
బయటివాళ్లు వస్తే ఊరుకోం: సీపీ శర్మ
ప్రభుత్వ కార్యాలయాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి ఆందోళనలు చేస్తే ఊరుకోబోమని హైదరాబాద్ పోలీసు నగర కమిషనర్ అనురాగ్ శర్మ హెచ్చరించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో జరిగే నిరసనల్లో ఇతరులకు అనుమతిలేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీఎన్జీవోలు, తెలంగాణ ఉద్యోగులు వేర్వేరు సమయాల్లో ఆందోళనలు చేసుకోవాలని కోరారు.
నిరసనలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. పౌరులకు ఇబ్బంది కలిగించేలా ఆందోళనలు చేయొద్దని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లో సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. రాష్ట్ర రాజధాని వాసుల బాధ్యత తమపై ఉందని అనురాగ్‌శర్మ అన్నారు.