Falaknuma Palace
-
గిన్నిస్‌లోకి భాగ్య‘నగ’లు!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ఆభరణాల సంస్థ రూపొందించిన ఆభరణాలకు ఏకంగా 8 గిన్నిస్ రికార్డులు లభించాయి. 11,472 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువైన (1,011.150 గ్రాములు) బంగారు గణేశ్ పెండెంట్, అత్యధికంగా 54,666 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువుగల (1,681.820 గ్రాములు) బంగారు రామ్‌దర్బార్ పెండెంట్, 315 పచ్చలు, 1,971 వజ్రాలతో పొదిగిన ద సెవన్ లేయర్ నెక్లస్, 63.65 క్యారట్ల పచ్చలు, 29.70 క్యారట్ల వజ్రాలు ఉపయోగించి తయారు చేసిన అత్యంత ఖరీదైన (సుమారు రూ. 90 లక్షల) భూతద్దం గిన్నిస్‌లో చోటుదక్కించుకున్నాయి. ఆదివారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివ్‌నారాయణ్ జ్యుయలర్స్ ఎండీ తుషార్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో మరే ఆభరణాల సంస్థకు ఈ ఘనత లభించలేదన్నారు. హైదరాబాద్ నిజాం ఆభరణాల వైభవంలో కీలకపాత్ర పోషించిన తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ నగర ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి దిశాపటాని ఆయా ఆభరణాలను ధరించి ప్రదర్శించింది. -
ఘనంగా గుణశేఖర్ కుమార్తె వివాహం.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శక-నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో శుక్రవారం రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం)ఈ పెళ్లి జరిగింది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ విద్య, వ్యాపారవేత్త, శ్రీ శక్తి అధినేతలు డా. రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు, వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో నీలిమ గుణ ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రుద్రమదేవి సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన నీలిమ శాకుంతలం(సమంత లీడ్ రోల్లో నటించారు)సినిమాతో నిర్మాతగా మారారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
KGF Chapter 2: ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో రాఖీ భాయ్
రాఖీ భాయ్ గుర్తున్నాడు కదా! అదేనండీ.. ‘కేజీఎఫ్’ రాఖీ భాయ్ గురించే చెబుతున్నాం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్1’కు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో రాఖీ భాయ్‌కు ఓ పెద్ద ప్యాలెస్‌తో పాటు ఓ రహస్య భవంతి కూడా ఉంటుందట. ఇందుకు కావాల్సిన సన్నివేశాలను హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో చిత్రీకరించారని తెలిసింది. ఈ లొకేషన్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరణ జరిగిందట. నిజానికి ప్యాలెస్ సెట్‌ను బెంగళూరులో వేశారట. ఇక్కడ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తీసిన సన్నివేశాలను ఆ సెట్‌తో మ్యాచ్ చేస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. -
నితిన్-షాలినీల వివాహం
-
‘ఓ ఇంటివాడినయ్యా.. దీవించండి’
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్–షాలినీల వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనను పాటించి, తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిపారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వివాహం అనంతరం షాలినీ మెడలో తాళి కడుతున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేసిన నితిన్ ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి’ అని పేర్కొన్నారు. పెళ్లి కానుక నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తీ సురేష్ కథానాయిక. నితిన్ పెళ్లి సందర్భంగా ‘ఏ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ టు అవర్ హీరో’ అంటూ ‘రంగ్ దే’ టీమ్ టీజర్‌ని విడుదల చేసింది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు టీజర్లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్). (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Mothaniki oka INTIVAADINI ayyanuu..😀😀 need all ur blessings n love 🙏🙏 pic.twitter.com/rWUNFDHZ5O — nithiin (@actor_nithiin) July 26, 2020 -
పెళ్లి సందడి షురూ
హీరో నితిన్, షాలినీల పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. కరోనా కారణంగా వారి పెళ్లిని నిరాడంబరంగా చేయాలని ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరగనుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల నిశ్చితార్థం కూడా సింపుల్‌గా జరిపారు. పెళ్లి వేడుకల్లో భాగంగా మెహందీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నితిన్ ని పెళ్లి కొడుకుని చేశారు. ఈ వేడుకకు హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, హారికా అండ్ హాసినీ క్రియేష¯Œ ్స నిర్మాత చినబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘‘నన్ను పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా ఆశీర్వదించడానికి పవర్‌స్టార్, త్రివిక్రమ్, చినబాబుగార్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు వారికి ధన్యవాదాలు’’ అన్నారు నితిన్. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఫలక్‌నుమా ప్యాలెస్‌కు 125 ఏళ్లు
సాక్షి,సిటీబ్యూరో: ఆకాశం ఛత్రం కింద అద్దంలా మెరిసే అద్భుత నిర్మాణం అది. వెన్నెల రాత్రి చందమామకే కన్నుకుట్టే సౌందర్యం దాని సొంతం. అంతటి అందం హైదరాబాద్ నగరానికే సొంతం. అదే ‘ఫలక్‌నుమా ప్యాలెస్’. ప్రపంచంలోని ఉత్తమ భవనాల్లో ఒకటిగా నిలిచిన ఈ ప్యాలెస్.. ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో హైదరాబాద్ రాజ్య ప్రధానిగా పనిచేసిన పైగా వంశస్తుడు సర్ వకారుల్ ఉమ్రా సారథ్యంలో నిర్మితమైంది. చార్మినార్‌కు ఐదు కి.మీ దూరాన ఉన్న కొండపై 1884లో శంకుస్థాపన చేసి.. దాదాపు పదేళ్ల పాటు నిర్మాణం సాగి 1894 అక్టోబర్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ ఇంద్రభవనానికి ఈ నెలతో 125 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పుల పాలైన వికారుల్ హైదరాబాద్ సంస్థానంలో ‘పైగా’లు నిజాంల సైన్యాధ్యక్షులుగా సేవలందించారు. ఆరో నిజాం బావమరిది, ప్రధాని అయిన సర్ వకారుల్ ఉమ్రా తనకుంటూ రాజ్యంలో ప్రత్యేక భవనాన్ని కట్టించాలని తలంచి ‘ఫలక్‌నుమా ప్యాలెస్’కు అంకురార్పణ చేశాడు. దాదాపు 32 ఎకరాల్లో 44 ప్రధాన గదులతో పాటు జనానా మహల్, గోల్ బంగ్లా, హరీం క్వార్టర్లు, వంటగది వంటి ఉన్నాయి. వకారుల్ వృశ్చిక రాశిలో పుట్టడం వల్ల ఈ భవనాన్ని కూడా ‘తేలు’ ఆకారంలో నిర్మించాడు. ఇండో ఆరేబియన్, పర్శియన్, ఇటాలియన్ శైలులు ఈ భవనంలో కనిపిస్తాయి. ప్యాలెస్‌కు వాడిన పాలరాయిని ఇటలీ నుంచి, కలప ఇంగ్లాండ్ నుంచి, గొడల పైకప్పు మీద ఫ్రెంచ్ చిత్రకారులతో అందమై డిజైన్లు గీయించారు. అయితే, ఈ ప్యాలెస్ నిర్మాణంతో వికారుల్ వద్దనున్న ధనం మొత్తం ఖర్చయిపోగా అప్పులపాలైపోయాడు. వాటిని తీర్చేందుకు భార్య సలహా మేరకు తన బావ, ఆరో నిజాంను తన ప్యాలెస్‌కు ఆహ్వానించాడు. నిజాం పరిస్థితిని అర్థం చేసుకోవడంతో పాటు నిర్మాణం నచ్చి ఫలక్‌నుమా ప్యాలెస్‌ను రూ.60 వేలకు సొంతం చేసుకున్నాడు. అలా 1897లో ఆరో నిజాం అధీనంలోకి వచ్చి రాయల్ గెస్ట్‌హౌస్‌గా మారింది. ఈయన 1911లో మరణించే వరకు ఇక్కడే నివాసమున్నాడు. తర్వాత ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ ప్యాలెస్‌ను యూరోపియన్ శైలిలో మార్పు చేయించాడు. హోటల్ తాజ్‌ఫలక్‌నుమాగా.. స్వతంత్ర భారతదేశంలో నిజాం పాలన ముగిశాక ఈ ప్యాలెస్ ఏడో నిజాం మనవడు బర్కత్ అలీఖాన్ ముకరంజా అధీనంలోకి వచ్చింది. 1948 నుంచి దాదాపు 2000 వరకు ఈ ప్యాలెస్‌లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. తర్వాత ముకరంజా మొదటి భార్య అస్రా తన అధీనంలో తీసుకొని 30 ఏళ్ల పాటు తాజ్ హోటల్ గ్రూప్‌కు ఇవ్వడంతో 2000 సంవత్సరంలో ఇది ‘తాజ్ ఫలక్‌నుమా’గా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నగరంలో అత్యంత ఖరీదైన హోటళ్లలో మొదటి స్థానంలో ఉంది. ఇందులోనే ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన డైనింగ్ హాల్ ఉంది. ఇక్కడ ఒకేసారి 101 మంది భోజనం చేయవచ్చు. ఈ హోటల్లోని డైనింగ్ హాల్లో భోజనం చేయాలంటే పూటకు ఇకొక్కరికీ రూ.15 వేలు చెల్లించాల్సిందే. ఇక గదుల అద్దె కూడా రూ.20 వేల నుంచి మొదలై రూ.5 లక్షల వరకు ఉంది. -
ఫలక్నామా ప్యాలెస్‌లో క్యాథరిన్ హడ్డాకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులెట్ జనరల్ క్యాథరిన్ హడ్డాకు తెలంగాణ ప్రభుత్వం తరఫున వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. నగరంలోని ఫలక్నామా ప్యాలెస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వీడ్కోలు సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సహా వందమందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందమైన ప్యాలెస్‌లో వీడ్కోలు పలుకుతున్నందుకు సంతోషంగా ఉందంటూ క్యాథరిన్ హడ్డా తన సంతోషాన్ని ట్విటర్లో పంచుకున్నారు. సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా హాజరయిన కేటీఆర్.. ఆమెకు చేనేత చీరను బహుకరించారు. రాష్ట్రానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఐటీ, పెట్టుబడుల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ విందులో పాల్గొన్నారు. -
ఫ్యాషన్ షో.. స్టార్స్ ఫ్లో
నగరంలో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోలలో తారల తళుకులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ర్యాంప్‌పై కొలువుదీరే మోడల్స్ మధ్యలో ఒకరిద్దరే స్టార్స్ కనిపించేవారు. అయితే ఆ దశ నుంచి తారల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘టీచ్ ఫర్ ఛేంజ్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో పూర్తిగా స్టార్స్‌కే పరిమితమైంది. దీంతో సిటీలో సరికొత్త ట్రెండ్‌కి నాంది పలికినట్టయింది. సాక్షి, సిటీబ్యూరో : సిటీలో ఫ్యాషన్ రంగం ఊపందుకుంటున్నా, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డిజైనర్లు తమ బొటిక్‌లను ఇక్కడ నెలకొల్పుతున్నా... ముంబైతో పోలిస్తే ఇక్కడి ఫ్యాషన్ ఈవెంట్లలో సినీతారల సందడి బాగా తక్కువేనని చెప్పాలి. కారణమేదైనా... ఎక్కువగా సినిమారంగ ప్రముఖులు ర్యాంప్ మీద కనపడకపోవడం సిటీలోని ఫ్యాషన్ ఈవెంట్ల రేంజ్‌ని తగ్గిస్తోందని గత కొంత కాలంగా నగరానికి చెందిన ఫ్యాషన్ రంగ ప్రముఖులు అంటున్నారు. అయితే ఇటీవల పరిశీలిస్తుంటే నిదానంగానే అయినా... ర్యాంప్ షోలలో స్టార్స్ సందడి పెరగడం కనిపిస్తోంది. న్యూ ‘ఛేంజ్’.. ఈ క్రమంలోనే మోడల్స్ లేకుండా పూర్తిగా స్టార్స్‌తో ఒక షోని నిర్వహించి ‘టీచ్ ఫర్ ఛేంజ్’ సంస్థ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. తమ ఎన్జీఓకి నిధుల సేకరణ నిమిత్తం ఈ సంస్థ నిర్వహించిన షోలో నగరానికి చెందిన డిజైనర్ రాజ్యలక్ష్మి గుబ్బా డిజైన్ చేసిన బెనారస్ చీరల్ని ధరించి రకుల్, రెజీనా తదితర తారలు... మరో డిజైనర్ వరుణ్ చకిలం సృష్టించిన మెన్స్‌వేర్‌తో విజయ్ దేవరకొండ లాంటి యువ హీరోలు ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని డైనింగ్ టేబుల్ లాంజ్‌ని తమదైన శైలిలో మెరిపించారు. సిటీలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ ఈవెంట్ మరింత మంది స్టార్స్‌ని ఫ్యాషన్ ఈవెంట్ల వైపు మళ్లించడం తథ్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. సిటీ ర్యాంప్‌పై మెరిసే తారల సంఖ్య భవిష్యత్తులో విజృంభించడం ఖాయం. స్టార్+డిజైనర్=గ్లామర్ ఒక తారను త‘లుక్’మనిపించాలన్నా, కొంతకాలం పాటు యూత్‌ని సినీ స్టైల్‌తో ఉర్రూతలూగించాలన్నా డిజైనర్‌దే ప్రధాన పాత్ర. గ్లామర్ రంగానికి ఫ్యాషన్‌తో విడదీయలేని సంబంధం ఉంటుంది. నగరం వేదికగా ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలో తమదైన ముద్ర వేద్దామని ప్రయత్నిస్తున్న డిజైనర్లతో పాటు ఎందరో ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ అంతిమ లక్ష్యం సినిమా రంగమే అయి ఉంటుంది. మరోవైపు ఔత్సాహిక డిజైనింగ్ నిపుణులకు ఊపునిచ్చేది, వారి వర్క్‌ను ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేవీ ర్యాంప్ షోలే. అలాంటి షోలకు టాలీవుడ్ ప్రముఖుల హాజరు ఒక తప్పనిసరి అవసరం అనడం నిస్సందేహం. ట్రెండీ.. బ్యూటీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ షో స్టార్స్‌తో కళకళలాడింది. ఇందులో మంచులక్ష్మి, రకుల్‌ప్రీత్ సింగ్, విజయ్ దేవరకొండ, హర్షవర్ధన్ రానే, ప్రగ్యా జైస్వాల్, రెజీనా కసాండ్రా, కృతి కర్బందా, సీరత్ కపూర్, అల్లు శిరీష్, సుర్భి పురాణిక్, హెబ్బా పటేల్, నిఖిల్ సిద్ధార్థ్, సంయుక్త హర్నాడ్, ఈషా రెబ్బా, శుభ్ర అయ్యప్ప, అనీషా ఆంబ్రోస్, మధుశాలిని, తేజస్వి మడివాడ, శివానీ రాజశేఖర్, నవదీప్, అడవి శేషు, సుశాంత్ అక్కినేని, నవీన్ చంద్ర, అదిత్, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రిన్స్, ప్రియదర్శి, సిద్ధు జొన్నల గడ్డ, సంధ్యారాజు తదితర తారలు పాల్గొన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో 101 డైనింగ్ ఏరియాలో ఈ షో నిర్వహించడం మరో విశేషం. కేవలం తమ సంస్థకే ఈ ప్లేస్‌ని ప్రత్యేకంగా ఇస్తారని సంస్థ ప్రతినిధి చైతన్య చెప్పారు. ఎలాంటి ప్రత్యేకమైన ర్యాంప్ నిర్మించకుండా, కార్పెట్ మీదనే అతిథుల సమక్షంలో స్టార్స్ ఈ ఈవెంట్లో వాక్ చేశారు. ఎంపీ జయాబచ్చన్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, బాలీవుడ్ తార అదితిరావ్ హైదరిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యువోత్సాహం... టాలీవుడ్లో సరికొత్త తరం, యువ రక్తం పరవళ్లు తొక్కుతున్న ఫలితం ఫ్యాషన్ రంగంలో కూడా కనిపిస్తోంది. చిరంజీవి తరం తారలతో పోలిస్తే... ప్రస్తుత జనరేషన్ డిజైనర్లకు బాగా ప్రాధాన్యతనిస్తోంది. దీంతో ర్యాంప్‌పై తారల సందడి బాగా పెరిగింది. నగరంలో జరుగుతున్న ఈవెంట్లలో షో స్టాపర్స్‌గా కనిపించేందుకు వీరు బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. నవదీప్, మంచులక్ష్మి, సమంత, రానా తదితరులు తరచూ ఫ్యాషన్ ఈవెంట్లలో మెరుస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుంటున్న నాని, రకుల్‌ప్రీత్ సింగ్, రెజీనా, సాయిధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ లాంటి రైజింగ్ స్టార్స్ సైతం డిజైనర్స్‌తో చేతులు కలపడంతో ఈవెంట్లకు నిండుదనం చేకూరుతోంది. ముఖ్యంగా ఎన్జీఓ అనుబంధ కార్యక్రమాలపై వీరు ఆసక్తి చూపుతున్నారు. పరిస్థితి మారింది... ఒకప్పుడు.. అంటే పదేళ్ల క్రితం ఒక సెలబ్రిటీని ఈవెంట్లకు ఒప్పించాలంటే సులభమైన విషయం కాదు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. తారలు స్వచ్ఛందంగా పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. మా ఎన్జీఓ ఇప్పటికే సేవా పరంగా మంచి అభివృద్ధి సాధించిన క్రమంలో... ఇలాంటి షోలలో పాల్గొనడానికి మాత్రమే కాదు మరిన్ని కార్యక్రమాలకూ స్టార్స్ మాకు సహకారం అందిస్తున్నారు.– చైతన్య, టీచ్ ఫర్ ఛేంజ్ -
ఫలక్‌నుమా బాంబు..ఎల్లయ్య మానసిక రోగి
హైదరాబాద్: ఫలక్‌నుమా ప్యాలెస్ లో బాంబు ఉందంటూ 108కి డయల్ చేసిన వ్యక్తి ఆచూకీని దక్షిణ మండలం పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి మానసిక రుగ్మతతో బాధ పడుతూ ఈ కాల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారా యణ బుధవారం తన కార్యాల యంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళవారం జీఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 8.45కు, అమెరికా అ«ధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ 8.54కు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రవేశించారు. సరిగ్గా రాత్రి 8.43కు ఓ గుర్తు తెలియని వ్యక్తి 108ృఈఎంఆర్ఐ అంబులెన్స్‌కు కాల్ చేసి ప్యాలెస్‌లో బాంబు పెట్టారంటూ భయపడుతూ... వణుకుతున్న స్వరంతో సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఈ వివరాలను 100 డయల్‌తో పాటు పోలీస్ సెక్యూరిటీ విభాగాలకు సమాచారం అందించారు. పోలీసులు ఎలాంటి ఆందోళనలు చెందకుండా ప్యాలెస్‌లో గట్టి బందోబస్తు కొనసాగిస్తూ కాల్ చేసిన వ్యక్తిపై ఆరా తీసేందుకు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో సదరు వ్యక్తి మల్కాజ్‌గిరికి చెందిన బొంత ఎల్లయ్య(60)గా గుర్తించారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఈయనను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించారు. కోర్టు ఆదేశానుసారం చికిత్స అనంతరం ఈ నెల 24న ఇంటికి తీసుకొచ్చారు. అతడు బయటికి వచ్చిన వెంటనే ఎక్కడ చూసినా జీఈ సదస్సు విషయమే మారుమోగుతుండటంతో బాంబు ఉందంటూ ఫోన్ చేసి బెదిరించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 27న ఫోన్ కొనుగోలు చేశాడు. మంగళవారం రాత్రి 108కి ఫోన్ చేసి బాంబు అంటూ కాల్ చేశాడు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు సమాచారం సేకరించారు. సైబరాబాద్ పరిధిలో తన కొడుకుతో ఆటోలో వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మానసిక స్థితి బాగోలేని ఎల్లయ్యను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలిస్తామని డీసీపీ వెల్లడించారు. -
బాంబు బెదిరింపు కాల్, టీ.సర్కార్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : జీఈఎస్ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు పసందైన విందుకు ఆతిథ్యం ఇచ్చిన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్ నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు నిన్న రాత్రి (మంగళవారం) 9.45 గంటలకు డీజీపీ క్యాంప్ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఫలక్ నుమా పరిసరాల్లో బాంబు పెట్టామని, ఏ నిమిషంలో అయినా పేలుతుందంటూ ఆగంతకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, నిన్న రాత్రంతా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం దాన్ని బెదిరింపు కాల్‌గా పోలీసులు గుర్తించారు. కాగా ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా దుండగుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతగాడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం ఫలక్ నుమా ప్యాలెస్‌లో బాంబు పెట్టినట్లు వచ్చిన బెదిరింపు కాల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బెదిరింపు ఫోన్ కాల్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఘటనకు పాల్పడినవారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ ఫోన్ కాల్ పాతబస్తీ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాంకా ట్రంప్ పర్యటన ముగియగానే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. -
ఫలక్‌నుమ ప్యాలెస్‌లో ఆత్మీయ విందు
-
వాహ్.. ఫలక్‌నుమా ప్యాలెస్
-
కళ్ళు చెదిరే...మనసు మురిసే..!
అగ్రదేశం అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంఫ్కు ఆతిథ్యమిచ్చేందుకు చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్ ముస్తాబైంది. దీంతో ఈ భవనంపై ప్రపంచ ప్రజల దృష్టి పడింది. ప్యాలెస్‌లో అంత ప్రత్యేకత ఏంముందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ అద్భుత భవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి, చాంద్రాయణగుట్ట/చార్మినార్ నిజాం నవాబుల కాలంలో నిర్మించిన కట్టడాల్లో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. చార్మినార్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాల విస్తీర్ణంలో అద్భుత వాస్తు నైపుణ్యంతో ఉంటుందీ ప్యాలెస్. ఫలక్‌నుమా అంటే ఉర్దూలో ‘ఆకాశ దర్పణం’ అని అర్థం. ప్రాణం పోసిన ‘పైగా’లు.. ఆరో నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్¯ హయాంలో ఇతడి బావ.. సంస్థానం ప్రధాని అయిన పైగా వంశస్తుడు సర్ వికారుల్ ఉమ్రా (1893–1901) ఫలక్‌నుమాకు నిర్మాణానికి 1884 మార్చి 3న శంకుస్థాపన చేశారు. భవనం సగ నిర్మాణం పూర్తికాగానే వికారుల్ కుటుంబం 1889 డిసెంబర్లో ఇందులోకి మారింది. అప్పటికి ప్రస్తుత ప్రధాన భవనం నిర్మాణం కానందున కుటుంబమంతా ‘గోల్ మహల్’లో ఉండి ప్రధాన ప్యాలెస్‌ను నిర్మించారు. మొత్తం భవనం 1893 నాటికి పూర్తయ్యాయి. ప్యాలెస్ ఇండో అరేబియన్, పర్శియన్, ఇటాలియన్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. ఇందులో వాడిన పాలరాయిని ఇటాలీ నుంచి, చెక్కను ఇంగ్లాండ్ నుంచి తెచ్చారు. గోడలు, పైకప్పుపై ఫ్రెంచ్ కళాకారులతో అందమైన చిత్రాలు గీయించారు. తాజ్ ఫలక్‌నుమాగా.. ఏడో నిజాం అనంతరం ప్యాలెస్ ఇతడి మనవడు బర్కత్ అలీఖాన్ ముకరంజా ఆధీనంలోకి వచ్చింది. 1948 నుంచి ఈ ప్యాలెస్‌లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. అయితే ఈ భవనాన్ని 2000 సంవత్సరంలో ముకరంజా మొదటి భార్య అస్రా తాజ్ గ్రూప్‌నకు 30 ఏళ్ల పాటు అద్దెకిచ్చింది. తర్వాత హోటల్‌కు అనువుగా కొన్ని మార్పులు చేసి 2010 నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఈ హోటల్లో ప్రధాన సూట్స్‌తో పాటు 60 గదులను వినియోగంలో ఉన్నాయి. స్పెషల్ బాత్, స్పా, హెల్త్ క్లబ్, స్విమ్మింగ్ పూల్, స్మోకింగ్ ఏరియా, ఇటాలియన్ రెస్టారెంట్‌తో పాటు హైదరాబాద్ స్పెషల్ (ఆదా) రెస్టారెంట్ ఉన్నాయి. నిజాం ఉపయోగించిన టేబుళ్లు, కూర్చీలు అతిథులకు అందుబాటులోకి తెచ్చారు. అతిపెద్ద డైనింగ్ హాల్.. ఆరో నిజాం సంస్థానానికి 1898లో వచ్చిన ఐదో కింగ్‌జార్జి ఆడ్వర్డ్ పరివారానికి విందు ఇచ్చేందుకు ప్యాలెస్‌లో 101 అతిపెద్ద డైనింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు. పూర్తి ఇటాలియన్ ఫర్నిచర్‌తో 33 మీటర్ల పొడవుండే ఈ డైనింగ్ హాల్ దక్షిణ భారతదేశంలోనే మొట్ట మొదటిది. నిజాం ఈ డైనింగ్ హాల్లోనే తన బంధువులు, కుటుంబ సభ్యులు, బ్రిటీష్ ప్రధాన అధికారులు విందు చేసేవారు. ప్రస్తుతం ఈ టేబుల్‌పై విందు చేయాలంటే ఒక్కొక్కరికీ రూ.15 వేలు చిల్లించాల్సిందే. ప్యాలెస్ ప్రధాన ముఖద్వారం.. అతిపెద్ద డైనింగ్ హాల్.. స్పెషల్ గేమ్స్ రూమ్.. నిజాం లండన్ నుంచి తెప్పించిన స్నూకర్‌తో పాటు ఇటలీ నుంచి తెప్పించిన చెస్ గేమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. బంగారు, వెండి తీగలతో రూపొందించిన హుక్కాను సైతం అతిథులకు అందిస్తున్నారు. ఏనుగు దంతం, పాలరాతితో చెక్కిన చెస్ కాయిన్స్ ఉన్నాయి. ఆరో నిజాం చేతికి ఇలా వచ్చింది.. సంస్థాన ప్రధాని అయినప్పటికీ వికారుల్ ప్యాలెస్ నిర్మాణం తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్టు చరిత్రకారుల కథనం. తన బావమరిది, ఆరో నిజాంను విందుకు ఆహ్వానించి తన అప్పుల విషయం ప్రస్తావించాడని, దీనికి నిజాం రూ.60 వేలు చెల్లించి భవనాన్ని తనకు రాయించుకున్నట్టు చెబుతారు. ఇలా 1897లో ప్యాలెస్ ఆరో నిజాం సొంతమైంది. తర్వాత కొన్ని మార్పులు చేసిన ‘రాయల్ గెస్ట్‌హౌస్’గా వినియోగించేవారు. ఇతడి పాలనలో దేశ విదేశాల అతిథులు, వివిధ రాజ్యాల పాలకులు సంస్థానానికి వచ్చినప్పుడు ఈ ప్యాలెస్‌లోనే విడిది చేసేశారు. అలా ఐదో కింగ్ జార్జ్, ఎనిమిదో కింగ్ ఎడ్వర్డ్, వైస్రాయ్ లార్డ్బెల్, స్వాతంత్య్రానంతరం హైదారాబాద్ తొలి గవర్నర్ సి.రాజగొపాలాచారి, భారత మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఇందులో విడిది చేశారు. ఏడో నిజాం పాలనలో భవనానికి యూరోపియన్ స్టైల్లో కొన్ని మార్పులు చేశారు. ఆదా రెస్టారెంట్.. ప్యాలెస్‌లో ఆదా రెస్టారెంట్‌కు తాజ్ గ్రూపు ప్రత్యేక స్థానమిచ్చింది. ఇందులో హైదరాబాద్ రుచులతో పాటు ఆంధ్రా భోజనాన్ని అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌తో పాటు పక్కనే చెలాస్రే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ‘‘1883లోనే ఈ భవనంలో విద్యుత్, టెలిఫోన్ వినియోగించారు. భారతదేశంలోనే అతి పెద్ద స్విచ్ బోర్డు ఇక్కడ చూడవచ్చు. ఈ భవనానికి విద్యుత్తు అందించేందుకు ఆరోజుల్లో బొగ్గు యంత్రాలను ఉపయోగించేవారు. యంత్రాలున్న ప్రాంతాన్ని ‘ఇంజన్ బౌలి’ అనేవారు. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని ఇదే పేరుతో పిలుస్తున్నారు’’ నిజాం సూట్.. ప్యాలెస్‌లో అన్నింటి కంటే ఖరీదైనది ‘నిజాం సూట్’. దీని అద్దె రోజుకు రూ.5 లక్షలు. ప్యాలెస్‌లో 204 నంబర్‌గా కేటాయించారు. ఈ సూట్లో నిజాం ఉపయోగించిన వస్తువులు ఉంటాయి. ఈ సూట్ నుంచి జంట నగరాల అందాలను తిలకించవచ్చు. ఇంకా అక్బర్ సూట్, షాజాది సూట్ వంటి దాదాపు 60 సూట్రూలున్నాయి. వీటి అద్దె రూ.20 వేల నుంచి ప్రారంభమవుతుంది. ‘‘ప్యాలెస్‌లోని బిలియర్డ్స్ టేబుల్ చాలా అరుదైనది. ఇలాంటిది ప్రపంచంలో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లండ్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్‌లోను, మరొకటి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మాత్రమే ఉంది’’ పైగాలు నిజాం సంస్థానంలో అత్యంత ధనవంతులు. వారు సైన్యాధిపతులుగా ఉండేవారు. వికారుల్ ఉమ్రా మాత్రం ప్రధానిగా నియమితుడయ్యాడు. ఇతడు ఉండేందుకు రాజమహళ్లను మించిన అద్భుత భనవం కట్టాలని ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మించాడు -
ఫలక్ నుమాలో భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విందును పురస్కరించుకొని ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులు, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు, క్యూఆర్టీ, అమెరికా, కేంద్ర, రాష్ట్ర, నగర నిఘా సంస్థలు ప్యాలెస్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్యాలెస్‌కు వెళ్లే రూట్లోని బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌బౌలి రహదారులను జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సీఎస్ ఎస్పి.సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్‌రావు, కలెక్టర్ యోగితా రాణాలు ప్యాలెస్‌లో ఏర్పాట్లతో పాటు బందోబస్తును పర్యవేక్షించారు. రైల్వే పోలీసులు కూడా ఫలక్‌నుమా రైల్వే స్టేషన్లో, దక్షిణ మండలం పోలీసులు ప్యాలెస్ పరిసరాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 45 బస్సులలో అతిథులు విచ్చేయనున్న నేపథ్యంలో ట్రాఫిక్, పార్కింగ్ అంశాలపై ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేశారు. మొత్తం 2000 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగించనున్నట్లు పోలీసులు తెలిపారు. 520 సీసీ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో పాటు సోమవారం సాయంత్రం కాన్వాయ్ రిహర్సల్స్ చేయనున్నారు. ప్యాలెస్‌కు అతిథులు విచ్చేసే సమయంలో ప్రధాన రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ రానున్న నేపధ్యంలో నిఘా పెంచామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలను ఆపరేట్ చేస్తామని తెలిపారు. డెలిగేట్స్ బస చేసే 21 హోటల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. ఎల్లుండి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని... నగరంలో 10 వేల 4 వందల మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నామన్నారు . -
ఫలక్ నుమాలో భారీ బందోబస్తు
-
ఐఎస్‌డబ్ల్యూ, యూఎస్ సీక్రెట్ సర్వీస్ తో భద్రత
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలోని ఫలక్ నుమాలో ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రజల సహకారంతోనే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. కాగా నగరంలో ఈనెల 28నుంచి అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు జరగనున్న నేపథ్యంలో ఫలక్‌నుమా పరిసర ప్రాంతాల్లో పోలీసులు శుక్రవారం ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ప్రాంతాలపై పోలీస్ నిఘా పెంచారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...పాతబస్తీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో పలువురి అనుమానితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే అంతర్జాతీయ సదస్సు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ఇక ఇవాంకా ట్రంప్ చార్మినార్ సందర్శనపై ఇప్పటివరకూ తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపారు. సీపీ మాట్లాడుతూ...‘28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మియాపూర్‌లో మెట్రో రైలు ప్రారంభోత్సవానికి హాజరు అవుతున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రధాని, ఇవాంకా ట్రంప్‌తో పాటు 100మంది ప్రత్యేక అతిథులు హాజరు అవుతున్నారు. అలాగే వారికి ఫలక్ నుమా ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు గంటలపాటు ప్రధాని ప్యాలెస్‌లో ఉండే అవకాశం ఉంది. ఐఎస్‌డబ్ల్యూ (రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్), యుఎస్ సీక్రెట్ సర్వీస్ వారితో ...ఇంటర్నల్ మీటింగ్‌కు భద్రత పెంచాం. రెండువేలమందితో బందోబస్తు ఏర్పాటు చేశాం, హోంగార్డు నుంచి కమిషనర్ స్థాయి అధికారులు వరకూ అంతా ఆన్‌డ్యూటీలో ఉంటారు.’ అని తెలిపారు. -
ఐఎస్‌డబ్ల్యూ, యూఎస్ సీక్రెట్ సర్వీస్ తో భద్రత
-
షైనింగ్ సిటీ
