహేడు మంది, నల్లగొండ జిల్లాలో ఇద్దరు చొప్పున వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరందరినీ జిల్లా హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేయాలని కూడా డీజీపీ నుంచి ఎస్పీలకు ఆదేశాలు అం దాయని విశ్వసనీయ సమాచారం. ఇవీ.. వనరులు స్టేషన్ల నిర్వహణ, తదితర ఖర్చుల కోసం ప్రతి స్టేషన్ పరిధిలో ఒకరికో, ఇద్దరికో బాధ్యత అప్పజెప్పే సంస్కృతి పోలీస్‌శాఖలో ఉండేది. తెలం గాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, పోలీసులు ఎవరి దగ్గరా చేయి చాపకూడదన్న సదుద్దేశంతో భారీ గానే బడ్జెట్ కేటాయించారు. అయినా, స్పెషల్ పార్టీ, ఐడీ పార్టీ పోలీసుల పేర దాదాపు అన్ని స్టేషన్ల పరిధిలో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. వైన్‌షాపులు, సిట్టింగులు తదితర అక్రమ వ్యాపారులనుంచి బాగానే దండుకుంటున్నారు. వివిధ పంచాయితీలతో స్టేషన్లకు వచ్చే వారినుంచి, రకరకాల నేరాల్లో నిందితులుగా ఉన్న వారినుంచి వీరి వసూళ్లు కొనసాగుతున్నాయని సమాచారం. ప్రతి స్టేషన్లో దఫేదార్ల పేర ఉన్న వ్యవస్థ పూర్తిగా డబ్బుల వసూళ్ల కోసమేనని చెబుతున్నారు. వీరే కాకుండా ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్ఐల వాహనాల డ్రైవర్లూ ఇందులో పాలు పంచుకుంటున్నారు. డీజీపీ తయారు చేసినదిగా చెబుతున్న జాబితాలో ఏయే పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరెవరు వసూలు చేస్తున్నారో, ఎవరి కోసం వసూలు చేస్తున్నారో కూడా వివరాలు ఉండడం గమనార్హం. నల్లగొండ జిల్లాలో తిరుమలగిరి (సాగర్) స్టేషన్లో ఒక కానిస్టేబుల్, కొండమల్లేపల్లి స్టేషన్లో ఒక ఏఎస్ఐ ఉన్నారు. అదే మాదిరిగా, యాదాద్రి భువనగరి జిల్లాలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొమ్మలరామారం, బీబీనగర్, భువనగిరి టౌన్, భువనగిరి రూరల్, ఆలేరు, వలిగొండ, భూదాన్ పోచంపల్లి, మోటకొండూరు స్టేషన్లలో పదహారు మంది ఉన్నారు. నల్లగొండలో ముందే ప్రక్షాళన ! రాష్ట్రంలో అత్యధికంగా మండలాలు ఉన్న న ల్లగొండ జిల్లాలో వాస్తవంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉండాలి. కానీ, రెండు నెల్ల కిందట ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ఏవీ రంగనాథ్ జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్లలో స్పెషల్ పార్టీలు, ఐడీ పార్టీల పేర జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టారు. హోంగార్డు స్థాయి నుంచి ఎవరెవరూ వసూళ్లకు పాల్పడుతున్నారో స్వల్పకాలలోనే సమాచారం సేకరించి వారిపై బదిలీ వేటు వేశారు. ఏ స్టేషన్లోనూ దఫేదార్ వ్యవస్థ లేకుండా చర్యలు తీసుకున్నారు. ఒకేసారి కాకుండా మూడు విడతలుగా సుమారు 125మంది పోలీసు సిబ్బందికి స్థాన చలనం కల్పించారు. ఈ బదిలీలు సంచలనం సృష్టించగా, సిబ్బంది కూడా ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేసుకుని బజారున పడ్డారు. బదిలీలపై కోర్టులనూ ఆశ్రయించారు. అయినా, వసూల్ రాజాలను గుర్తించడంలో, వారిని కట్టడి చేయడం కోసం ఎస్పీ రంగనాథ్ తీసుకున్న చర్యలకు ఉన్నతాధికారుల మద్దతు కూడా లభించింది. ఒక విధంగా ప్రస్తుతం డీజీపీ లిస్టు తయారీకి నల్లగొండ దారి చూపినట్లు అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిరంతర నిఘా జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్లలో స్పెషల్, ఐడీ పార్టీలపేర జరగుతున్న వసూళ్లకు బ్రేక్ వేయగలిగాం. ఇప్పుడు కేవలం రెండు స్టేషన్ల పేర్లు మాత్రమే ప్రచారంలో ఉన్నాయని సంబర పడడం లేదు. నిఘా నిరంతరం కొనసాగుతుంది. అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ముఖ్యంగా, డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిని మాత్రమే కాకుండా, వారు ఎవరి కోసం ఆ వసూళ్లకు పాల్పడుతున్నారో సంబంధిత అధికారులనూ బాధ్యులను చేస్తాం. శాఖ పరువును తీస్తామంటే చూస్తూ ఊరుకోం, చర్యలు తీసుకుంటాం. – ఏవీ రంగనాథ్, ఎస్పీ -
టెక్నాలజీ ఫ్యూషన్ సెంటర్ ప్రారంభించిన డీజీపీ
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో టెక్నాలజీ ఫ్యూషన్ సెంటర్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్, ట్రాఫిక్ కమాండ్ సెంటర్, సోషల్ మీడియా ల్యాబ్, డయల్ హాక్ ఐ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నూతన సాంకేతికతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని వ్యవహారాలను ఫ్యూషన్ సెంటర్‌తో అనుసంధానం చేయవచ్చన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్‌ను అనుసంధానించవచ్చు అని పేర్కొన్నారు. ఈ ఫ్యూషన్ సెంటర్ నేర శాతాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కాగానే ఈ టెక్నాలజీ సెంటర్‌ను అక్కడికి తరలిస్తామని వెల్లడించారు. పోలీసు శాఖ టెక్నాలజీకి మారుపేరుగా మారుతుందని డీజీపీ అన్నారు. జిల్లాల్లో ఉన్న మినీ కమాండ్ కంట్రోల్‌తో ఈ ఫ్యూషన్ సెంటర్‌ను అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా శాంతి భద్రతలను కాపాడుతామని తెలిపారు. టెక్నాలజీకి మారుపేరుగా మారిన హైదరాబాద్‌కు పెట్టుబడులను ఆకర్షించే విధంగా తమ వంతు కృషి చేస్తామని డీజీపీ పేర్కొన్నారు. -
మిషన్ 2018 - 8 లక్ష్యాలు
సాక్షి, హైదరాబాద్ : పూర్తి భద్రమైన రాష్ట్రం కోసం పోలీసు శాఖ ‘నూతన’ఒరవడి వైపు అడుగులు వేస్తోంది. నూతన సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు, టెక్నాలజీ వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి ‘మిషన్–2018’పేరిట ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంవత్సరాంత మీడియా కాన్ఫరెన్స్‌లో దీనిని విడుదల చేశారు. ఎనిమిది లక్ష్యాలతో ఈ కార్యాచరణను అమలు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్ కాప్ యాప్‌ను మరింత విస్తృతపరిచి రాష్ట్ర పోలీసులందరికీ అందుబాటులో ఉండేలా ‘టీఎస్ కాప్’యాప్‌ను తీసుకువస్తున్నామని చెప్పారు. పోలీసు సిబ్బందికి నేర నియంత్రణ, దర్యాప్తులో మెళకువల కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, మహిళల భద్రత, ఎమర్జెన్సీ రెస్పాన్స్, సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సర్వీస్ తదితర వ్యవస్థలన్నింటినీ త్వరలోనే జిల్లా పోలీసు విభాగాల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సమాజ భద్రత కోసం హైదరాబాద్‌లో అమలుచేస్తున్న ‘నేను సైతం’ కార్యక్రమాన్ని జిల్లాల్లోనూ అమలుచేస్తామని తెలిపారు. డీజీపీ వెల్లడించిన 8 లక్ష్యాలివీ సేవల్లో పురోగతి ప్రజలు సంతృప్తి చెందేలా పోలీసు సేవలను అందించాలని నిర్ణయించారు. ఏదైనా ఘటన జరిగిన ప్రాంతానికి అతి త్వరగా చేరుకునేందుకు కార్యాచరణ అమలు చేస్తారు. పోలీసులు ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నామని డీజీపీ వెల్లడించారు. ఆన్లైన్ సర్వీస్, ఫీడ్ బ్యాక్, కొత్త యాప్స్, పబ్లిక్ అలర్ట్ వంటివి దీని కిందకు వస్తాయని తెలిపారు. సమర్థవంతంగా నేరాల నియంత్రణ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, ముఠాలు, గ్యాంగులను నియంత్రించడంతోపాటు కొత్తగా పుట్టుకువచ్చే నేరాలను మొగ్గలోనే తుంచేందుకు ‘కంబాట్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎమర్జింగ్ క్రైమ్’పేరుతో కార్యాచరణ అమలు చేస్తారు. నేరాల దర్యాప్తులో అధికారులు, సిబ్బందికి మెళకువలు, ప్రొఫెషనలిజం పెంపొందించడం, జాతీయ, అంతర్గత భద్రత వ్యవహారాలు, బెదిరింపులకు తగ్గట్టుగా చర్యలు చేపట్టడం దీనిలో కీలకంగా ఉంటాయని డీజీపీ తెలిపారు. పునర్నిర్మాణం–పటిష్టత ప్రస్తుతం పోలీసు శాఖలో ఉన్న వివిధ విభాగాలను పునర్నిర్మించి మరింత పటిష్టంగా పనిచేసేలా కార్యాచరణ (ఆర్గనైజేషన్ బిల్డింగ్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్) చేపడతారు. ప్రత్యేక విభాగాల పటిష్టానికి కృషి, క్రాక్‌జాక్ సెంటర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, స్టేషన్ హౌజ్ మేనేజ్మెంట్, జెండర్ రీసోర్స్ సెంటర్, ఆన్లైన్ ట్రైనింగ్ మోడల్స్, సిబ్బంది, అధికారుల వైఖరిలో మార్పు తదితర అంశాలు ఈ ప్రణాళిక కిందకు వస్తాయి. వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ పోలీసు సిబ్బందిలో కెరీర్ మేనేజ్మెంట్, శిక్షణకు సంబంధించి ప్రత్యేక అంశాలు దీని కిందకు వస్తాయి. ఉద్యోగి చేసే పనులు, వాటి ఫలితాలు, తగిన ప్రోత్సాహకాలు, సంక్షేమం, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్, ఎఫ్ఎస్ఎల్, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో తదితరాలన్నింటిలో ఈ కార్యచరణ కీలకంగా మారనుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం టెక్నాలజీని వినియోగించుకుని నిఘా (స్మార్ట్ సర్వైలెన్స్), కమాండ్ కంట్రోల్ సిస్టమ్, సైబర్ టెక్నో కమాండ్ సెంటర్, స్మార్ట్ పోలీసింగ్ అంశాలను అందుబాటులోకి తెస్తారు. తద్వారా సైబర్ నేరాల నియంత్రణ, 360 డిగ్రీ ప్రొఫైల్, జియోట్యాగ్ మ్యాపింగ్, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణ, ఇంట్రిగేటెడ్ డేటాబేస్ తదితరాలన్నీ ఎప్పటికప్పుడు, ఎలా పనిచేయాలన్నదాని కోసం ఈ ప్రణాళిక రూపొందించినట్టు డీజీపీ తెలిపారు. కమ్యూనిటీ భాగస్వామ్యం, నిపుణుల పర్యవేక్షణ ప్రజల భాగస్వామ్యం, నిపుణులు సలహాలు, సహాయంతో నేరాల నియంత్రణకు కృషిచేయడం ఈ కార్యచరణలోకి వస్తాయి. ఇందులో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ, నవ సమాజ స్థాపనకు కావాల్సిన అంశాల స్వీకరణ, స్టూడెంట్ పోలీస్ కేడర్ కార్యక్రమాలు, అకడమిక్ ఇన్పుట్స్ ఫార్ములా తదితరాలు ఉంటాయి. రోడ్డు భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సమీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ, క్యాష్‌లెస్ చలాన్లు, రోడ్ సేఫ్టీ పోలీస్స్టేషన్లు, గోల్డెన్ అవర్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్, ప్రత్యేక రోడ్‌సేఫ్టీ విభాగం ఏర్పాటు ఈ కార్యాచరణలోకి వస్తాయి. ఇందులో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు, అభివృద్ధి, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాప్స్ రూపకల్పన, ఇంటిగ్రేటెడ్ డేటా మెయింటెనెన్స్, ఆటోమేటెడ్ ఎన్ఫోర్స్మెంట్, లైసెన్సుల సస్పెన్షన్ తదితర అంశాలు ఉంటాయి. భద్రమైన ప్రాంతాలుగా మార్చడం (సేఫర్ అవర్ సిటీస్ సేఫర్) సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ, అర్బన్ ప్రాంతాల భద్రతకు పటిష్ట చర్యలు, డిజిటల్ సెక్యూరిటీ సర్వీస్ సెంటర్ ఏర్పాటు, నేర నియంత్రణ కోసం వ్యూహాల రచన, ఉగ్రవాద నియంత్రణకు స్పెషల్ స్క్వాడ్స్, భారీ వాణిజ్య ప్రాంతాలు, భవనాల భద్రతకు స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్ తదితరాలను ఈ ప్రణాళికలో భాగంగా అమలు చేస్తామని డీజీపీ వెల్లడించారు. అంతా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే.. అన్ని జిల్లాల్లోని హెడ్క్వార్టర్లు, ప్రధాన పట్టణాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న సీసీ కెమెరాలను అక్కడి కమాండ్ సెంటర్లకు అనుసంధానం చేస్తారని డీజీపీ వెల్లడించారు. ఆ కమాండ్ సెంటర్లను హైదరాబాద్‌లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తామని చెప్పారు. జీపీఎస్ ఆధారిత గస్తీ వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మరిన్ని వాహనాలు కొనుగోలు చేసి.. జిల్లా పోలీసు యంత్రాంగాలకు అందిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో సోషల్ మీడియా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని.. తద్వారా పుకార్ల నియంత్రణ, వాటి ద్వారా జరిగే నష్టాలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు క్లూస్‌టీంలు, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్లను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. -
సైద్ధాంతికంగా విభేదించి లొంగిపోయారు
సాక్షి, హైదరాబాద్: జంపన్న లాగే మిగతా మావోయిస్టు నేతలు కూడా లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న, ఆయన భార్య రజితను సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులతో సైద్ధాంతికంగా విభేదించి జంపన్న దంపతులు లొంగిపోయారని చెప్పారు. జంపన్న అసలు పేరు జినుగు నరసింహారెడ్డి అని, మహబూబ్‌నగర్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం ఆయన స్వస్థలమని డీజీపీ వెల్లడించారు. 1984లో మల్లేపల్లిలో ఐటీఐ చదివేటప్పుడు మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఉద్యమంలోకి వెళ్లారని చెప్పారు. 33 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారని, అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడయ్యారని వివరించారు. జంపన్నపై 100 కేసులు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలోనే 51 కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మారుతున్న సామాజిక మార్పులకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ మారడం లేదు కాబట్టి ఉద్యమం నుంచి జంపన్న బయటకు వచ్చారన్నారు. జంపన్న భార్య రజిత వరంగల్ గ్రామీణం జిల్లా వాసి అని, 2009లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిపారు. జంపన్నపై రూ. 25 లక్షలు, రజితపై రూ.5 లక్షలు రివార్డు ఉందని.. ఈ మొత్తాన్ని వీరిద్దరికీ ఇస్తేస్తామన్నారు. జంపన్న, రజిత జనజీవన సవ్రంతిలో కలిసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. సైద్ధాంతికంగా విభేదించి లొంగిపోయారు -
ఫలక్ నుమాలో భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విందును పురస్కరించుకొని ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులు, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు, క్యూఆర్టీ, అమెరికా, కేంద్ర, రాష్ట్ర, నగర నిఘా సంస్థలు ప్యాలెస్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్యాలెస్‌కు వెళ్లే రూట్లోని బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌బౌలి రహదారులను జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సీఎస్ ఎస్పి.సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్‌రావు, కలెక్టర్ యోగితా రాణాలు ప్యాలెస్‌లో ఏర్పాట్లతో పాటు బందోబస్తును పర్యవేక్షించారు. రైల్వే పోలీసులు కూడా ఫలక్‌నుమా రైల్వే స్టేషన్లో, దక్షిణ మండలం పోలీసులు ప్యాలెస్ పరిసరాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 45 బస్సులలో అతిథులు విచ్చేయనున్న నేపథ్యంలో ట్రాఫిక్, పార్కింగ్ అంశాలపై ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేశారు. మొత్తం 2000 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగించనున్నట్లు పోలీసులు తెలిపారు. 520 సీసీ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో పాటు సోమవారం సాయంత్రం కాన్వాయ్ రిహర్సల్స్ చేయనున్నారు. ప్యాలెస్‌కు అతిథులు విచ్చేసే సమయంలో ప్రధాన రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ రానున్న నేపధ్యంలో నిఘా పెంచామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలను ఆపరేట్ చేస్తామని తెలిపారు. డెలిగేట్స్ బస చేసే 21 హోటల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. ఎల్లుండి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని... నగరంలో 10 వేల 4 వందల మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నామన్నారు . -
ఫలక్ నుమాలో భారీ బందోబస్తు
-
మహేంద్ర ముద్ర.. విప్లవాత్మక సంస్కరణలు
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ... టెక్నాలజీ వినియోగంతో నేరాలు, నేరగాళ్లకు అడ్డుకట్ట... పోలీస్ స్టేషన్లకు కొత్త రూపురేఖలు ఇవ్వడంలో నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు. మూడున్నరేళ్లలో నగర పోలీస్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుట్టి ప్రత్యేకత నిలుపుకొన్న మహేందర్‌రెడ్డి తెలంగాణ డీజీపీగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్‌కమిషనర్‌గా ఆయన సేవలు.. సంస్కరణలపై ప్రత్యేక కథనం... సాక్షి, సిటీబ్యూరో: ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉండే, నిత్యం కంటి ముందు కనిపించే తొలి ప్రభుత్వోద్యోగి పోలీస్. అతని పనితీరు ఆధారంగానే ప్రజలకు ప్రభుత్వంపై ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. ఠాణాల్లోని మౌలిక వసతుల్ని బట్టే బాధితుడికి ప్రాథమిక భరోసా వస్తుంది. టెక్నాలజీ వినియోగం, కఠిన చర్యలతోనే నేరాలు నియంత్రించడం, నేరగాళ్లకు కళ్లెం వేయడం సాధ్యం. ప్రజలతో పోలీసులు ఎంత స్నేహభావంతో, మర్యాదపూర్వకంగా నడుచుకుంటే.. ప్రజల్లో వారి ప్రతిష్ట అంతగా పెరుగుతుంది. గడిచిన మూడున్నరేళ్లలో ఇవన్నీ నగర పోలీస్ విభాగంలో కనిపించాయి. వీటికి కారణమైన ఒకేఒక్కరు పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించిన, అక్కడి విధానాలు అ«ధ్యయనం చేసిన ఆయన.. హైదరాబాద్‌నూ వాటి సరసన చేర్చేందుకు తనవంతు కృషి చేశారు. ఇన్చార్జి డీజీపీ హోదాలో మహేందర్‌రెడ్డి సిటీని ‘విడిచి వెళ్తున్న’ నేపథ్యంలో పోలీసింగ్‌లో ఆయన చేపట్టిన సంస్కరణలు, తీసుకువచ్చిన మార్పులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రూపురేఖలు మారిన ఠాణాలు.. ఒకప్పుడు సిటీలోని చాలా ఠాణాలు భూత్‌బంగ్లాలను తలపించేవి. బాధితులు పోలీసుల వద్దకు వచ్చినప్పుడు ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో మహేందర్‌రెడ్డి అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రిసెప్షన్ సెంటర్ సహా పలు సౌకర్యాలతో మోడల్ పోలీసుస్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆధునికీకరణకు అనువుగా లేని వాటిని కూల్చి కొత్తవి నిర్మించారు. ప్రస్తుతం కమిషనరేట్‌లో పనులు జరుగుతున్న 11 ఠాణాల మినహా మిగిలినవన్నీ ఆధునిక హంగులు సమకూర్చుకున్నవే. నేరగాళ్ల ‘ఆడిటింగ్’.. నగర పోలీసు విభాగం తీసుకున్న మరో కీలక నిర్ణయం నేరగాళ్ల ‘ఆడిటింగ్’. నేరాలు నిరోధించడంతో పాటు వారిపై నిఘా ఉంచే చర్యల్లో భాగంగా ఠాణాలో ఉండే కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు ప్రతి అధికారీ పోలీసు రికార్డుల్లో ఉన్న స్థానిక నేరగాళ్ల ఇళ్లకు వెళ్లారు. దీంతో వారి చిరునామాలతో సహా మారిన వివరాలు అప్డేట్ అయ్యాయి. వీటిని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా గస్తీ నిర్వహించే రక్షక్, బ్లూకోల్ట్ సిబ్బందితో పాటు ప్రతి అధికారీ విధిగా తమ పరిధిలో నివసించే ఎంఓ క్రిమినల్స్ ఇళ్లకు వెళ్లి తనిఖీ చేసేలా ఏర్పాటు చేశారు. ఆధారాలు ‘పదిలం’.. నేరం చేసిన నిందితుడిని పట్టుకోవడంలోనే కాదు... న్యాయస్థానంలో దోషిగా నిరూపించడంలోనూ క్లూస్ టీమ్స్ సేకరించే ఆధారాలదే కీలకపాత్ర. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో క్లూస్‌టీమ్స్‌ను కొత్వాల్ మహేందర్‌రెడ్డి పరిపుష్టం చేశారు. ఒకప్పుడు ఒకే ఒక్క టీమ్ ఉండగా.. దేశంలోని మరే ఇతర నగరంలోనూ అందుబాటులో లేని విధంగా సబ్–డివిజన్ స్థాయిలో మొత్తం 17 బృందాలు ఏర్పాటు చేశారు. లక్ష దాటిన ‘నిఘా నేత్రాలు’.. మహేందర్‌రెడ్డి నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచీ సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో మూడున్నరేళ్లలో నగరంలోని సీసీ కెమెరాల సంఖ్య 1.45 లక్షలకు చేరింది. వీటి ఏర్పాటులో ప్రజలకూ భాగస్వామ్యం కల్పిస్తూ ‘నేను సైతం’ అనే ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టారు. సిటీలో నేరాలు తగ్గడానికి, నిందితులను పట్టించడంలో ఇవి కీలక భూమిక పోషిస్తున్నాయి. బిగిసిన ‘పిడి’కిలి.. గడిచిన మూడున్నరేళ్లలో నగరంలో నేరాలు 30 శాతం వరకు తగ్గాయి. ఒకప్పుడు గడగడలాడించిన చైన్‌స్నాచర్లు తోక ముడవడంతో ఈ కేసుల్లో 90 శాతం తగ్గుదల నమోదైంది. దీనికి సీసీ కెమెరాల ఏర్పాటు ఓ కారణమైతే.. పీడీ యాక్ట్ ప్రయోగం మరో కీలకాంశం. మహేందర్‌రెడ్డి హయాంలో దీన్ని 621 మందిపై ప్రయోగించారు. ‘షీ’కి ప్రత్యేక ‘భరోసా’.. ఈవ్ టీజర్ల పీచమణచడంతో పాటు అతివలకు ఎదురవుతున్న అన్ని రకాల ఇబ్బందులను పరిష్కరించడానికి సిటీలో ‘షీ–టీమ్స్’ను ఏర్పాటు చేయించారు. బస్సుల్లో మహిళలు, పురుషులు కూర్చునే/నిల్చునే ప్రాంతాలకు మధ్య మెష్ ఏర్పాటు ‘షీ–టీమ్స్’ సిఫార్సుతోనే అమలైంది. వివిధ రకాల కేసుల్లో బాధిత మహిళలకు సహాయ సహకారాలు అందాలనే ఉద్దేశంతో ‘భరోసా’ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ రెండూ ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. ప్రత్యేకంగా ‘శవాల’ బండి.. నగరంలో ఎక్కడైనా మృతదేహం కనిపిస్తే దాన్ని తరలించడం పోలీసులకు పెద్ద సమస్యగా ఉండేది. స్థానికంగా ఉంటే ఆటోట్రాలీ, వ్యాన్ డ్రైవర్లను బతిమాలో, భయపెట్టో తమ పని కానివ్వాల్సి వచ్చేది. దీన్ని గమనించిన కొత్వాల్ ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడటానికి ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయించారు. ‘ఫొరెన్సిక్ కారŠప్స్ వెహికిల్’ పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీసులకూ ప్రోగ్రెస్ రిపోర్ట్.. నగర పోలీసులకూ ఓ ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ను ప్రవేశపెట్టారు మహేందర్‌రెడ్డి. దీన్ని అధికారులు తమ పరిధిలో నివసించే ప్రజలకు ‘అందించేలా’ ఏర్పాటు చేశారు. ఏడాదికోసారి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వార్షిక పనితీరు నివేదికను పోలీసులు ప్రజల ముందు ఉంచుతున్నారు. ఆయా సమావేశాలు జరిగినన్నాళ్లూ వాటి నిర్వహణ, ప్రగతిని ప్రతి రోజూ కొత్వాల్ స్వయంగా పర్యవేక్షించారు. ఉద్యోగాలకు ‘వారధి’గా వాహనం.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను అవలంబిస్తున్న నగర పోలీసులు ప్రజలకు మరింత చేరువకావడంతో పాటు వారికి ఉపయుక్తంగా ఉండేందుకు ఏర్పాటు చేసిందే ‘జాబ్ కనెక్ట్’ వాహనం. ఓ పక్క కమ్యూనిటీ పోలీసింగ్ విధానాలు ప్రచారం చేయడంతో పాటు నిరుద్యోగుల నుంచి వివరాలు సేకరించి, వారికి ఉద్యోగాలు చూపించడానికి దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వాహనం ప్రతి రోజూ కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో సంచరిస్తూ ఉంటుంది. దర్యాప్తు దిశానిర్దేశానికి ఐఎస్సీ.. ప్రస్తుత పోలీసు అధికారుల్లో అన్ని స్థాయిల వారికీ అన్ని రకాల నేరాల దర్యాప్తుపై పట్టు ఉండట్లేదు. ఇలాంటి పోలీసు అధికారులకు కేసుల దర్యాప్తులో సహకరించడానికి అవసరమైన సహాయ సహకారాలు, సలహాలు సూచనలు అందించడానికి ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ (ఐఎస్సీ) ఏర్పాటు చేశారు. ఇంకా మరెన్నో.. బంజారాహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు కమిషనరేట్‌లో ఆధునిక కంట్రోల్ రూమ్ నిర్మాణాలు. నగర వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లు, డివిజన్లు, జోన్లను అనుసంధానిస్తూ వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ. హాక్–ఐ, లాస్ట్ రిపోర్ట్, హైదరాబాద్ కాప్, హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్, వెరిఫై, 360 డిగ్రీస్ వ్యూ వంటి యాప్స్. ట్రాఫిక్ విభాగంలో క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్, చెస్ట్ మౌంటెడ్ కెమెరాల పరిచయం. సీసీ కెమెరాల ఏర్పాటు నేపథ్యంలో సిటీలోని అనేక జంక్షన్లను కాప్లెస్గా మార్పు. సైబర్, క్రైమ్ ల్యాబ్స్, ఐటీ సెల్, వీడియో ఎన్‌హ్యాన్స్‌మెంట్ ల్యాబ్ ఏర్పాటు. చిన్న చిన్న నేరాలు, ఉల్లంఘనలకు చెక్ చెప్పడానికి ఈ–పెట్టీ కేస్ విధానం. అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించడానికి నెలవారీ కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్ (కేపీఐ) అవార్డులు. సీసీ కెమెరా వ్యవస్థలో ఫేషియల్ రికగ్నైజేషన్ వంటి ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఎనలటిక్స్ ఏర్పాటు. గస్తీ వాహనాల జియో ట్యాగింగ్, అన్ని స్థాయిల సిబ్బందికి ట్యాబ్స్ జారీ. ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ జిమ్‌తో పాటు ఠాణాలపై జాతీయ జెండాల ఏర్పాటు. కల్తీలపై ఉక్కుపాదం మోపడానికిఫోరెన్సిక్ అడాల్ట్రేషన్ క్లూస్ టీమ్‌కు రూపమిస్తున్నారు. పోలీసుల పని తీరు, ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు. -
ప్రభుత్వం కోరితే నా సేవలు అందిస్తా
-
'నేను డీజీపీ బరిలో ఉన్నా'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ నియామకంపై సీనియర్ ఐపీఎస్ అధికారిని తేజ్‌దీప్ కౌర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... తాను డీజీపీ బరిలో ఉన్నానని తెలిపారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇంచార్జ్ డీజీపీని నియమిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీపీ కోసం తుది జాబితా వచ్చే వరకూ వేచి చూడాల్సిందే అని అన్నారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీ కాలం నవంబర్ 11తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఇంచార్జ్ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేజ్‌దీప్ కౌర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
దిగ్విజయ్‌పై మండిపడ్డ తెలంగాణ డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులే ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారని, ఐఎస్ఐఎస్ పేరిట నకిలీ వెబ్సైట్ ఏర్పాటుచేసి దాని ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ సోమవారం ట్విట్టర్లో ఆరోపణలు చేయడం దుమారం రేపింది. ఈ పోస్టుపై ఐటీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ తీవ్రంగా స్పందించారు. ఎటువంటి ఆధారాల్లేకుండా ఒక సీనియర్ నేత ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధకరమైందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై ఆయన తన అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ మేరకు స్పందించారు. దేశ భద్రత కోసం పనిచేస్తున్న పోలీస్ శాఖపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పోలీస్ ఇమేజ్ను దెబ్బతీయడమేనని తెలంగాణ పోలీస్‌శాఖ కూడా ట్వీట్ చేసింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆధారాల్లేని ఆరోపణలు చేయడం సరైంది కాదని, వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర శాంతి భద్రతల వ్యవహారాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాదులను సైతం పట్టించిన తెలంగాణ పోలీసులు అర్దరహితమైన వ్యాఖ్యలు చేయడం పద్దతి కాదని కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. -
ఈ నెల 16న పోలీస్ రన్: అనురాగ్‌శర్మ
హైదరాబాద్ : అమరులైన పోలీసుల ఆత్మశాంతి కోసం అక్టోబర్ 16వ తేదీన 5 వేల మందితో పోలీస్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో అనురాగ్‌శర్మ విలేకర్లతో మాట్లాడుతూ...ఈ రన్లో పోలీసు ఉన్నతాధికారులతోపాటు కేంద్ర బలగాలకు చెందిన అధికారులు కూడా పాల్గొంటారని అనురాగ్‌శర్మ వెల్లడించారు. -
సీసీ కెమెరాలతో పోలీసుల పనితీరులో పారదర్శకత
సాక్షి, హైదరాబాద్: ఠాణాల్లో సీసీ కెమెరాలు ఉండటం వల్ల పోలీసుల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. వివిధ ఠాణాల్లో ఏర్పాటు చేసిన 450 సీసీ కెమెరాలు అనుసంధానించిన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసుస్టేషన్ సీసీటీవీ ప్రాజెక్టు, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. దేశంలోనే ఈ ప్రాజెక్టు మొదటిది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల విధానం వల్ల ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుందని అన్నారు. ఈ తొలి అడుగు పీపుల్ ఫ్రెండ్లీ ఇమేజ్‌కు దర్పణం పడుతుందన్నారు.‘సీసీ కెమెరాల వల్ల ఠాణాల్లో ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. పోలీసు సిబ్బంది ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నారో వీడియో రూపంలో కనబడుతుంది. ఈ విధానాల వల్ల ప్రజల్లో కూడా పోలీసులకు మంచి పేరు లభిస్తుంది. లాకప్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం బాగుంది’ అని డీజీపీ అన్నారు. విద్యో యాప్ ద్వారా ఠాణాకు రాలేని వారి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయడంతోపాటు ఘటనాస్థలికి వెళ్లి బాధితుల వివరణ తీసుకుంటే మంచి సాక్ష్యాలు లభిస్తాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులు చకచకా జరిగిపోతాయన్నారు. సైబరాబాద్ విభజనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానమిస్తూ విభజనపై కసరత్తు జరుగుతోందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అడిషనల్ డీజీ రవిగుప్తా, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'నక్సల్స్ విషయంలో విధానం మారలేదు'
నక్సల్స్ విషయంలో తమ విధానం మారలేదని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన అత్యాధునిక టెక్నాలజీ తో పోలీసు శాఖకు కొత్త హంగులను జత చేస్తామని తెలిపారు. ఎఫ్ ఆర్ ఐ తో సహా అన్నీ ఆన్ లైన్ చేస్తామని చెప్పారు. మరో వైపు పోలీస్ రిక్రూట్ మెంట్ లో తరచూ వివాదాస్పదమైతున్న 5కే రన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు ఉద్యోగాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామన్నారు. -
యాదగిరీశుడిని దర్శించుకున్నతెలంగాణ డీజీపీ
యాదిగిరిగుట్ట: నల్లగొండ జిల్లా యాదిగిరి గుట్టలో కొలువైన శ్రీ లక్ష్మినరసింహ స్వామిని సోమవారం తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ దర్శించుకున్నారు. తొలిసారి పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నేపధ్యంలో ఆయన స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకంలో పాల్గొన్నారు. కాగా, యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీక సోమవారం సందర్భంగా స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. -
తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా అనురాగ్ శర్మ
-
తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా అనురాగ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ నియమితులయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. అనురాగ్ శర్మను డీజీపీగా నియమించాలని నిర్ణయించారు. 1982 బ్యాచ్‌కు చెందిన అనురాగ్ శర్మ...రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. హైదరాబాద్ సిటీ సౌత్ జోన్ డీసీపీగా, సీపీగా, వరంగల్ డీఐజీగా పనిచేశారు. గ్రేహౌండ్స్ ఐజీ, అడిషనల్ జిల్లా డిజీగా, అలాగే 18 నెలలుగా ఇన్ఛార్జ్ డీజీపీగా పనిచేశారు. తెలంగాణ డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను ఇటీవల యూపీఎస్సీ రాష్ట్రానికి పంపింది. ఈ జాబితాలో సీనియర్ ఐపీఎస్ అధికారులు అరుణా బహుగుణ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ పేర్లు ఉన్నాయి. తెలంగాణ సర్కార్ అనురాగ్ శర్మ వైపే మొగ్గు చూపింది. -
టీఎస్ డీజీపీ ఎంపిక కోసం జాబితా
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీ రాష్ట్రానికి పంపింది. ఈ జాబితాలో సీనియర్ ఐపీఎస్ అధికారులు అరుణా బహుగుణ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ పేర్లు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ముగ్గురు అధికారుల్లో ఒకరిని పూర్తి స్థాయి డీజీపీగా నియమించనుంది. తెలంగాణ డీజీపీగా ప్రస్తుతం అనురాగ్ శర్మ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
గోదావరి తరహాలో కృష్ణా పుష్కరాలు
నల్గొండ : నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం నల్గగొండ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న అనురాగ్ శర్మ జిల్లాలో 30 పుష్కరఘాట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పుష్కరఘాట్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. ఆ క్రమంలో అనురాగ్ శర్మ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల్లో తెలంగాణలో ఎక్కడ ఏటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. -
పుష్కరాలకు విస్తృత భద్రత
హైదరాబాద్: తెలంగాణలో గోదావరి పుష్కరాలకు విస్తృత భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో 106 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భద్రాచలం, కరీంనగర్, బాసరలో ఐజీ స్థాయి అధికారులు భద్రత పర్యవేక్షిస్తారని అనురాగ్ శర్మ తెలిపారు. భారీ సంఖ్యలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. -
పోలీస్ ‘రీ-కాల్’ వివాదం కొలిక్కి
పది ప్లటూన్లు తిప్పి పంపడానికి తెలంగాణ అంగీకారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో డిప్యుటేషన్, బందోబస్తు విధుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని వెనక్కి పంపడంలో ఏర్పడిన వివాదానికి తెరపడింది. ప్రాథమికంగా పది ప్లటూన్లు (దాదాపు 200 మంది) పంపేందుకు తెలంగాణ డీజీపీ అంగీకరించారు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో వీరు ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి రిపోర్ట్ చేయనున్నారు. తెలంగాణకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లతో పాటు స్పెషల్ పోలీసు బెటాలియన్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దాదాపు నాలుగు వేల మంది ఉన్నారు. వీరిని ఏపీకి తీసుకువెళ్లాలంటే కమలనాథన్ కమిటీ పంపకాలు పూర్తి కావాల్సిందే. అయితే బందోబస్తుతో పాటు ఇతర ప్రత్యేక విధుల కోసం రాష్ట్ర విభజన తరువాత డిప్యుటేషన్‌తో పాటు ఇతర విధానాల్లో తెలంగాణకు వచ్చిన ఏపీ అధికారులు వందల సంఖ్యలో