Beast Movie: Arabic Kuthu Full Video Song - Sakshi
Sakshi News home page

Arabic Kuthu Halamithi Habibo: 'అరబిక్ కుతు' పూర్తి వీడియో సాంగ్‌ చూశారా..

Published Mon, May 9 2022 7:01 PM | Last Updated on Mon, May 9 2022 8:18 PM

Arabic Kuthu Full Song Released From Beast - Sakshi

Arabic Kuthu Full Song Released From Beast: కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించాడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్‌ 13న థియేటర్లలో రిలీజైంది. అయితే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌, సన్‌ ఎన్‌ఎక్స్‌టీలో మే 11 నుంచి 'బీస్ట్‌' స్ట్రీమింగ్‌ కానుంది. ఇదిలా ఉంటే సినిమా మాట ఎలా ఉన్నా ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా 'అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్‌ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుని దుమ్ములేపింది. తాజాగా 'అరబిక్‌ కుతు' పూర్తి పాటను విడుదల చేశారు మేకర్స్‌. విజయ్ స్టెప్పులు, పూజా హెగ్డే గ్లామర్‌తో నిండిన ఈ సాంగ్‌ మరెన్ని రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి.
(చదవండి: Rajinikanth 169: ‘బీస్ట్‌’ ఎఫెక్ట్‌.. రజనీకాంత్‌తో సినిమా క్యాన్సిల్‌! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement