Hyderabad city police commissioner
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కేసు విచారణపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా సీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. ఈ కేసులో సోషల్ మీడియాకి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశాం. సైబర్ క్రైమ్ పోలీసులు ట్విట్టర్‌కు లేఖ రాసి సమాచారం తీసుకున్నారు. ఏ అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అయ్యిందో ట్విట్టర్ ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వీడియో మార్ఫింగ్ ఎక్కడ జరిగిందనేది పరిశీలిస్తున్నారు.మార్ఫింగ్ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపించాము. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత కేసులో పురోగతి ఉంటుంది. ఢిల్లీ పోలీసుల కంటే ముందే మేము కేసు నమోదు చేసి విచారణ చేశాము. మా వద్ద ఉన్న వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేశాం. ఒకే కేసులో రెండు విచారణలు చేస్తే కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది అని వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల కోసం ఫుల్ బందోబస్తు..ఇదే సమయంలో ఎన్నికల బందోబస్తు గురించి కూడా వివరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500 పోలీసులు, సీఏపీఎఫ్ నుంచి 13, సీఆర్పీఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో ఉంటారు. పోలింగ్ రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద సెంట్రల్ బలగాలను వాడుతాం. అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన దాని కంటే తక్కువ సెంట్రల్ బలగాలు ఈసారి హైదరాబాద్‌కి వచ్చాయి. మరిన్ని బలగాలను పంపాలని కోరాం.పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లోకేషన్స్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నడుస్తున్నాయి. హైదరాబాద్ పోలీసుల నుంచి క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా పని చేస్తున్నాయి. 85 మంది ఏసీపీలకు ప్రత్యేక టీమ్స్ ఉన్నాయి. పోలింగ్ రోజు ఈ టీమ్స్ పనిచేస్తాయి. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు లేయర్ల బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఎన్నికల కోడ్ వచ్చిన రోజు నుంచి 18 కోట్ల అక్రమ నగదుని ఇప్పటివరకు పట్టుకున్నాం. అలాగే, 12 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
హైదరాబాద్‌లో పేట్రేగిపోతున్న రౌడీ మూకలు
-
సీపీ అంజనీకుమార్‌తో స్పెషల్ ఇంటర్వూ@7PM
-
పోలీసుల ప్రశ్నలు.. విజయ్ సమాధానాలు
-
మావోయిస్టులకు హైదరాబాద్ సీపీ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : అమాయక యువకులను రెచ్చగొట్టి హింసా మార్గంలోకి తప్పుదారి పట్టించవద్దని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మావోయిస్టు సంస్థలను హెచ్చరించారు. టీవీవీ వంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు మావోయిస్టు గ్రూపులతో అనుబంధాలు కలిగిన సుదీర్ఘ చరిత్ర ఉందని, వారి వద్ద ఇటీవల నిషేధ సామాగ్రి దొరకడమే ఇందుకు నిదర్శనమన్నారు. అలాంటి సంస్థలతో సంబంధాలు కలిగిన నకిలీ మేధావులు కూడా కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదని సీపీ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఫ్రంటల్ సంస్థలపై అనేక జిల్లాలో చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని అంజనీ కుమార్ తెలిపారు. -
చార్మినార్ ఘటనలో కానిస్టేబుల్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్‌లోని యునాని హాస్పిటల్ తరలింపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చార్మినార్ కానిస్టేబుల్ పరమేశ్‌ను నగర సీపీ సస్సెండ్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ యునాని ఆస్పత్రి ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరపాలని సౌత్ జోన్ డీసీపీని ఆదేశించారు. -
పిన్నికి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి..
సాక్షి, హైదరాబాద్ : నల్లకుంటలో జరిగిన భారీ చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ అంజన్ కుమార్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 53 తులాల బంగారం, 5.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 24 లక్షలు ఉంటుందని అంజన్ కుమార్ వెల్లడించారు. వివరాలు.. నల్లకుట పరిధిలో నివాసం ఉంటున్న పిల్లి వినయ కుమారి తెలంగాణ పోలీస్ అకాడమీలో టెలిఫోన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ఆమెకు కూతురు వరస అయ్యే కుష్బూ నాయుడు అలియాస్ నక్కీ మారు తాళాలతో చోరీకి పాల్పడింది. పిన్ని వినయ కుమారికి నిమ్మ రసంలో నిద్ర మాత్రలు కలిసి ఇచ్చిన కుష్భూ అనంతరం తన ప్రియుడుతో పాటు అతడి స్నేహితుడి సాయంతో బంగారు నగలు, నగదుతో ఉడాయించింది. టెక్నాలజీని ఉపయోగించి బాధితురాలి కుటుంబ సభ్యుల కాల్ డేటా ఆధారంగా కేసును చేధించినట్లు తెలిపారు. నిందితులు అప్పటికే దొంగిలించిన సొత్తును అమ్మేయడానికి సిద్ధపడినట్లు, వీరిని బేగంపేట్‌లో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అప్పుడే త్వరగా చేధించే అవకాశం ఉంటుందని తెలిపారు. గత సంవత్సరం నుంచి డయల్ 100 ద్వారా ప్రజలకు నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఏ1 నిందితురాలిగా కుష్బూ నాయుడు, ఏ2 నిందితులుగా సుమల వంశీకృష్ణ, ఏ3 నిందితులు సూర్యగా పోలీసులు వెల్లడించారు. -
ఐదు గంటల్లోనే ఆ మహిళను గుర్తించాం!
హైదరాబాద్ : సుల్తాన్ బజార్ ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 2వ తేదీన 12 గంటల సమయంలో శిశువును కిడ్నాప్ చేశారని, ఐదు గంటల్లోనే కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. శిశువు కిడ్నాప్‌నకు సంబంధించి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గతంలో ఈ మహిళ రెండు సార్లు ఇలానే చేసిందని తెలిపారు. కిడ్నాప్ జరిగిన విషయం తెలిసిన వెంటనే ఈస్ట్ జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారని వివరించారు. ఈ కిడ్నాప్ కేసును సీసీ కెమెరాల ద్వారా తేలికగా చేధించగలిగామని చెప్పారు. కిడ్నాప్ చేసిన మహిళ శిశువును బీదర్ తీసుకువెళ్లడంతో బీదర్ పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చిందని, అలాగే మీడియా సహకారంతో కూడా ఒక రకంగా ఈ కేసును చేధించగలిగామని తెలిపారు. ఐదు గంటల్లో బీదర్‌కి టీం వెళ్లిందని, అక్కడ ఫోటోగ్రఫీ ద్వారా కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించామని వివరించారు. అక్కడ ద్విచక్రవాహనంలో కిడ్నాపర్ వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. ఈ సంచలన కేసులో పని చేసిన మా పోలీసు టీంలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆసుపత్రి సూపరిండెంట్‌ను కోరామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ చేతనను అభినందిస్తున్నట్లు చెప్పారు. పాప పేరు చేతనగా నామకరణం చేస్తున్నట్లు శిశువు తల్లి చెప్పిందని వెల్లడించారు. కూతుర్ని తన చెంతకు చేర్చిన పోలీసులందరికీ కూడా ఆమె ధన్యవాదాలు తెలియజేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి బీదర్‌లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. -
మరో ఆడియో విడుదల చేసిన కొత్వాల్
