కేజీయఫ్-1 తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని కేజీయఫ్ 2తో తిరిగొచ్చాడు యశ్. ఫస్ట్ పార్ట్ రూ.250 కోట్లు వసూలు చేస్తే.. సెకండ్ పార్ట్ ఉవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.1200 కోట్లు దాటింది. దీంతో రాకీభాయ్ మళ్లీ కేజీయఫ్3తోనే తిరిగొస్తాడని శాండల్‌వుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కానీ ప్రశాంత్ నీల్ ఏమో సలార్, ఎన్టీఆర్ చిత్రాలకు డేట్స్ లాక్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు రాకీభాయ్ ఏం చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్‌గా మారింది.
(చదవండి: : ప్రశాంత్ నీల్-తారక్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది)
యశ్ తర్వాతి చిత్రం ఏంటనేదానిపై ఇప్పటి వరకు ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కేజీయఫ్ 2 ప్రమోషన్‌లో అడిగితే కూడా సైలెంట్‌గానే ఉన్నాడు. అయితే కన్నడ సినిమా మాత్రమే చేస్తానని ఓ చోట లీక్ ఇచ్చాడు. ఆ కన్నడ సినిమా కేజీయఫ్-3నే అని టాక్ కూడా ఉంది.
అదే నిజమైతే రాకీభాయ్‌ని మళ్లీ తెరపై చూడాలంటే మరో మూడేళ్లు వెయిట్ చూడాల్సిందే. ఎందుకంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రభాస్ సలార్ విడుదల అవుతుంది. ఆ తర్వాత ఏడాదికి ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రెండు చిత్రాల తర్వాతే ప్రశాంత్ నీల్ కేజీయఫ్-3ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. అంటే 2025లో రాకీభాయ్ రీఎంట్రీ ఉంటుందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment