సస్పెన్స్‌ లవ్‌స్టోరీ  | Asalem Jarigindi Movie Songs Released By Aditya Music | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ లవ్‌స్టోరీ 

Published Wed, Jun 3 2020 12:11 AM | Last Updated on Wed, Jun 3 2020 12:11 AM

Asalem Jarigindi Movie Songs Released By Aditya Music - Sakshi

‘రోజూపూలు, ఒకరికి ఒకరు’ ఫేమ్‌ శ్రీరామ్‌ హీరోగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఇందులో కన్నడ భామ సంచితా పదుకునే కథానాయికగా నటించారు. ఎక్స్‌డస్‌ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరామేన్‌ ఎన్‌వీఆర్‌ దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ‘‘కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రం ఇది’’ అని శ్రీరామ్‌ అన్నారు. ఈ సినిమాలోని పాటల జ్యూక్‌ బాక్స్‌ను ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదల చేశారు. ‘‘తెలంగాణలో చిత్రీకరించిన ఈ చిత్రం పాటలను తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ సస్పెన్స్‌ లవ్‌స్టోరీ ఇది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. డా. చల్లా భాగ్యలక్ష్మి, చిర్రావూరి విజయ్‌కుమార్, వెంకటేష్‌ తదితరులు రచించిన ఈ చిత్రం పాటలను విజయ్‌ ఏసుదాస్, విజయ్‌ ప్రకాష్, యాజిన్‌ నిజార్, మాళవికలు ఆలపించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement