తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం కూలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. మంగళవారం నాడు ఆయన చెన్నై విమానాశ్రయంలో కనిపించగా అక్కడున్న మీడియా కొన్ని ప్రశ్నలడిగింది. సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందని అడగ్గా రజనీ.. 70 శాతం పూర్తయిందని చెప్పాడు. మిగతాది జనవరి 13 నుంచి 28 మధ్య షూటింగ్ చేస్తామన్నాడు. ఇంతలో ఓ జర్నలిస్ట్.. తమిళనాడులో మహిళ భ్రదత గురించి ప్రశ్నించగా రజనీ అసహనం వ్యక్తం చేశాడు. రాజకీయ ప్రశ్నలు అడగవద్దని చెప్పాను కదా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఏం జరిగింది?
గతేడాది డిసెంబర్ 23న అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రియుడితో మాట్లాడుతోంది. వీరిద్దరూ చనువుగా ఉన్న సమయంలో జ్ఞానశేఖర్ అనే వ్యక్తి వారిని వీడియో చిత్రీకరించినట్లు వెలుగుచూసింది. ఆ వీడియోతో బ్లాక్‌మెయిల్ చేసి యువతిని భయపెట్టి లొంగదీసుకున్నట్లు బయటపడింది. లైంగికదాడికి పాల్పడటమే కాకుండా తను చెప్పినప్పుడల్లా రావాలని, తాను చెప్పే సార్ వద్దకు వెళ్లాలని హెచ్చరించడం గమనార్హం.
ఇదే తరహాలో మరో అమ్మాయిని కూడా బెదిరింపులతో లొంగదీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు డీఎంకే పార్టీ కార్యకర్త అన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ ఘటనపై రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో మద్రాస్ హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది.
చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
Comments
Please login to add a commentAdd a comment