సాక్షి, సిటీబ్యూరో : నగరవాసులతో పాటు రాకపోకలు సాగించే వారినీ ఇబ్బందులకు గురి చేస్తున్న బైక్ ర్యాలీల సంస్కృతిని విడనాడాలంటూ సీపీ అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ఆడియో విడుదల చేశారు. అందులో కొత్వాల్ చెప్పిన వివరాలివీ.అందమైన హైదరాబాద్ దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరం. దాదాపు 80 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తున్న ఈ మహానగరం ఎప్పటికప్పుడు కొత్తగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఎందరో టూరిస్ట్‌లు, వ్యాపారులు బయటి ప్రాంతాల నుంచి నిత్యం వస్తున్నారు. కేవలం వీరే కాదు... స్థానికులు సైతం ఊరేగింపులు, ర్యాలీల వల్ల వారికి కలుగుతున్న ఇబ్బందులను నిత్యం నా దృష్టికి తీసుకువస్తున్నారు. వారంతా ప్రధానంగా మోటారు సైకిల్/బైక్ ర్యాలీల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మిత్రులారా మనం క్రమంగా నగరంలో ఉన్న కొన్నింటిని అధిగమించే దిశగా అడుగులు వేద్దామా! అలాంటి బైక్ ర్యాలీలు, ఊరేగింపుల వల్ల సాధారణ ప్రజలు ప్రభావితం కాకుండా చూడాలి. ఎలాంటి బైక్ ర్యాలీలు చేయకుండా నిర్వాహకులను ఒప్పించడానికి, వారిలో అవగాహన పెంచడానికి కృషి చేయాల్సిందిగా సహచర అధికారులు, సిబ్బందిని కోరుతున్నా. సామాన్యులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ బైక్ ర్యాలీల కోసం దరఖాస్తు కూడా చేయని విధంగా వారిలో మార్పు తీసుకురావాలి. నగరంలో జీవన ప్రమాణాల పెంచడానికి ఇది మనందరి కలిసి నిర్వర్తించాల్సిన బాధ్యత. నగరంలో ఉండే వారికి, పర్యటనలకు వచ్చే వారికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూద్దాం. అంతా కలిసి మన నగరాన్ని బైక్ ర్యాలీలు లేని విధంగా మార్చుకుందాం. దీన్ని సాకారం చేసుకుంటే కాలేజీలు, పాఠశాలలకు వెళ్ళే మీ పిల్లలు, వారి స్నేహితులతో పాటు ఆస్పత్రులకు వెళ్ళే రోగులు, వారి సంబంధీకులు ఎంతో ఉపశమనం పొందుతారు. ఈ చిన్న మార్పును సాకారం చేయడం ద్వారా మన నగరాన్ని రానున్న తరాలకు ఓ స్వర్గాధామంగా మార్చుకోవచ్చు. నగరాన్ని సుఖసంతోషాలతో నింపాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. -
చెంబు కావాలా నాయనా!, పంచ్‌లు..సెటైర్లు
‘ఈ ఇత్తడి చెంబును చూశారా.. దీనికి శక్తులున్నాయట. ఈ విషయం ఇక్కడ కనిపిస్తున్నారే వీరు చెప్పేదాకా నాకూ తెలీదు.. వీరంతా రైస్ పుల్లర్స్ చెంబులు అమ్ముతుంటారు.. ఒక్కసారి వీరితో మాట్లాడారంటే విలేకర్లు అన్న సంగతి కూడా మరిచిపోయి మీరూ కొనేస్తారు. వీరిలో ఒకడు నిట్‌లో ఎంటెక్ చేశాడు. ఆ విషయం చెబుతుంటే ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు’.. ఇదేదో ఆషామాషీ వ్యక్తి అన్న ఛలోక్తులు కాదు.. కమిషనర్ స్థాయి అధికారి విసిరిన హాస్యోక్తులు. నగర ఇన్చార్జి కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌కు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఆద్యంతం ఛలోక్తులతో నింపేశారు. సాక్షి,సిటీబ్యూరో: బియ్యాన్ని ఆకర్షించడం తో పాటు అతీంద్రియ శక్తులు ఉన్నాయంటూ కొన్ని నాణాలను చూపించి మోసాలు చేసే ముఠాలను ఇప్పటి వరకు చూశాం. అయితే నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న గ్యాంగ్ మాత్రం నాణాల స్థానంలో బిందెలను వినియోగించింది. ‘రైస్ పుల్లర్’ గా పిలిచే వీటిని అంతర్జాతీయ మార్కెట్ లో కోట్ల ధర ఉంటుందని, ఇవి దగ్గర ఉంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మించి రూ.లక్షల్లో దండుకుంది. ఈ ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నట్లు ఇన్చార్జి పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. భారీ హంగులతో కార్యాలయం... ప్రకాశం జిల్లా బోదనపాడుకు చెందిన ఆంజనేయులు వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ దళారి. ఇతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ‘రైస్ పుల్లర్ల’ వ్యాపారం ప్రారంభించాడు. వరంగల్‌లో ఎన్ఐటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటూ సివిల్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న మహ్మద్ ఫజలుద్దీన్, రెడీమేడ్ షాపులో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న గౌలిగూడకు చెందిన బాబుల్, ఇంజిన్ ఆయిల్ సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న బాబూరావులతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఆంజనేయులు కస్టమర్లను తేలిగ్గా బుట్టలో వేసుకునేందుకు సికింద్రాబాద్ ఎస్డీ రోడ్‌లోని సూర్య టవర్స్‌లో కార్పొరేట్ హంగులతో ఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు. వీరంతా వివిధ మార్గాల్లో బాధితులను అక్కడికి రప్పించి వారితో సమావేశం కావడం, ‘డెమోలు’ చూపించడం కోసం ఈ ఆఫీస్‌ను వాడుకునేవారు. ఐదుగురు కారు డ్రైవర్లకు టోకరా... ఈ గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన బాబూరావు గతేడాది ప్రయాణించిన వాహనానికి బోయిన్‌పల్లికి చెందిన విష్ణుమూర్తి డ్రైవర్‌గా వ్యవహరించారు. అతడితో తాను డీఆర్డీఓ సంస్థలో శాస్త్రవేత్తగా పరిచయం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘రైస్‌పుల్లర్స్’ విషయం ప్రస్తావనకు తెచ్చిన అతను, ఇక్కడ కేవలం రూ.లక్షల ఖరీదు చేసే ఆ పాత్రలకు అతీతశక్తులు ఉన్నందున విదేశాల్లో రూ.కోట్లకు అమ్ముడుపోతాయని చెప్పాడు. ఓ శాస్త్రవేత్తే ఇలాంటి విషయం చెప్పడంతో నమ్మిన విష్ణుమూర్తి వాటిపై ఆరా తీయగా అతను ఆంజనేయుల్ని రంగంలోకి దింపగా... రైస్ పుల్లర్ బిందెకు ఉన్న మహిమలకు సంబంధించిన వీడియోలను వాట్సాప్‌లో విష్ణుకు చూపించాడు. ఆపై దాని ఖరీదు రూ.20 లక్షలని చెప్పాడు. అంత మొత్తం విష్ణు ఒక్కడే వెచ్చించలేకపోవడంతో అతడికి పరిచయస్తులైన మరో నలుగురు డ్రైవర్లతో కలిసి డబ్బు సర్దుబాటు చేశాడు. ఇది తీసుకున్న ముఠా వారిని మోసం చేసింది. మైన్స్ వ్యాపారం పేరుతో మరొకరికి వేములవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్‌కు కొన్నాళ్ళ క్రితం వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఆంజనేయులుతో పరిచయమైంది. తాను మైన్స్ (ఖనిజాల) వ్యాపారం చేస్తానంటూ చెప్పిన ఆంజనేయులు ఆపై అసలు కథ ప్రారంభించాడు. అతీతశక్తులున్న రైస్ పుల్లర్స్ ఇప్పిస్తానంటూ నమ్మించి తన కార్యాలయానికి తీసుకువెళ్ళాడు. అక్కడకు కస్టమర్ల మాదిరిగా వచ్చిన బాబుల్, బాబూరావు, ఫజలుద్దీన్ గతంలో తాము కూడా రైల్ పుల్లర్ బిందె కొన్నామని, ఆపై తమ దశ మారిపోయిందని రమేష్‌ను నమ్మించి, ఆయన నుంచి రూ. 33 లక్షలు తీసుకుని అడ్డంగా ముంచేశారు. ఈ ముఠాకు కోల్‌కతాలో బీటా ట్రేడర్స్ నిర్వాహకుడు రాహుల్ హుడా సైతం సహకరిస్తున్నాడు. ఎవరైనా వినియోగదారుడు ఈ గ్యాంగ్ నుంచి రైస్‌పుల్లర్ ఖరీదు చేయడానికి ముందుకు వస్తే ఇతడు రంగంలోకి దిగుతాడు. ఆంజనేయులు ఆఫీస్‌కు వచ్చే రాహుల్ సదరు బిందెకు రకరకాల పరీక్షలు చేస్తున్నట్లు నటించి చివరకు అది నిజమైన రైస్‌పుల్లర్‌గా సర్టిఫికేషన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ కేటుగాళ్ళు చేతిలో అనేక మంది మోసపోయినప్పటికీ కేవలం విష్ణుమూర్తి, రమేష్ మాత్రమే ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు, స్వాధీనం చేసుకున్న నగదు విష్ణు ఇచ్చిన ఆధారాలతో.. ఈ ముఠాపై బోయిన్పల్లి, మహంకాళి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు. ఎస్డీ రోడ్‌లోని కార్యాలయంలో నిందితులు లేకపోవడం, వారి సెల్ఫోన్లు పని చేయకపోవడం దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించాయి. దీంతో బాధితుల్లో ఒకరైన విష్ణు డ్రైవర్ కావడం, గతంలో అతడు బాబూరావును తీసుకుని పలుచోట్లకు వెళ్ళడంతో అతడిచ్చి ఆధారాలతో టాస్క్‌ఫోర్స్ గురువారం మొత్తం నలుగురినీ పట్టుకోగలిగింది. వీరి నుంచి రూ.34.19 లక్షల నగదు, ఇన్నోవా వాహనం, రైస్ పుల్లర్స్‌గా చెప్పిన మూడు చిన్న బిందెలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంది. కోల్‌కతాకు చెందిన రాహుల్ కోసం గాలిస్తున్నారు. పంచ్‌లు..