తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు.
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. రాజ్భవన్లో ఈ సమావేశం జరిగింది. ఓటుకు నోటు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా ఇదే అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న గవర్నర్తో సమావేశమైన విషయం విదితమే. మరోవైపు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఈరోజు ఉదయం కేసీఆర్తో సమావేశం అయ్యారు.