ఉన్నారు. గోదావరి పుష్కరాలతో పాటు ఇతర బందోబస్తు, భద్రతా అవసరాల దృష్ట్యా వీరిని వెనక్కి పిలవాలని ఏపీ పోలీసు విభాగం నిర్ణయించింది. వారు రిపోర్ట్ చేయడానికి వీలుగా రిలీవ్ చేయాలని తెలంగాణ డీజీపీని కోరగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యంకాదంటూ అక్కడి నుంచి తొలుత సమాధానం వచ్చింది. చివరకు విషయం గవర్నర్ వద్దకు చేరడం, గడిచిన ఐదారు రోజులుగా రెండు రాష్ట్రాలకూ చెందిన ఉన్నతాధికారుల సమాలోచనలతో ఈ వివాదం కొలిక్కివచ్చింది. తెలంగాణలో ఉన్న ఏపీకి చెందిన 42 ప్లటూన్లలో 10 ప్లటూన్లను తక్షణం వెనక్కి పంపడానికి అంగీకారం కుదిరింది. రంజాన్ పండుగ, గణేష్ నవరాత్రులు, నిమజ్జనం బందోబస్తుల అనంతరం విడతల వారీగా మిగిలిన వారినీ పంపుతామని తెలంగాణ డీజీపీ కార్యాలయం ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చింది. -
గవర్నర్‌తో తెలంగాణ డీజీపీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో కలసి గవర్నర్ వద్దకు వెళ్లారు. తెలంగాణ పోలీసులు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ బెటాలియన్లను నియమించుకున్నారు. తెలంగాణ పరిధిలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఏపీ పోలీసుల వ్యవహారంపై అనురాగ్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారని, ఇదే అంశాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. తాజా పరిణామాలను కూడా యన గవర్నర్‌కు వివరించినట్టు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో తెలంగాణ పోలీస్ బాస్‌లు గవర్నర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
గవర్నర్‌తో తెలంగాణ డీపీజీ, సీపీ భేటీ
-
గవర్నర్‌తో తెలంగాణ డీజీపీ, సీపీ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఓటుకు నోటు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇదే అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న గవర్నర్‌తో సమావేశమైన విషయం విదితమే. మరోవైపు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఈరోజు ఉదయం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. -
రేపు అమెరికాకు డీజీపీ అనురాగ్ శర్మ
హైదరాబాద్ సిటీ: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఈ నెల 27న సొంత పనుల నిమిత్తం అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 5 వరకు అమెరికాలో గడపనున్నారు. ఈ సమయంలో అడిషనల్ డీజీపీ సుదీప్ లటాకియా ఆయన స్థానంలో విధులు నిర్వర్తిస్తారు. -
తెలంగాణలో ముగ్గురు డీఎస్పీలు బదిలీ
హైదరాబాద్: రాష్ట్రంలో ముగ్గురు డీఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం డీఎస్పీ తిరుపతిని మహాంకాళిని ఏసీపీగా బదిలీ చేశారు. ట్రాన్స్‌కో డీఎస్పీ కృష్ణమూర్తిని మహబూబ్‌నగర్ ఎస్డీపీవోగా నియమించారు. అలాగే ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న చెన్నయ్యను ఎస్డీపీవోగా బదిలీ చేశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
'పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో అందరికి ఆదర్శంగా నిలవాలని ఆ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. అందుకోసం పోలీసు సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్ నగరంలో పోలీసు సిస్టమ్‌లో పాల్గొనే సిబ్బంది కోసం సిస్కోలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అనురాగ్ శర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పోలీసు శాఖలో 3600 మంది డ్రైవర్లు, 1500 మంది ట్రాఫిక్ హోంగార్డుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తన బడ్జెట్లో పోలీసు శాఖకు అత్యధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా పోలీసు వ్యవస్థకు ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఆగస్టు 15 నుంచి పోలీసు సిస్టమ్స్ ప్రారంభం కానుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లతోపాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
ఎక్కడా రాజీపడొద్దు: డీజీపీ అనురాగ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ ఐపీఎస్ అధికారులతో ఆ ప్రాంత డీజీపీ అనురాగ్ శర్మ సమావేశమయ్యారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడొద్దని అనురాగ్ శర్మ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలని వారికి సూచించారు. ఉమ్మడి రాజధానిలో రాజకీయ ప్రముఖుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం వారికి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. సిబ్బంది కొరతపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో ఖాళీల భర్తీకి త్వరలోనే రిక్రూట్మెంట్ చేపట్టాలని ఉన్నతాధికారులను డీజీపీ ఆదేశించారు.