KGF Chapter 2: ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో రాఖీ భాయ్‌ | Yash shoots at a royal location that said to be as an extension of Rocky palace | Sakshi
Sakshi News home page

KGF Chapter 2: ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో రాఖీ భాయ్‌

Published Thu, May 6 2021 12:45 AM | Last Updated on Thu, May 6 2021 10:45 AM

Yash shoots at a royal location that said to be as an extension of Rocky palace - Sakshi

రాఖీ భాయ్‌ గుర్తున్నాడు కదా! అదేనండీ.. ‘కేజీఎఫ్‌’ రాఖీ భాయ్‌ గురించే చెబుతున్నాం. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా వచ్చిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌1’కు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో రాఖీ భాయ్‌కు ఓ పెద్ద ప్యాలెస్‌తో పాటు ఓ రహస్య భవంతి కూడా ఉంటుందట. ఇందుకు కావాల్సిన సన్నివేశాలను హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో చిత్రీకరించారని తెలిసింది.

ఈ లొకేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరణ జరిగిందట. నిజానికి ప్యాలెస్‌ సెట్‌ను బెంగళూరులో వేశారట. ఇక్కడ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తీసిన సన్నివేశాలను ఆ సెట్‌తో మ్యాచ్‌ చేస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement