Nelson Dilipkumar Reveals About Vijay Message After Jailer Success - Sakshi
Sakshi News home page

Nelson Dilipkumar: నాపై కోపంగా ఉందా? అనగానే విజయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. జైలర్‌ సక్సెస్‌ అయ్యాక ఏమని మెసేజ్‌ చేశాడంటే?

Published Sun, Aug 13 2023 4:19 PM | Last Updated on Sun, Aug 13 2023 5:12 PM

Nelson Dilipkumar Reveals Vijay Texted Him Saying That He Was Very Happy - Sakshi

నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'కోలమావు కోకిల' చిత్రంతో డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఈయన శివకార్తికేయన్‌తో 'డాక్టర్‌' సినిమా తీయగా ఇది ఈజీగా వంద కోట్ల క్లబ్‌లో చేరింది. తర్వాత విజయ్‌ హీరోగా 'బీస్ట్‌' తీశాడు. దీనికి ఫ్లాప్‌ టాక్‌ వచ్చినప్పటికీ రూ.200 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఇతడు దర్శకత్వం వహించిన 'జైలర్‌' మూవీ బాక్సాఫీస్‌ దగ్గర దూసుకుపోతోంది.

కేవలం మూడు రోజుల్లోనే రూ.220కు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ 'బీస్ట్‌' నెగెటివ్‌ టాక్‌పై స్పందించాడు. 'మేము సినిమా తీశాం. కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. దానికి మేమేం చేయలేము. మా కష్టంలో నిజాయితీ ఉంది. కానీ, వర్కవుట్‌ కాలేదు. సరే, నెక్స్ట్‌ టైం ఇంకా ఎక్కువ కష్టపడతాం మరింత కొత్తగా ప్రయత్నిస్తాం. అయితే బీస్ట్‌ సినిమా రిజల్ట్‌ నెగెటివ్‌ వచ్చినప్పుడు నేను కూడా విజయ్‌తో మాట్లాడాను. నీకేమైనా కోపంగా ఉందా? అని అడిగాను. దానికతడు నాకెందుకు నీపై కోపం ఉంటుంది? అని తిరిగి ప్రశ్నించాడు.

అంటే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది కదా అని చెప్పగానే అయ్యో అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడే వచ్చి నేనెందుకు కోప్పడతాను. మనం కష్టపడి సినిమా తీశాం. కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. దానికి మనమేం చేయగలం.. నెక్స్ట్‌ టైం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. అయినా మన స్నేహాన్ని సినిమాల వరకే పరిమితం చేస్తున్నావా? అన్నాడు. ఆ మాట నా మనసుకు తాకింది. జైలర్‌ సినిమా రిలీజయ్యాక విజయ్‌ నాకు అభినందనలు తెలిపాడు. కంగ్రాచ్యులేషన్స్‌, నీ సక్సెస్‌ పట్ల చాలా సంతోషంగా ఉంది అని మెసేజ్‌ చేశాడు' అని చెప్పుకొచ్చాడు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌.

చదవండి: బాలీవుడ్‌ నటి ఇంట విషాదం.. తండ్రి పాడె మోస్తూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement