మావోయిస్టులకు హైదరాబాద్‌ సీపీ హెచ్చరిక | Hyderabad CP Anjani Kumar Alert to Maoists | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు హైదరాబాద్‌ సీపీ హెచ్చరిక

Published Fri, Oct 11 2019 3:27 PM | Last Updated on Fri, Oct 11 2019 3:40 PM

Hyderabad CP Anjani Kumar Alert to Maoists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమాయక యువకులను రెచ్చగొట్టి హింసా మార్గంలోకి తప్పుదారి పట్టించవద్దని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మావోయిస్టు సంస్థలను హెచ్చరించారు. టీవీవీ వంటి ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్లకు మావోయిస్టు గ్రూపులతో అనుబంధాలు కలిగిన సుదీర్ఘ చరిత్ర ఉందని, వారి వద్ద ఇటీవల నిషేధ సామాగ్రి దొరకడమే ఇందుకు నిదర్శనమన్నారు. అలాంటి సంస్థలతో సంబంధాలు కలిగిన నకిలీ మేధావులు కూడా కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదని సీపీ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఫ్రంటల్‌ సంస్థలపై అనేక జిల్లాలో చాలా క్రిమినల్‌ కేసులు ఉన్నాయని త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని అంజనీ కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement