
ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో జైలర్ ఒకటి. రజనీకాంత్ తన స్వాగ్‌తో సినిమాను రఫ్ఫాడించేశాడు. ఎమోషనల్ సీన్లలో జీవించేసి ఏడిపించేశాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు చిత్ర డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఆయన మాట్లాడుతూ.. 'ఈ కథ రాసుకున్నప్పుడు, షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు పెద్ద చాలెంజ్ ఎదురైంది. చాలామంది జైలర్ మూవీలో రజనీకాంత్ సర్ వెంటుక్రలను తెల్లగా చూపించొద్దని చెప్పారు.
అన్నింటికీ సిద్ధపడ్డా..
ఆయనతో ఏ ప్రయోగాలైనా చేయండి కానీ వయసు మీదపడ్డవారిలా తెల్ల జుట్టుతో మాత్రం చూపించొద్దని అడిగారు. ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా ఇలాంటి మాటలే చెప్పేసరికి భయపడిపోయాను. పైగా ఆయన తన వయసుకు తగ్గ పాత్రలో నటించిన తొలి చిత్రం ఇదే! దీంతో నేనేం చేయాలా? అని చాలా తికమకపడ్డాను. ఏదైతే అదైందని ముందడుగు వేశాను. ఏదైనా విమర్శలు వస్తే స్వీకరించడానికి సిద్ధపడిపోయాను. కానీ పది రోజులు షూటింగ్ జరిగాక నాపై నాకు నమ్మకం వచ్చింది.
జైలర్‌లో స్టార్ హీరోలు..
రజనీని అలా చూపించడం వల్ల ఏమాత్రం నష్టం లేదని అర్థమైంది. సినిమా రిలీజయ్యాక ఎటువంటి స్పందన లభించిందో మీ అందరికీ తెలిసిందే' అని చెప్పుకొచ్చాడు నెల్సన్. కాగా జైలర్ సినిమాలో తమన్నా భాటియా, వసంత్ రవి, యోగి బాబు, రమ్య కృష్ణన్, వినాయకన్ కీలక పాత్రల్లో నటించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, మలయాళం స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రల్లో మెప్పించారు.
చదవండి: రెండు నెలల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం!
Comments
Please login to add a commentAdd a comment