పాతబస్తీలోని ఫలక్ నుమాలో ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రజల సహకారంతోనే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. కాగా నగరంలో ఈనెల 28నుంచి అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు జరగనున్న నేపథ్యంలో ఫలక్‌నుమా పరిసర ప్రాంతాల్లో పోలీసులు శుక్రవారం ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ప్రాంతాలపై పోలీస్ నిఘా పెంచారు.