Rajnikanth Jailer 2 Confirmed- Director Nelson Dilipkumar Planned To Sequels To His Four Previous Films - Sakshi
Sakshi News home page

Jailer 2: రజనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! జైలర్‌ 2 ఫిక్స్‌! విజయ్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో..?

Published Mon, Aug 14 2023 5:00 PM | Last Updated on Mon, Aug 14 2023 6:12 PM

Jailer 2 Confirmed-Nelson Dilipkumar Planned To Sequels To His Four Previous Films - Sakshi

నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌.. గత కొద్దిరోజులుగా ఈ పేరు మార్మోగిపోతోంది. 2018లో వెండితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించాడీ తమిళ డైరెక్టర్‌. రచయితగా, దర్శకుడిగా సత్తా చాటుతున్న నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తొలి సినిమా కోలమావు కోకిల. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన తెరకెక్కించిన మరో సినిమా డాక్టర్‌. ఈ సినిమా కూడా హిట్టే!

మూడో సినిమా కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌తో చేశాడు. గతేడాది రిలీజైన ఈ బీస్ట్‌ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. అయితే కలెక్షన్లపరంగా మాత్రం రెండు వందల కోట్లపైనే వసూలు చేసింది. ఈసారి తలైవాతో జైలర్‌ సినిమా తీశాడు నెల్సన్‌. ఈయన అందించిన కథ, డైరెక్షన్‌ అన్నీ పర్ఫెక్ట్‌గా కుదరాయి. ఫలితంగా జైలర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ నాలుగు సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించగా ప్రతి చిత్రంలోనూ యోగి బాబు నటించారు.

జైలర్‌ సినిమాకు వస్తున్న స్పందన చూసి సంతోషం వ్యక్తం చేసిన నెల్సన్‌ త్వరలో దీనికి సీక్వెల్‌ కూడా తీయనున్నాడట! అంతేకాదు, ఇప్పటివరకు తీసిన మూడు సినిమాల(బీస్ట్‌, డాక్టర్‌, కోలమావు కోకిల)కు కూడా రెండో పార్ట్‌ తీయాలన్న ఆలోచనలో ఉన్నాడట. విజయ్‌, రజనీకాంత్‌ను ఒకే సినిమాలో కలిసి చూపించాలన్నది కూడా తన కల అని నెల్సన్‌ చెప్పాడంటూ తమిళ సినీ విశ్లేషకుడు మనోబాల విజయబాలన్‌ ట్విటర్‌లో రాసుకొచ్చాడు. మరి అది సాధ్యమయ్యే పనేనా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి!

చదవండి: Jailer Movie: ఊచకోత మొదలుపెట్టిన తలైవా.. రూ. 300 కోట్ల క్లబ్బులో జైలర్‌.. తెలుగులో ఎంతంటే?
మెగాస్టార్‌కు మరోసారి సర్జరీ.. సినిమాలకు బ్రేక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement