‘కాంగ్రెస్‌ గూండాల దాడి.. ఇదా రాహుల్‌ గాంధీ ప్రేమ దుకాణం?’ | KTR Reacts On Congress leaders Attack at Achampet | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ గూండాల దాడి.. ఇదా రాహుల్‌ గాంధీ ప్రేమ దుకాణం?’

Published Wed, May 15 2024 12:49 PM | Last Updated on Wed, May 15 2024 12:51 PM

KTR Reacts On Congress leaders Attack at Achampet

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయటం అధికార దుర్వినియోగం చేయటమవుతుందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కాంగ్రెస్‌పై మండిపడ్డారు.  నిన్న( మంగళవారం) అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్‌ గూండాల దాడి ఘటనలో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటంపై కేటీఆర్‌ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘ప్రేమ దుకాణం’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.  

‘ప్రత్యర్థులపై నిర్మొహమాటంగా దాడి చేయడం, అధికార దుర్వినియోగం చేయటమే. పోలీసుల దుర్వినియోగం, దాడిలో భాగం కావడం సిగ్గుచేటు. ఇది రాహుల్‌ గాంధీ ప్రేమ దుకాణం. తెలంగాణ డీజీపీ.. ఈ గూండాలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులాగా ప్రేక్షక పాత్ర వహిస్తే.. మేము మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం జరిగేలా చూస్తాం’’ కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో విమర్శించారు.

 

అచ్చంపేటలో కాంగ్రెస్‌ గూండాల దాడికి సంబంధించిన వీడియోను బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.  దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉ‍న్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని వెంటనే చర్యలు తీసుకోవాలని  తెలంగాణ డీజీపీ ట్యాగ్‌ చేశారు. ప్రవీణ్‌కుమార్‌ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ కేటీఆర్‌పై విధంగా స్పందించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement