songs released
-
ఆధ్యాత్మికం ఉట్టిపడేలా 'దేవ దేవ' పాట విడుదల
Deva Deva Song Out From Brahmastra Movie: భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా బాలీవుడ్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్ బ్యూటీ మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తారని టాక్. ఇదివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'కుంకుమల' వీడియో సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా 'దేవ దేవ' అనే మరో పాటను విడుదల చేశారు. ప్రీతమ్ స్వరపరిచిన ఈ సాంగ్‌కు చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రీరామ చంద్ర, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాట ఆధ్యాత్మికతతో ఉల్లాసభరితంగా సాగింది. ఈ పాట గురించి 'నేను ఈ సాంగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను. ఈ పాటతో ఆధ్యాత్మికంగా శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతి పొందుతారని నేను ఆశిస్తున్నాను' అని రణ్‌బీర్ కపూర్ తెలిపాడు. 'ఈ పాటను విడుదల చేసేందుకు శ్రావణ సోమవారం కంటే మంచి సమయం ఉందని నేను అనుకోను' అని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పేర్కొన్నాడు. కాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. -
విజయ్ మాస్ స్టెప్పులు.. లైగర్ 'అక్డీ పక్డీ' సాంగ్ చూశారా !
Akdi Pakdi Full Song Out: టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ అంచనాలు పెంచేశాయి. ఇదివరకు ఈ మూవీ నుంచి వచ్చిన థీమ్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు తాజాగా మరో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పాటను జులై 11న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రొమో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు తగినట్టుగా సోమవారం 'అక్డీ పక్డీ' పాటను రిలీజ్ చేసింది. ఈ పాటను లిజో జార్జ్ డిజె చేతాస్ స్వరపరచగా, సునీల్ కశ్యప్ హుక్‌లైన్ అందించారు. అజీమ్ దయాని సూపర్ వైజ్ చేశారు. తెలుగులో భాస్కర భట్ల సాహిత్యమందించగా, అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించారు. ఇక ఈ సాంగ్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. వీరిద్దరి డ్యాన్స్ బీట్‌కు తగ్గట్టుగా మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉంది. చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. -
కేజీఎఫ్ 2: 'మెహబూబా' లవ్ సాంగ్ పూర్తి వీడియో చూశారా !
KGF 2 Movie Mehabooba Mehabooba Full Song Released: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల తుఫాన్‌తో రాఖీ భాయ్ ఊచకోత కోస్తున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా పేరొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్లో కూడాల చేరిపోయింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని సాంగ్స్ పూర్తి వీడియోలను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. మదర్స్ డే రోజు 'అమ్మ పాట' పూర్తి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. లవ్ ట్రాక్‌లో సాగిన 'మెహబూబా' పాటను చిత్రబృందం విడుదల చేసింది. ట్విటర్ వేదికగా ఈ వీడియో సాంగ్ లింక్‌ను షేర్ చేసింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా అలరించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
'అరబిక్ కుతు' పూర్తి వీడియో సాంగ్ చూశారా..
Arabic Kuthu Full Song Released From Beast: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా చేసిన ఈ మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 13న థియేటర్లలో రిలీజైంది. అయితే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్ఎక్స్టీలో మే 11 నుంచి 'బీస్ట్' స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే సినిమా మాట ఎలా ఉన్నా ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 'అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుని దుమ్ములేపింది. తాజాగా 'అరబిక్ కుతు' పూర్తి పాటను విడుదల చేశారు మేకర్స్. విజయ్ స్టెప్పులు, పూజా హెగ్డే గ్లామర్‌తో నిండిన ఈ సాంగ్ మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. (చదవండి: Rajinikanth 169: ‘బీస్ట్’ ఎఫెక్ట్.. రజనీకాంత్‌తో సినిమా క్యాన్సిల్! ) The most expected video song of #HalamithiHabibo is herehttps://t.co/oVRBhkN9yc@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @jonitamusic @selvaraghavan @manojdft @AlwaysJani @Nirmalcuts @KiranDrk #BeastModeON #Beast #ArabicKuthuVideoSong — Sun Pictures (@sunpictures) May 9, 2022 -
కేజీఎఫ్ 2: 'అమ్మ పాట' ఫుల్ వీడియో చూశారా ?
KGF 2: Voice Of Every Mother Full Song Released: రాఖీ భాయ్ కలెక్షన్ల తుఫాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోన యాక్షన్ సీన్స్, పాటలు ఆడియెన్‌ను ఒక రేంజ్లో ఉర్రూతలూగించాయి. యాక్షన్, ఎలివేషన్స్, సాంగ్స్, బీజీఎంకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇందులో కొడుకు గురించి తల్లి పాడే ఎదగరా ఎదగరా అనే పాట ప్రతి ఒక్కరికీ గుర్తు ఉంటుంది. ఈ పాటను 'వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్ (అమ్మ పాట)' అని ఇదివరకు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆదివారం (మే 8) మదర్స్ డే సందర్భంగా పూర్తి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. 'వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్' అని ట్వీట్ చేస్తూ షేర్ చేశారు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి. చదవండి: విషాదం.. కేజీయఫ్ నటుడు మృతి ప్రశాంత్ నీల్ మీకు అన్‌హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు Voice of every MOTHER!#GaganaNee/#FalakTuGarajTu/#YadagaraYadagara/#AgilamNee/#GaganamNee : https://t.co/lsnsFyAupu#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @RaviBasrur @LahariMusic @Mrtmusicoff pic.twitter.com/b2RbaKR8U0 — RamajogaiahSastry (@ramjowrites) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎస్పీ బాలు గాత్రమందించిన 'కర్మయోగి' చిత్రం పాటలు విడుదల
Karmayogi Movie Songs Sung By Late Sp Balu: తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటి చెప్పిన శ్రీ ధర్మవ్యాధుడు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కర్మ యోగి శ్రీ ధర్మవ్యాధుడి చరిత్ర’. జీజే రాజా దర్శకత్వంలో విజయ్ భాస్కర్, అనుషా, అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి. మురళీధర్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ఇది. భోగికార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో ఉల్కందే కార్ మురళీధర్ నిర్మించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలను ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ సినిమా పాటలను హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జేసీ చంద్రయ్య, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణమోహన్, దైవజ్ఞ శర్మ ఆవిష్కరించారు. ‘‘తల్లిదండ్రులకు సేవ చేయడంలోనే మానవ సేవ దాగి ఉంది. మానవ సమాజం గురించి మనలోని అజ్ఞానాన్ని తెలియజేసే ఈ సినిమా తీసిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని కృష్ణమోహన్, జేసీ చంద్రయ్య అన్నారు. ‘‘ధర్మవ్యాధుడి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని తీసిన చిత్రం ఇది’’ అన్నారు జీజే రాజా. ‘‘ఈ సినిమాను రామానాయుడుగారు తీయాల్సింది. కానీ ఆయన పరమపదించారు. కథ నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాను పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టింది’’ అన్నారు మురళీధర్. ఈ చిత్రానికి లక్ష్మణ సాయి సంగీతమందించారు. -
సస్పెన్స్ లవ్‌స్టోరీ
‘రోజూపూలు, ఒకరికి ఒకరు’ ఫేమ్ శ్రీరామ్ హీరోగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఇందులో కన్నడ భామ సంచితా పదుకునే కథానాయికగా నటించారు. ఎక్స్‌డస్ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరామేన్ ఎన్వీఆర్ దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ‘‘కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రం ఇది’’ అని శ్రీరామ్ అన్నారు. ఈ సినిమాలోని పాటల జ్యూక్ బాక్స్‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. ‘‘తెలంగాణలో చిత్రీకరించిన ఈ చిత్రం పాటలను తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ సస్పెన్స్ లవ్‌స్టోరీ ఇది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. డా. చల్లా భాగ్యలక్ష్మి, చిర్రావూరి విజయ్‌కుమార్, వెంకటేష్ తదితరులు రచించిన ఈ చిత్రం పాటలను విజయ్ ఏసుదాస్, విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవికలు ఆలపించారు. -
కరోనా నియంత్రణకు కళాకారుల గీతాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చర్యలో భాగంగా కళాకారులు సైతం నడుం బిగించారు. తమ వంతుగా అవగాహన గీతాలను రూపొందించారు. ఈమేరకు ఆదివారం మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గీతాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఈ అవగాహన గీతాలను రచించిన రచయితలను, గాయకులను అభినందించారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం సీఎం కేసీఆర్ అనుక్షణం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దర్శకుడు నరేందర్‌గౌడ్ నంగునూరి, ప్రముఖ గీత రచయిత, సాంస్కృతిక సారథి కళాకారుడు అభినయ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. -
ప్రజాసంకల్పయాత్ర సప్తస్వరాలు పాటలు విడుదల
-
బట్... అంతా మెగా ఫ్యామిలీనే!
– అల్లు అర్జున్ ‘‘తండ్రిగా బన్నీ (అల్లు అర్జున్) ప్రతి సినిమా హిట్టవ్వాలని కోరుకుంటా. కానీ, ఈ డీజే ‘దిల్’ రాజు కోసం హిట్టవ్వాలని కోరుకుంటున్నా. చిత్రపరిశ్రమలో నాకున్న మంచి స్నేహితుల్లో ఆయనొకరు. వ్యక్తిగతంగా ఆయనకు ఓ నష్టం (‘దిల్’ రాజు భార్య అనిత మృతి గురించి) జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి ఏదీ చేయలేం. కానీ, మా ఫ్యామిలీ నుంచి ఆయనకు ఓ సూపర్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా’’ అన్నారు అల్లు అరవింద్. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన సినిమా ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అల్లు అరవింద్ మనవడు అయాన్ (బన్నీ కుమారుడు), ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ పాటల సీడీలను విడుదల చేశారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ఓ రోజు మా ఇంట్లో పదిమంది బ్రాహ్మణులను చూశా. పూజలు ఏమైనా చేస్తున్నారా? అని మా ఆవిడను అడిగితే... బన్నీ కోసం వచ్చారని చెప్పింది. ‘డీజే’ కోసం బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలు, వేదం ఎలా పలకాలనేది నేర్చుకుంటున్నాడని చెప్పింది. అప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. దేవిశ్రీ సూపర్ సాంగ్స్ ఇచ్చాడు’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే... నా ఫ్యాన్స్, నా సినిమాలు చూసే ఇతర హీరోల ఫ్యాన్స్, ప్రేక్షకులే కారణం. నేను మరచిపోకుండా చెప్పాల్సింది మెగా ఫ్యాన్స్ గురించి. మెగా ఫ్యాన్స్ అంటే... మెగాస్టార్ చిరంజీవిగారి ఫ్యాన్స్ అని కాదు. పవన్‌గారు, రామ్‌చరణ్, వరుణ్, తేజు, శిరీష్, నిహారిక, నేను... ఎవ్వరుంటే వారు. మీరు (ప్రేక్షకులు) ఎవరినైనా ఇష్టపడొచ్చు. బట్... అంతా మెగా ఫ్యామిలీనే. ఎప్పుడూ నా సినిమాలు నా కోసం హిట్ అవ్వాలనుకుంటా. అనిత ఆంటీ మమ్మల్ని విడిచి వెళ్లినా... మాకు ఏ లోటు లేకుండా సినిమా పూర్తిచేసిన ‘దిల్’ రాజుగారి కోసం ఈ సినిమా హిట్టవ్వాలనుకుంటున్నా. హరీష్ సినిమాల్లో వినోదం ఉంటుంది. కానీ, ‘డీజే’లో వినోదం, భావోద్వేగం రెండూ కుదిరాయి’’ అన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌లోని ‘మనం చేసే పనిలో మంచి కనపడాలి తప్ప... మనిషి కాదు’ అనే మాటలను పవన్‌కల్యాణ్‌గారి స్ఫూర్తితో రాశా. ‘గబ్బర్ సింగ్’ సక్సెస్ తర్వాత పవన్‌గారిని కలసి, ఓ ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగితే... ‘సక్సెస్ కనిపిస్తున్నప్పుడు మనం ఎందుకు కనపడాలి’ అన్నారు. అంతే కాదు... ‘సక్సెస్ మనిషిని ఉన్న చోట ఉండనివ్వదు. చెడు చేస్తుంది. జాగ్రత్తగా ఉండు’ అని చెప్పారు. ఈ కట్టె కాలే వరకూ నేను పవన్ ఫ్యానే. ఆయనతో సినిమా అంటే... ప్రకృతి సహకరించాలి. పవన్ నుంచి ఆదేశాలు రావాలి. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే... తెరపై అల్లు అర్జున్, తెర వెనుక దేవిశ్రీ హీరోలు. ఈ సినిమా చూసి అర్జున్ ప్రతి ఫ్యాన్ కాలర్ ఎగరేస్తాడు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘మా సంస్థ స్థాపించి 14 ఏళ్లైంది. తొలి సినిమా ‘దిల్’. రెండో సినిమా ‘ఆర్య’. అప్పుడు నిర్మాతగా నేను, హీరోగా బన్నీ వేర్వేరు. సినిమా ట్రావెల్లో అరవింద్‌గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఒక్కటైంది. తర్వాత బన్నీతో చేసిన ‘పరుగు’ హీరోగా తనకు, నిర్మాతగా నాకు ఆరో సినిమా. మళ్లీ బన్నీతో చేయడానికి 9 ఏళ్లు పట్టింది. దీనికి కారణం కథే. ఇప్పుడీ ‘డీజే’ మా సంస్థకు 25వ సినిమా. ఈ సినిమా గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే 23న సినిమానే మాట్లాడుతుంది’’ అన్నారు. ఈ వేడుకలో బన్నీ కుమారుడు అయాన్ వేదికపైనుంచి అందరికీ నమస్కరించడం ప్రేక్షకుల్ని ఆకర్షించింది. అల్లు అర్జున్ భార్య స్నేహ, కుమార్తె అర్హ, చిత్ర బృందం పాల్గొన్నారు. -
ఆలోచనలే అతని ఆయుధం
ఆలోచనలే ఆయుధంగా శాంతి కోసం యుద్ధం చేసిన యువకుడు ధృవ. ఒంటరి సైన్యంతోనే శత్రువుకి చెమటలు పట్టించిన అతడి కథ తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకూ వెయిట్ చేయమంటున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. రామ్‌చరణ్ హీరోగా ఆయన దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘ధృవ’. హిప్ హాప్ ఆది (తమిళ) సంగీతమందించిన ఈ సినిమాలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా బుధవారం విడుదలయ్యాయి. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. రామ్‌చరణ్‌కు జోడీగా రకుల్, విలన్‌గా అరవింద్ స్వామి నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: పీయస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వై.వి. ప్రవీణ్‌కుమార్.