హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో కలసి గవర్నర్ వద్దకు వెళ్లారు.
తెలంగాణ పోలీసులు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ బెటాలియన్లను నియమించుకున్నారు. తెలంగాణ పరిధిలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఏపీ పోలీసుల వ్యవహారంపై అనురాగ్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారని, ఇదే అంశాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. తాజా పరిణామాలను కూడా యన గవర్నర్కు వివరించినట్టు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో తెలంగాణ పోలీస్ బాస్లు గవర్నర్తో సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
గవర్నర్తో తెలంగాణ డీజీపీ భేటీ
Published Tue, Jun 16 2015 2:56 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM
Advertisement
Advertisement