దేశ, విదేశీ ప్రతినిధుల రాకకోసం నగరం ముస్తాబైంది. సిటీలోని రహదారులు సరికొత్త మెరుపులు సంతరించుకున్నాయి. రోడ్ల పక్కనున్న గోడలు, వంతెనలు అందమైన చిత్రాలతో నిండిపోయాయి. మరో నాలుగు రోజుల్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాంకా ట్రంఫ్ కోసం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సర్వాంగ సుందరంగా మార్చేశారు. హైటెక్స్ పరిసరాలను సరికొత్త విద్యుత్ కాంతులతో నింపేశారు. ఈ మార్గంలోని ప్రతి మొక్కా, చెట్టూ వెలుగులు విరజిమ్ముతున్నాయి. సదస్సుకు వచ్చే అతిథులను ఆకర్షించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూ.56 లక్షల ఖర్చుతో ఈ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. హైటెక్స్‌కు ప్రధాన మార్గమైన మినీ చార్మినార్‌కు శక్తివంతమైన పవర్ క్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. ఘడియకో డిజైన్ మారుతూ చూపరులను ఆకట్టుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: వచ్చేవారంతా దేశ, విదేశీ ప్రతినిధులు. వివిధ దేశాల్లోని విద్యుత్ వెలుగులు చూసిన వారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు రాత్రులను రంగుల హోలీగా మార్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. వీధిదీపాల స్థానంలోని ఎల్ఈడీలతో రేయి పగలుగా మార్చేస్తున్నారు. సదస్సు ప్రతినిధుల మనసులు దోచుకునేందుకు రోజురోజుకూ మారుతున్న ఆలోచనలతో మరింతగా రిహార్సల్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు(జీఈఎస్) జరుగనున్న హైటెక్స్ పరిసరాల్లో సరికొత్త విద్యుత్ కాంతులు రానున్నాయి. దారి పొడవునా ఎల్ఈడీ దీపాలే కాక మరింత ప్రత్యేకంగా సీతాకోక చిలుక ఆకారంలో కనబడేలా వెలుగులిచ్చే బల్బులను ఏర్పాటు చేస్తున్నారు. చెట్టు పుట్ట, ట్రాఫిక్ ఐలాండ్లు, ఫ్లై ఓవర్లతో సహా రహదారులు మొత్తం విద్యుత్ కాంతులతో కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు వివిధ రకాల రంగుల బల్బులకు సిద్ధమైన అధికారులు.. అవేవీ నచ్చక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల ‘పవర్ క్యాన్ల’ ద్వారా నిమిష నిమిషానికీ రంగులు మారి వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో చెట్టుకు రెండు నుంచి నాలుగు పవర్ క్యాన్లను ఏర్పాటు చేస్తారు. ఈ క్యాన్ల నుంచి ఎరుపు, పుసుపు, గులాబీ, ఆకుపచ్చ, ఆరెంజ్, నీలం తదితర రంగుల కాంతులు ప్రసరిస్తాయి. దాంతో పరిసరాలు మొత్తం కాంతివంతమవనున్నాయి. ఈ ప్రత్యేక రంగులిచ్చేందుకు వినియోగిస్తున్న పవర్ క్యాన్ల అద్దె రోజుకు ఒక్కోదానికి రూ.10 వేలు వెచ్చిస్తున్నారు. ఇలా మొత్తం 500 పవర్ క్యాన్లను హైటెక్స్ పరిసరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక రంగుల కాంతుల కోసమే రూ. 56 లక్షలు ఖర్చు చేస్తున్నారు. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ నుంచి మినీ చార్మినార్ వరకు, గచ్చిబౌలి ఫ్లై ఓవర్ నుంచి కొత్తగూడ జంక్షన్ మీదుగా మినీ చార్మినార్ వరకు, మినీ చార్మినార్ నుంచి న్యాక్ భవనం వరకు 27 నుంచి 30వ తేదీ వరకు ఈ ప్రత్యేక రంగుల కాంతులే కనిపించనున్నాయి. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మినీ చార్మినార్‌కు మరింత శోభ హైటెక్స్‌కు ప్రధాన ఆకర్షణ అయిన మినీ చార్మినార్ వద్ద మరింత శక్తివంతమైన పవర్ క్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. చార్మినార్ ఒక్కో స్తంభానికి నాలుగు పవర్ క్యాన్లు ఉంచి ఘడియకో డిజైన్ మారుతూ చూపరులను ఆకట్టుకునేలా కాంతులు ప్రసరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దేశంలోని ముంబై, బెంగళూర్, కోల్కత్తా నగరాల్లో జరిగిన ప్రత్యేక సదస్సుల సందర్భంగా చేసిన ఏర్పాట్లకు ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ హంగులు అద్దుతున్నారు. ఆ నగరాలతో పాటు తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేస్తున్న ఏజెన్నీ ఈ ఏర్పాట్లు చేస్తోందని సంబంధిత అధికారి తెలిపారు. పుష్పాలు వలయాకారంలో తిరుగుతున్నట్లు కనబడేందుకు డీఎన్‌ఎఫ్ లైట్లు వినియోగిçస్తున్నారు. మినీ చార్మినార్ కాంతులకు పూర్తిగా జనరేటర్‌ను వినియోగించనున్నారు. అద్భుతమైన కాంతులతో చేసే ఏర్పాట్లకు ఎలాంటి విద్యుత్ అవాంతరాలు లేకుండా ఉండేందుకు పూర్తిగా జనరేటర్లనే వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. లండన్ వంటి నగరాల్లో అంతర్జాతీయ సదస్సులు జరిగితే ప్రతి ఇంట్లోనూ జెండాలు ఎగురవేస్తూ స్వాగతాలు పలుకుతారని, అలాంటిది మన నగరంలో జరిగే సదస్సు ప్రత్యేకత కనబడేలా, విద్యుత్ కాంతులతో అందరి దృష్టిని ఆకట్టుకునేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందన దాసరి తెలిపారు. హైదరాబాద్‌లో గతంలో జరిగిన సీఓపీ–11, మెట్రోపొలిస్ వంటి జాతీయ, అంతర్జాతీయ సదస్సుల సందర్భంగా వివిధ ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రత్యేక విద్యుత్ కాంతులకు ఇంతపెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేయలేదు. దాదాపు 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నందున అందరికీ హైదరాబాద్ పర్యటనను ఒక రంగుల కలగా మార్చేందుకు ఈ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. హెచ్ఐసీసీ పరిసరాలతో పాటు ఇవాంకా ట్రంప్ బసచేసే వెస్టిన్ హోటల్ పరిసరాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులకు విందు ఇస్తున్న ఫలక్‌నుమా ప్యాలెస్, రాష్ట్ర ప్రభుత్వ విందు వేదిక అయిన గోల్కొండ కోట మార్గాల్లోనూ ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘వాక్ ఫర్ కాజ్’
-
అబ్బురపరిచిన వింటేజ్ కార్లు..బైకులు
-
పుట్టిన రోజున ఫ్యామిలీతో మహేష్..!
ప్రిన్స్ మహేష్ బాబు తన ఖాలీ సమయాన్ని కుటుంబంతోనే గడుపుతుంటాడు. ప్రతీ సినిమా తరువాత ప్రత్యేకించి గ్యాప్ తీసుకొని మరీ కుటుంబంతో ఇతర దేశాలకు వెళ్లి రావటం సూపర్ స్టార్‌కు అలవాటు. అంతేకాదు ప్రతీ సెలబ్రేషన్‌ను ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకునే అలవాటున్న ప్రిన్స్.. తనపుట్టిన రోజును కూడా ఫ్యామిలీతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్, బర్త్ డే రోజున బ్రేక్ తీసుకొని మరి.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి తాజ్ ఫలక్ నామా ప్యాలస్‌కు వెళ్లిన మహేష్, అక్కడి అందాలను, టేస్టీ ఫుడ్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు. ఆ రోజును సినీ ప్రపంచానికి దూరంగా ప్రత్యేకంగా తన కుటుంబం కోసం కేటాయించాడు మహేష్. -
6 గంటలకు పెళ్లి.. 7 గంటలకు బారాత్
ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా తన ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లి చేయిస్తున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్. హైదరాబాద్‌లోని చరిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఫర్మానా, 6 గంటలకు పెళ్లి ముహూర్తం, 7 గంటలకు బారాత్ ఉంటాయని సల్మాన్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. వినోద కార్యక్రమంలో సల్మాన్‌ఖాన్‌తో పాటు మలైకా అరోరా ఖాన్, అమృతా అరోరా తదితరులు నృత్యాలు చేస్తారు. ఈ పెళ్లికి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్, అలనాటి నటీమణులు చాలామంది హాజరవుతున్నారు. -
సల్మాన్ ఖాన్ సోదరి పెళ్లి
-
సలాం సల్మాన్
-
సల్మాన్ సోదరి పెళ్లి వేడుకకు సర్వం సిద్ధం