సెటైర్లు నగర పోలీసులు నిర్వహిం చే విలేకరుల సమావేశాలు సాధారణంగా నేరాలకు సంబంధించే ఉంటాయి. అందునా.. కొత్వాల్ స్థాయి అధికారి ప్రెస్మీట్లో వాతావరణం గంభీరంగా ఉంటుంది. అయితే నగర ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు ఈ ‘సంప్రదాయాన్ని’ మార్చారు. రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌కు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఆద్యంతం చలోక్తులతో నింపేశారు. దీంతో కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్ నవ్వులతో నిండిపోయింది. నిందితుల నుంచి పోలీసులు నగదు, రైస్ పుల్లర్స్‌గా చెప్పిన బిందెలతో పాటు ఓ ఇన్నోవా కారునూ రికవరీ చేశారు. సీపీ రికవరీ వస్తువులను చూపుతూ ‘అన్నీ ఇక్కడ పెట్టాం కానీ, కారు తెచ్చిపెట్టలేకపోయాం’ అన్నారు. నిందితుల్లో ఒకరు వరంగల్ ఎన్ఐటీలో పీజీ చేశారు. విలేకరుల సమావేశంలో అతను ముఖందాచుకోగా ‘ఈయనే ఎంటెక్ చేసింది. ఆ విషయం చెప్తుంటే సిగ్గుపడుతున్నారు’ అన్నారు. రైస్ పుల్లర్స్‌గా చెప్పినవి వాస్తవానికి ఇత్తడి బిందెలు. ఇవి ఖరీదు చేసి మోసపోయిన వారికి ఎందుకు పని చేస్తాయంటూ విలేకరులు ప్రశ్నించగా... ‘కొన్నాక ఏ యూజ్ లేకపోతే అన్నం వండుకోవడానికో, మంచినీళ్ళు పట్టుకోవడానికో’ అన్నారు. ‘రైస్ పుల్లర్స్’ ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన కస్టమర్లను నిందితులు ఎలా నమ్మిస్తారో ప్రత్యక్షంగా చూపాలని విలేకరులు కోరగా, కొత్వాల్ స్పందిస్తూ... ‘చూసి మీరు కూడా ట్రై చేస్తారా ఏంటి?’ అంటూ ప్రశ్నించారు. ఇది టీజరేనంటూ నగర ఇన్చార్జి కొత్వాల్‌గా వీవీ శ్రీనివాసరావు నవంబర్ 12న బాధ్యతలు తీసుకున్నారు. ఆపై కేసుకు సంబంధించి ఆయన నిర్వహించిన తొలి విలేకరుల సమావేశం ఇదే. త్వరలో వార్షిక విలేకరుల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ విషయాన్నే ఆయన తనదైన శైలిలో ప్రస్తావిస్తూ... ‘యాన్యువల్ రిలీజ్‌కు ఇది టీజర్ లాంటిది’ అని పేర్కొన్నారు. నిందితులతో మాట్లాడించాలని కోరగా ‘వాళ్ళు కాస్సేపు మాట్లాడితే మీరూ ఓ చెంబు కొంటారు. ఎందుకులే’ అంటూ దాటవేశారు. ఈ సందర్భంగా ఫొటో జర్నలిస్ట్ రికవరీ చేసిన కరెన్సీ చూపమని కొత్వాల్‌ను సైగలతో కోరుతూ కరెన్సీ వైపు చేయి చూపించారు. దీనికీ ‘స్పందించిన’ వీవీ శ్రీనివాసరావు ‘ఆ డబ్బు కావాలా... మీకు ఇవ్వలేం’ అంటూ చలోక్తి విసిరారు. సాధించనిదే వదలడు సీసీ వీవీ శ్రీనివాసరావుకు విధి నిర్వహణలో తనకు తానే సాటి అని ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఏదైనా ఓ విషయంపై దృష్టి పెడితే ఎంతకష్టమైనా అందులో విజయం సాధిస్తారు. వీవీ శ్రీనివాసరావు కుమార్తె ఓ దశలో ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలని భావించారు. ఆమెకు ఆ భాష నేర్పడం కోసం ఆయన ఇంటర్నెట్ను ఆశ్రయించి కొన్నాళ్ళ పాటు అకుంఠిత దీక్షతో ఫ్రెంచ్ భాషను అనర్గళంగా నేర్చుకుని... తన కుమార్తెకూ నేర్పారు. ప్రస్తుతం సీపీ ఆ భాషను మాట్లాడటం, రాయడం, చదవడం చేయగలరు. -
ఐఎస్‌డబ్ల్యూ, యూఎస్ సీక్రెట్ సర్వీస్ తో భద్రత
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలోని ఫలక్ నుమాలో ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రజల సహకారంతోనే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. కాగా నగరంలో ఈనెల 28నుంచి అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు జరగనున్న నేపథ్యంలో ఫలక్‌నుమా పరిసర ప్రాంతాల్లో పోలీసులు శుక్రవారం ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ప్రాంతాలపై పోలీస్ నిఘా పెంచారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...పాతబస్తీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో పలువురి అనుమానితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే అంతర్జాతీయ సదస్సు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ఇక ఇవాంకా ట్రంప్ చార్మినార్ సందర్శనపై ఇప్పటివరకూ తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపారు. సీపీ మాట్లాడుతూ...‘28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మియాపూర్‌లో మెట్రో రైలు ప్రారంభోత్సవానికి హాజరు అవుతున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రధాని, ఇవాంకా ట్రంప్‌తో పాటు 100మంది ప్రత్యేక అతిథులు హాజరు అవుతున్నారు. అలాగే వారికి ఫలక్ నుమా ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు గంటలపాటు ప్రధాని ప్యాలెస్‌లో ఉండే అవకాశం ఉంది. ఐఎస్‌డబ్ల్యూ (రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్), యుఎస్ సీక్రెట్ సర్వీస్ వారితో ...ఇంటర్నల్ మీటింగ్‌కు భద్రత పెంచాం. రెండువేలమందితో బందోబస్తు ఏర్పాటు చేశాం, హోంగార్డు నుంచి కమిషనర్ స్థాయి అధికారులు వరకూ అంతా ఆన్‌డ్యూటీలో ఉంటారు.’ అని తెలిపారు. -
ఐఎస్‌డబ్ల్యూ, యూఎస్ సీక్రెట్ సర్వీస్ తో భద్రత
-
'త్వరగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు'
హైదరాబాద్ : గణేశ్ నిమజ్జోత్సవానికి కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో సాక్షితో మాట్లాడుతూ.... పాతబస్తీలో ఐసిస్ కదలికల నేపథ్యంలో పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 12 వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జోన్ల వారీగా సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన ఊరేగింపును పరిశీలిస్తామన్నారు. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. సోధ్యమైనంత త్వరగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్లు మహేందర్‌రెడ్డి వివరించారు. -
హనుమాన్ జయంతి ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
హైదరాబాద్ : గౌలిగూడలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా వందల కెమెరాలతో నిరంతర భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం గౌలిగూడలో రేపు జరగనున్న హనుమాన్ జయంతి ఊరేగింపు ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితోపాటు మహేందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 5 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మహేందర్‌రెడ్డి వివరించారు. -
పాతబస్తీ దాడులపై సీపీ సమీక్ష
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓల్డ్ సిటీలో జరిగిన దాడులపై పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఓల్డ్ సిటీ దాడుల నిందితులను గుర్తించి... వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తనపై దాడి చేశారని బీజేపీ అభ్యర్ధి బుధవారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అక్బరుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
'డ్రంకన్ అండ్ డ్రైవర్లు సూసైడ్ బాంబర్లు'
హైదరాబాద్: లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే రాందేవగూడ చెక్ పోస్టు వద్ద ప్రమాదం జరిగిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. దురదృష్టవశాత్తు ఒకరిని కోల్పోయామని, ముగ్గురికి గాయాలయ్యాయని చెప్పారు. డ్రంకన్ అండ్ డ్రైవర్లు సమజానికి సూసైడ్ బాంబర్లు అని వ్యాఖ్యానించారు. గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామని భరోసాయిచ్చారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్‌గూడలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసు చెక్‌పోస్టుపైకి లారీ దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో రాహుల్ యాదవ్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. -
గవర్నర్‌తో తెలంగాణ డీపీజీ, సీపీ భేటీ
-
గవర్నర్‌తో తెలంగాణ డీజీపీ, సీపీ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఓటుకు నోటు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇదే అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న గవర్నర్‌తో సమావేశమైన విషయం విదితమే. మరోవైపు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఈరోజు ఉదయం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. -
'ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు'
-
అసెంబ్లీ వద్ద నిషేధాజ్ఞలు
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాల పునఃప్రారంభం నేపథ్యంలో శాసనసభ పరిసరాల్లోని రెండు కిలోమీటర్ల మేర నిషేధాజ్ఞలు విధిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. అసెంబ్లీ పరిసరాల్లో సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి ఉండదు. ఎవరైనా నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అనురాగ్‌శర్మ హెచ్చరించారు. -
'వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం'
హైదరాబాద్: చంచల్‌గూడ జైలు వద్ద వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధులు గట్టు గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్, హబీబ్ అబ్దుల్ రెహ్మాన్ సిపిని కలిశారు. తమ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నప్పటికీ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహతంగా ప్రవర్తిస్తూ, అరెస్ట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్మోహన రెడ్డి ఎవరికీ వ్యతిరేకంకాదని వారు చెప్పారు. జగన్ దీక్షకు సంఘీభావం చెబుతున్నవారిని అడ్డుకోవడం తగదన్నారు. ధర్నాలు, నిరసనలు శాంతియుతంగా చేస్తున్నా పోలీసులు వివక్ష చూపుతున్నారని ఫిర్యాదు చేశారు. జగన్ దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలపై ఉదయం పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. మహిళలతోపాటు 150 మంది నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, మూలా హరీష్‌గౌడ్, సుదర్శన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, శ్రీహరి, సురేష్‌గౌడ్, బాల్‌రెడ్డి, సుజాత, రంగారెడ్డి జిల్లా నేతలు అమృతసాగర్, సురేష్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్లు జనార్దన్‌రెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రాచమల్లు సిద్ధేశ్వర్, దేపా భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసయాదవ్, వడ్డేపల్లి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. -
బయటివాళ్లు వస్తే ఊరుకోం: సీపీ శర్మ
ప్రభుత్వ కార్యాలయాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి ఆందోళనలు చేస్తే ఊరుకోబోమని హైదరాబాద్ పోలీసు నగర కమిషనర్ అనురాగ్ శర్మ హెచ్చరించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో జరిగే నిరసనల్లో ఇతరులకు అనుమతిలేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీఎన్జీవోలు, తెలంగాణ ఉద్యోగులు వేర్వేరు సమయాల్లో ఆందోళనలు చేసుకోవాలని కోరారు. నిరసనలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. పౌరులకు ఇబ్బంది కలిగించేలా ఆందోళనలు చేయొద్దని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లో సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. రాష్ట్ర రాజధాని వాసుల బాధ్యత తమపై ఉందని అనురాగ్‌శర్మ అన్నారు.