
ఆలోచనలే అతని ఆయుధం
ఆలోచనలే ఆయుధంగా శాంతి కోసం యుద్ధం చేసిన యువకుడు ధృవ. ఒంటరి సైన్యంతోనే శత్రువుకి చెమటలు పట్టించిన అతడి కథ తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకూ వెయిట్ చేయమంటున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. రామ్‌చరణ్ హీరోగా ఆయన దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘ధృవ’. హిప్ హాప్ ఆది (తమిళ) సంగీతమందించిన ఈ సినిమాలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా బుధవారం విడుదలయ్యాయి. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది.
ప్రస్తుతం బ్యాంకాక్‌లో చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. రామ్‌చరణ్‌కు జోడీగా రకుల్, విలన్‌గా అరవింద్ స్వామి నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: పీయస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వై.వి. ప్రవీణ్‌కుమార్.