ఫలక్‌నుమాకు పెళ్లికళ నేడు మధ్యాహ్నం ముహూర్తం, రేపు విందు అమితాబ్, షారుఖ్, ఆమిర్, రజనీ, కమల్ వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సోదరి అర్పిత ఖాన్ వివాహ వేడుక కోసం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం సాయంత్రం సల్మాన్‌ఖాన్‌తో పాటు పెళ్లికొడుకు ఆయుష్ శర్మ కుటుంబసభ్యులంతా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వివాహ వేడుక నిర్వహించనున్నారు. బుధవారం అతిథులందరికీ విందుభోజనం ఉంటుంది. వధూవరులిద్దరూ ముంబైకి చెందిన వారైనప్పటికీ చారిత్రక ఫలక్‌నుమాలో పెళ్లి వేడుక కోసం ఆర్నెల్ల క్రితమే ప్యాలెస్‌లోని అన్ని గదులను రిజర్వు చేసుకున్నారు. ఈ వేడుక కోసం బాలీవుడ్ మొత్తం హైదరాబాద్‌కు చేరుకుంటోంది. ఇప్పటికే కొందరు నగరానికి చేరుకోగా.. మంగళవారం పెళ్లి వేడుకకు అమితాబచ్చన్, షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, రజనీకాంత్, కమలహాసన్ వంటి సూపర్ స్టార్లతో పాటు అగ్రశ్రేణి తారాగణమంతా హాజరవుతుందని సమాచారం. రాజకీయ ప్రముఖులు కూడా రానున్నారు. ఇక నగరంలో అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే ఫలక్‌నుమా ప్రాంతంలో సందడి నెలకొంది. విద్యుత్ దీపాలతో ప్యాలెస్ మెరిసిపోతోంది. దాని చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఇక్కడకు చేరుకుంటున్నారు. కాగా, పెళ్లి కూతురు అర్పితాఖాన్ సోమవారం ఉదయం నుంచిసాయంత్రం వరకు చుడీబజార్, చార్మినార్ పరిసరాల్లో ఎవరికంటా పడకుండా సాధారణ వ్యక్తిలా షాపింగ్ చేసినట్లు తెలిసింది. పెళ్లి విందు కోసం బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలను ప్యారడైజ్ హోటల్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. -
వెడ్డింగ్ ప్యాలెస్
-
వాహ్.. తాజ్ ఫలక్‌నుమా
షహర్‌కీ షాన్ ఫలక్‌నుమా ప్యాలెస్.. ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ స్పాట్. సల్మాన్ సోదరి అర్పితాఖాన్ వివాహం ఇక్కడ ఈనెల 18న జరగనున్న నేపథ్యంలో ప్యాలెస్ మరోసారి వార్తల్లోకెక్కింది. నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చరిత్రాత్మక కట్టడాలలో ఫలక్‌నుమా ప్యాలెస్ది ప్రత్యేక స్థానం. ఫలక్‌నుమా అంటే ఆకాశదర్పణం అని అర్థం. చార్మినార్ కట్టడానికి ఐదు కిలోమీటర్ల దూరంలో రెండు వేల అడుగుల ఎత్తయిన కొండపై దీన్ని నిర్మించారు. ఇటలీ వాస్తు నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్‌ను పై నుంచి చూస్తే తేలు ఆకారంలో కనిపిస్తుంది. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో ఆరో నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో హైదరాబాద్ ప్రధానమంత్రి, పైగా వంశస్తుడు సర్ వికార్ ఉల్ ఉమ్రా దీనిని నిర్మించారు. 1884 మార్చి 3న శంకుస్థాపన జరగగా 1893లో నిర్మాణం పూర్తయింది. అప్పట్లోనే దీని నిర్మాణానికి రూ.40 లక్షలు ఖర్చయ్యాయి. ఎంతో అందంగా తయారైన ఈ రాజ భవనాన్ని ఉమ్రా.. మీర్ మహబూబ్ అలీఖాన్‌కు 1895లో బహుమానంగా ఇచ్చారు. దీంతో 1898లో నిజాం నవాబు ఫలక్‌నుమా ప్యాలెస్‌ను తన గెస్ట్‌హౌస్‌గా మలచుకున్నారు. జీవిత చరమాంకాన్ని ఇదే ప్యాలెస్‌లో గడిపిన ఆయన, 1911లో ఇక్కడే తుదిశ్వాస విడిచారు. ప్యాలెస్‌కు స్వాగత తోరణంగా ఉన్న కమాన్‌ను ప్రస్తుతం ఫలక్‌నుమా ఆర్టీసీ బస్ డిపోకు ప్రవేశద్వారంగా మార్చారు. ప్రస్తుతం తాజ్ ఫలక్‌నుమా.. ఫలక్‌నుమా ప్యాలెస్.. నాలుగేళ్ల క్రితం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌గా మారింది. ఏడో నిజాం మనుమడు ప్రిన్స్ ముఖరం జా అధీనంలో ఉన్న ఈ ప్యాలెస్‌ను నాలుగేళ్ల కిందట తాజ్ గ్రూప్‌నకు లీజుకిచ్చారు. దీంతో శుభకార్యాలు, బోర్డు సమావేశాలు, విందులు, వినోదాలకు ఈ ప్యాలెస్ వేదికైంది. నగరంలోని అత్యంత ఖరీదైన హోటళ్లలో ఈ ప్యాలెస్ ఒకటి. నిజాం ఉపయోగించిన వస్తువులను, క్రీడాపరికరాలను, వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన వస్తువులను, పుస్తకాలను ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. ఈ హోటల్లో ప్రధాన సూట్లతో పాటు 60 రూమ్‌లను వినియోగంలోకి తీసుకొచ్చారు. అద్దె రూ.20 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంది. నిజాం కాలం నాటి రాచమర్యాదలను ఈ హోటల్లో అందుకోవచ్చు. స్పెషల్ బాత్, స్పా, జావా, హెల్త్‌క్లబ్, స్విమ్మింగ్‌పూల్, స్మోకింగ్ ఏరియా, ఇటాలియన్ రెస్టారెంట్, హైదరాబాద్ స్పెషల్ (అదా) రెస్టారెంట్లు ఉన్నాయి. నిజాం నవాబుతో పాటు బేగం ఉపయోగించిన పరికరాలనూ ప్రదర్శనకు ఉంచారు. నిజాం ఉపయోగించిన టేబుళ్లు, కుర్చీలను అతిథులూ వాడుకోవచ్చు. గేమ్స్ రూమ్ ప్యాలెస్‌లో ఇండోర్ గేమ్స్ రూమ్ ఓ అద్భుతం. నిజాం లండన్ నుంచి తెప్పించిన స్నూకర్, ఇటలీ నుంచి తెప్పించిన చెస్ బోర్డ్ ఇందులో ఏర్పాటు చేశారు. బంగారు, వెండి తీగలతో రూపొందించిన హుక్కా ఏర్పాటు చేసి అతిథులకు అందిస్తున్నారు. ఇందులో ఏనుగు దంతం, పాలరాతితో చెక్కిన చెస్ కాయిన్స్ ఉన్నాయి. అదా రెస్టారెంట్ ప్యాలెస్‌లో అదా రెస్టారెంట్‌కు తాజ్ గ్రూపు ప్రత్యేక స్థానం ఇచ్చింది. ఇందులో హైదరాబాద్ రుచులైన బిర్యానీ, పత్తర్‌కీ మటన్, ధమ్కీ చికెన్ తదితర వంటకాలతో పాటు ఆంధ్రాభోజనాన్నీ అందిస్తున్నారు. దీని పక్కనే చెలాస్రే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. స్మోకింగ్ ఏరియా ప్యాలెస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అందమైన గార్డెన్‌ను స్మోకింగ్ జోన్‌గా వ్యవహరిస్తున్నారు. సంధ్య వేళలో దమ్ములాగుతూ.. నగర అందాలను వీక్షించవచ్చు. నిజాం సూట్ ప్యాలెస్‌లో నిజాం సూట్ అన్ని సూట్లలో (నంబర్ 204)లలో ఖరీదైనది. దీని అద్దె రోజుకు రూ.5 లక్షలు. ఈ సూట్లో నిజాం ఉపయోగించిన వస్తువులతో పాటు వివిధ దేశాల నుంచి సేకరించిన వస్తువులను అలంకరించారు. సూట్ పక్కనే అక్బర్ సూట్, షాజాదీ సూట్ ఇతర సూట్లు ఉన్నాయి. వీటితో పాటు 60 సూట్లు ఉన్నాయి. ప్యాలెస్‌లో స్పా.. ప్యాలెస్‌లో పూర్తి ఇండియన్ స్టైల్లో నిర్వహించే స్పా, యోగా సెంటర్ ఉన్నాయి. రెండున్నర గంటల పాటు నిర్వహించే స్పా కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాలి. -కర్నాటి శ్రీనివాసగౌడ్ అతిపెద్ద డైనింగ్ హాల్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిజాం ఉపయోగించిన అతిపెద్ద డైనింగ్ హాల్‌ను అద్దెపై వినియోగించుకునే వీలు కల్పించారు. ఒకేసారి నూటొక్క (101) మంది అతిథులు ఈ హాల్లో విందారగించవచ్చు. పూర్తి ఇటాలియన్ ఫర్నిచర్, తొమ్మిది దేశాల నుంచి తీసుకొచ్చిన వస్తు సామగ్రి ప్రత్యేక ఆకర్షణ. 33 మీటర్ల పొడవైన ఈ డైనింగ్ హాల్లోనే నిజాం తన బంధువులు, విదేశీ అతిథులకు ఆతిథ్యమిచ్చేవారు. మార్బుల్ మెట్లు.. ప్యాలెస్‌లో కేవలం నాలుగు ఫిల్లర్లపై ఉన్న స్టేర్ కేస్ ప్యాలెస్ అందాన్ని ఇనుమడింప చేస్తోంది. ఇటలీ మార్బుల్‌తో ఏర్పాటు చేసిన ఈ స్టేర్ కేస్ పైనున్న దర్బార్ హాల్ టీ సెక్షన్‌కు వెళ్తుంది. మహల్లో లైబ్రరీ.. నిజాం వివిధ దేశాల నుంచి సేకరించిన 900 గ్రంథాలతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో పార్సీ, అరబిక్, ఉర్దూలలో లిఖించిన పుస్తకాలున్నాయి. ఇందులో 1911 నుండి 1951 వరకు ప్యాలెస్‌ను సందర్శించిన వారి వివరాలతో కూడిన విజిటర్ బుక్ సైతం ఉంది. -
క్లాసిక్ డ్రైవర్స్ వింటేజ్ టూర్...
ప్రయాణం.. జీవితకాలం ఆనందాన్ని, అనుభవాన్ని ఇస్తుందంటారు! ఆ మాటను ఆన్‌వీల్ ఆస్వాదిస్తున్న గ్రూప్ ‘క్లాసిక్ డ్రైవర్స్ గ్రూప్’! ముంబై కేరాఫ్‌గా సాగుతున్న ఈ ‘సీడీజీ’ పది రోజుల కిందట సౌత్ ఇండియా టూర్ స్టార్ట్ చేసి బెంగళూరు మీదుగా హైదరాబాద్ చేరుకుంది. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తమ వింటేజ్ అండ్ క్లాసిక్ కార్లకు కాస్తంత విరామం ఇచ్చింది. ఈ సందర్భంగా జర్నీ విశేషాలను సిటీప్లస్ మోసుకొచ్చింది.. ముంబై.. హానిమన్ సర్కిల్.. వింటేజ్ క్లార్లంటే షోకున్న వాళ్లు ప్రతి ఆదివారం కలుసుకునే చోటు! పద్దెనిమిదేళ్ల కుర్రాళ్ల నుంచి డెబ్బై ఏళ్ల సీనియర్ సిటిజన్స్ వరకు .. వాళ్లకు ఇష్టమైన వింటేజ్ అండ్ క్లాసిక్ కార్లను తీసుకుని వస్తారు. కాఫీ తాగేసి కాసేపు డ్రైవ్ చేసి వెళ్లిపోతారు. ఇలా కొన్నేళ్లు గడిచేసరికి ఒకరిద్దరే అనుకున్న వింటేజ్ లవర్స్ సంఖ్య కొన్ని పదుల సంఖ్యకు చేరుకుంది. తామంతా ఓ సమూహంగా ఏర్పడితే బాగుంటుంది కదా అనుకున్నారు. అంతే ‘క్లాసిక్ డ్రైవర్స్ గ్రూప్’గా ఒక వాహనంలోకి చేరారు. కానీ రొటీన్‌గా ఆ ముంబై మహా ట్రాఫిక్‌లో క్లాసిక్ కార్లేసుకుని చక్కర్లు కొట్టడం గొప్పగా అనిపించలేదు. ఏడాదికి పది రోజులైనా బహుదూరం ప్రయాణించాలనుకున్నారు. వింటేజ్ జర్నీ ఎంజాయ్ చేయాలనుకున్నారు. పన్నెండు కుటుంబాలు కలసి రాజస్థాన్ టూర్ వెళ్లారు. దారిలో వింటేజ్ లవర్స్‌ను కలిసి తమ జర్నీ గురించి వివరించారు. ఆసక్తి చూపిన వాళ్లను గ్రూప్‌లో చేర్చుకుని ముందుకు కదిలారు. ఆ ఉత్సాహంతోనే ఈ ఏడాది జర్నీ స్టార్ట్ చేసి హైదరాబాద్ చేరారు. కనిష్టం నాలుగు.. గరిష్టానికి లెక్కలేదు పన్నెండు ఫ్యామిలీలు ఈ టూర్‌కి వచ్చాయి. 1941 నాటి బ్యూక్ నుంచి 60ల్లోని షెవర్లే.. ఆడి.. ఫియట్, అంబాసిడర్ల వరకు పన్నెండు మోడల్స్ వాహనాలు వీళ్లను తిప్పుతున్నాయి. ఈ వింటేజ్ కార్ల ఓనర్లందరికీ ఈ షోకు వాళ్ల తాతల, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిందే. ఈ గ్రూప్‌లో ఉన్న అత్యంత పిన్న వయస్కుడు ముప్పయ్యేళ్ల అనిరుధ్ అనే బిజినెస్ మ్యాన్ తానే సొంతంగా నాలుగు వింటేజ్ కార్లను మెయింటెయిన్ చేస్తున్నాడు. అందరికన్నా పెద్దవాడైన ఫలీదోండీ (70), మీడియాలో పనిచేస్తున్న హెచ్ఎన్ కామా, పైలట్ అయిన సచిన్హోగ్లే, షిప్‌యార్డ్‌లో ఉద్యోగం చేస్తున్న దినేష్‌లాల్ అనే వింటేజ్ ప్రేమికులను ‘మీ దగ్గరున్న ఇలాంటి కార్ల కలెక్షన్ సంఖ్య ఎంత’ అని అడిగితే ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అంటారు నవ్వుతూ. తడవతడవకి ఒక కార్లో వెళ్లడమే వీళ్లకు హాబీ. వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని క్షేమంగా గమ్యం చేరుస్తున్న తమ వాహనాలను ముద్దు చేస్తారు ఆ యజమానులు. ఎప్పుడైనా కదలకుండా మొరాయిస్తే అని అడిగితే.. ‘కదిలించే టూల్ బాక్స్ వెంట ఉంద’ని చెప్తారు. ఎవరి కారుకు వాళ్లే రిపేర్ చేసుకుంటారు. వీరి ఆడవాళ్లకు కూడా డ్రైవింగ్ వచ్చు. భర్తల సహవాసంతో వాళ్లూ వింటేజ్ మజాను ఆస్వాదిస్తున్నారు. ఒకే కుటుంబంలా .. ‘వింటేజ్ హాబీ ఎక్కడెక్కడో ఉన్న మా అందరినీ ఒకే కుటుంబంలా కుదిర్చింది. టూర్లు లేకపోయినా నెలలో రెండు సార్లయినా కలుసుకుంటాం. పార్టీలు చేసుకుంటాం. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా అందరం వాలిపోతాం. ఇక ఈ టూర్లు మమ్మల్ని మరింత దగ్గర చేస్తున్నాయి. కొత్తవాళ్లనూ మా కుటుంబంలో చేరుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని వింటేజ్ లవర్స్నూ కలిశాం. వాళ్లూ మా గ్రూప్‌లో చేరుతారు’ అని ఆనందంగా చెప్తారు వీళ్లు. ముంబై చేరుకొని కాస్త సేదతీరాక వచ్చే ఏడాది టూర్ ప్లాన్‌లో పడిపోతారటఈ క్లాసిక్ డ్రైవర్స్. సాక్షి, సిటీప్లస్ వింటేజ్ కార్ టూర్ ఎంత ఉత్సాహంగా... ఉల్లాసంగా సాగుతుందో ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. దశాబ్దాల నాటి కార్లను వాటి యజమానులు ఎంత అపురూపంగా... మురిపెంగా చూసుకొంటున్నారో... వాటి ప్రత్యేకతను నేటి తరానికి తెలియజెప్పడానికి అంతే ఆసక్తి చూపుతున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తమ తమ కార్ల ముందు ఇలా ఫొటోలకు పోజులిచ్చి మురిసిపోయారు. -
చెల్లి పెళ్లి వేదికకు రూ.2 కోట్ల ఖర్చు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సోదరి పెళ్లి చాలా భారీగా చేయబోతున్నాడు. ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లి చేయడానికి.. కేవలం ఒక్క వేదిక కోసమే అక్షరాలా రెండు కోట్లు ఖర్చు పెడుతున్నాడట. అది కూడా కేవలం రెండు రోజులకు చెల్లిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అర్పితాఖాన్ వివాహం ఈనెల 18న జరగనున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుక కోసం అరవై గదులున్న ఈ ప్యాలెస్ మొత్తాన్ని రెండు కోట్లు చెల్లించి సల్మాన్ బుక్ చేశారట. ఇక డెకరేషన్‌కు మళ్లీ విడిగా చెల్లించాల్సిదేనట. ఖాన్ పరివారం అంతా నవంబర్ 18నే నగరానికి చేరుకుంటుంది. పెళ్లి వేడుక అనంతరం 20వ తేదీన ముంబై తిరిగి వెళతారు. కాగా షాదీ వేడుకకు సుమారు 250 మంది అతిథులను ఆహ్వానించినట్లు పెళ్లికుతూరు అర్పిత సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే సల్మాన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ టాలీవుడ్ హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు ఈ ఆహ్వానాన్ని అందుకున్నారు. వెంకటేష్ ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అయితే సురేష్ బాబు మాత్రం ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండటంతో ఆయన హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ఇక వరుడు ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆయుష్ శర్మ. వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. ఇంకేముంది పెళ్లి ధూంధామ్‌గా చేయాలని నిర్ణయించారు. ఈ వివాహం ముస్లిం, హిందూ సంప్రదాయాల ప్రకారం జరగబోతున్నట్లు సమాచారం. నవంబర్ 18న సల్మాన్ తల్లిదండ్రులు సలీమ్ ఖాన్, సల్మా ఖాన్ల పెళ్లిరోజు. సరిగ్గా అదేరోజున అర్పిత పెళ్లి చేస్తున్నారు. -
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేసీఆర్ విందు
-
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేసీఆర్ విందు
హైదరాబాద్: 14వ ఆర్థిక సంఘం సభ్యులు గురువారం హైదరాబాద్ రానున్నారు. సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న ఆర్థిక సంఘం సభ్యులు సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం తరపున ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన ప్రతిపాదనలపై సచివాలయంలో కేసీఆర్ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం వ్యాట్ బకాయిలను చెల్లించాలని ఇంతకుముందు ఆర్థిక సంఘాన్న తెలంగాణ ప్రభుత్వం కోరింది. కాగా, రేపు రాజ్‌భవన్‌లో ఆర్థిక సంఘం సభ్యులకు గవర్నర్ నరసింహన్ విందు ఇవ్వనున్నారు. శుక్రవారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేసీఆర్ విందు ఏర్పాటు చేశారు. -
దక్షిణ తాజ్‌మహల్
let's చూసొద్దాం రండి see పాయిగాలు... అసఫ్‌జాహీల ప్రత్యేక సైనికదళం. సైనికులుగా ఎంత కఠినులో... అంత సృజనశీలురు పాయిగాలు. వారి కళానైపుణ్యం సమాధుల్లో సైతం ఉట్టిపడుతుంది. దక్షిణ తాజ్‌మహల్‌గా కీర్తికెక్కిన ఈ పాయిగా టూంబ్స్ చూడాలంటే ఓవైసీ సెంటర్‌కు వెళ్లాల్సిందే! సంతోష్‌నగర్ చౌరస్తా నుంచి డీఆర్డీఎల్ దారిలో ఒవైసీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న గల్లీలో ‘పాయిగా’ సమాధులు దర్శనిమిస్తాయి! నిజామ్లతో వచ్చి... పాయిగాలు నిజామ్లతోపాటు వచ్చి దక్కన్లో స్థిరపడ్డారు. నిజాం రాజులతో సమాన హోదా, దర్పం ప్రదర్శించారు. నిజాంకాలంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వీరే. రెండవ నిజాం రాజ ్యంలో సైనికాధ్యక్షుడైన అబ్దుల్ ఫతేఖాన్కి నిజాం ఆస్థానంలో ప్రధానమంత్రి పదవి ఇవ్వబోతే ‘ప్రభువుల రాజ్య రక్షణ బాధ్యత తప్పించి అధికార వ్యామోహం తమకు లేదని’ ఫతేఖాన్ సున్నితంగా తిరస్కరించాడట. అలా తమ ప్రత్యేక ప్రతిపత్తిని చాటుకుంటూ నిజాంల కాలంలో న్యాయ, రక్షణ, రెవెన్యూ శాఖలను సొంతంగా నిర్వహించారు పాయిగాలు. అనేక విద్యాసంస్థలనూ ఏర్పాటు చేశారు. కళలు, క్రీడలు, సాహిత్య, సాంస్కృతిక రంగాలను విశేషంగా ప్రోత్సహించారు. ఫలక్‌నుమా ప్యాలెస్... దేశ విదేశాల్లో పర్యటించిన పాయిగాలు అక్కడి కళారీతులను దక్కన్లో పొందుపరిచారు. నగరంలో ఇప్పుడు కనిపించే సర్ ఆస్మాన్ జా దేవిడీ, ఖుర్షుద్ జా ప్యాలెస్, వికార్-ఉల్-ఉమ్రా ప్యాలెస్, బషీర్‌బాగ్‌లో పలు భవనాలు అందుకు నిదర్శనాలు. ప్రఖ్యాతిగాంచిన ‘ఫలక్‌నుమా ప్యాలెస్’ను పాయిగా ప్రభువైన సర్ వికార్-ఉల్-ఉమ్రా నిర్మించాడు. యూరప్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడి ఆర్కిటెక్చర్‌ను పోలి ఉండేలా ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మాణం చేయించాడు. దీనికోసం ఆ రోజుల్లోనే సుమారు 450 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్యాలెస్ పూర్తయ్యేసరికి ఖజానా దాదాపు ఖాళీ అయ్యిందట. దక్షిణ తాజ్‌మహల్... పాయిగా సమాధులు ‘దక్షిణ తాజ్‌మహల్’గా కీర్తి గడించాయి. విశాలమైన ప్రాంగణంలో ఎనిమిది తరాలకు చెందిన పాయిగా ప్రభువుల సమాధులు 32దాకా ఉన్నాయి. నిర్మాణానికి తెల్లని పాలరాయిని ఎక్కువగా ఉపయోగించారు. ఫక్రుద్దీన్ ఖాన్సమాధి పై భాగాన ఆస్ట్రేలియాలో కనిపించే ఆస్ట్రిచ్ పక్షి గుడ్డు పెద్ద సైజులో కళాత్మకంగా వేలాడుతూ నేటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. అలాగే సర్ ఆస్మాన్ జా సమాధికి ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని ఉపయోగించారు. దీన్ని స్టోన్ ఆఫ్ సీజన్స్ అంటారు. ఈ పాలరాయి వర్షాకాలంలో ఆకుపచ్చగా, చలికాలంలో తెల్లగా, తీవ్రమైన ఎండాకాలంలో పసుపుపచ్చలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆయన పేరులో ఆకాశం ఉన్నందున సమాధి ఆకాశాన్ని చూస్తూ ఉండేలా పైకప్పు లేకుండా ఏర్పాటు చేశారు. స్త్రీ , పురుషుల సమాధులను గుర్తించేందుకు వీలుగా పురుషుల సమాధులపై 30 సెంటీమీటర్ల ఎత్తులో గోపుర నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. ఆకట్టుకుంటున్న కళారీతులు... బేగం ఖుర్షీద్ జా సమాధి కోసం సుమారు 110 సంవత్సరాల కిందటే 40వేల రూపాయలు ఖర్చు చేశారు. ఇది ‘షాజహాన్’ సమాధిని పోలి, అత్యంత విలువైన వజ్రపు రాళ్లతో పొదిగి ఉంటుంది. అయితే ఆ విలువైన వజ్రాలేవీ ఇప్పుడు కనబడవు. నాలుగు శతాబ్దాలు పైబడినా ఈ సమాధుల గోడలు బీటలు వారలేదు. ఇసుక, సున్నంలతో నిర్మించిన ఈ గట్టి గోడలపై చెక్కిన అనేక లతలు-పూలతీగలు, ఫల- పుష్ప కళారీతులు సందర్శకులను నేటికీ ఆకట్టుకుంటున్నాయి. ‘రాజస్థానీ-హిందూ’ శిల్పశైలి నిర్మాణంతో కళలకు మతం అడ్డు కాదని ఇవి రుజువు చేస్తున్నాయి. అలాంటి పాయిగా సమాధులు ఇప్పుడు కళావిహీనంగా మారుతున్నాయి. దుమ్ము, ధూళి, తుప్పలతో నిండిపోయాయి. వీటిపై కబ్జాదారుల కన్ను ఓవైపు... అసాంఘిక కార్యకలాపాలు మరోవైపు.. అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. ఇలాగే వదిలేస్తే ఇవి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వీటిపై దృష్టి సారించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి చరిత్రను కాపాడాల్సిన బాధ్యత ... పర్యాటక-పురావస్తు శాఖల మీద ఉంది. మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
సారూన్.. ఇదో లుంగీ కథ
- వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా.. అంతా ఎంతో హాయిగా.. - ఇదేదో ఏసీ యూనిట్ గురించి కబుర్లు కావు.. - ఇండోనేసియా లుంగీల కథా కమామీషు! చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్ దాటి కాస్త ముందుకెళ్లగానే పురుషుల వస్త్రధారణలో ప్రత్యేక తేడా కనిపిస్తుంది. ఇది మిగతా ప్రాంతాలకు చాలా భిన్నంగా ఉంటుంది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అందరూ లుంగీలు ధరించి కనిపిస్తారు. వస్త్రధారణలో లుంగీ మనకు కొత్తేమీ కాదు. కానీ అక్కడివారు ధరించే లుంగీ మాత్రం కచ్చితంగా భిన్నమైందే. ప్రత్యేకంగా ఇస్లామిక్ దేశం ఇండోనేసియాలో తయారైన ఉన్నతశ్రేణి లుంగీలు మాత్రమే ధరించటం వారి ప్రత్యేకత. యెమన్ నుంచి.. కుతుబ్‌షాహీలు తమ సంస్థానంలో పోలీసు వ్యవస్థ, జమా పద్దుల నిర్వహణకు అరబ్ దేశాల నుంచి నిపుణుల్ని రప్పించారు. అలా యెమన్ దేశీయులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఆ తర్వాత అసఫ్‌జాహీల హయాం వచ్చాక కూడా వీరికి ప్రాధాన్యం పెరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యెమన్ జాతీయులకు బార్కస్, సలాలా ప్రాంతాలను కేటాయించారు. నేటికి ఈ ప్రాంతాలు యెమన్ వంశస్తులతో నిండిపోయి కనిపిస్తాయి. వీరికి ప్రత్యేక వస్త్రంతో తయారు చేసిన లుంగీలు ధరించటం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్నే వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇండోనేసియా నుంచే దిగుమతి.. యెమన్లు ఇండోనేసియాలో తయారైన లుంగీలనే వినియోగిస్తారు. వాటిని వారు ‘సారూన్’ అని, ‘తైబన్’ అని పిలుచుకుంటారు. ఈ లుంగీ నాణ్యత ఉన్నత శ్రేణిలో ఉంటుంది. వస్త్రం చాలా మృదువుగా ఉండి వేసవి కాలంలో చల్లని, శీతాకాలంలో వెచ్చని అనుభూతి నిస్తుంది. ఇండోనేసియాలో ప్రత్యేక శ్రద్ధతో వీటిని తయారు చేస్తారు. యెమన్ ప్రాంతానికి ఈ లుంగీలే ఎగుమతి అవుతాయి. బార్కస్‌లో స్థిరపడ్డ వీరి పూర్వీకులు యెమన్ దేశీయులు అయినందున వీరు కూడా ఆ పద్ధతినే అనుసరిస్తున్నారు. పన్నెండేళ్ల పిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరూ ఈ లుంగీలను ధరించే తిరుగుతుంటారు. బార్కస్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ ఇండోనేసియా లుంగీలమ్మే దుకాణాలు వెలిశాయి. ఇక సిటీలో ఎక్కడా ఈ లుంగీలు దొరకవు. ఈ లుంగీల ధర కూడా ఎక్కువే. సాధారణ లుంగీ రూ.750 ధర పలుకుతోంది. మరింత మంచివైతే రూ.2,000-3,000 వరకు ఉంటోంది. ఒక్కో లుంగీ కనీసం నాలుగేళ్లవరకు పాడవకుండా ఉంటుందని స్థానికులంటున్నారు. ..::గౌరీభట్ల నరసింహమూర్తి