
KGF 2 Movie Mehabooba Mehabooba Full Song Released: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల తుఫాన్‌తో రాఖీ భాయ్ ఊచకోత కోస్తున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా పేరొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్‌లో కూడాల చేరిపోయింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలోని సాంగ్స్ పూర్తి వీడియోలను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. మదర్స్ డే రోజు 'అమ్మ పాట' పూర్తి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. లవ్ ట్రాక్‌లో సాగిన 'మెహబూబా' పాటను చిత్రబృందం విడుదల చేసింది. ట్విటర్ వేదికగా ఈ వీడియో సాంగ్ లింక్‌ను షేర్ చేసింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా అలరించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment