Aditya music
-
సస్పెన్స్ లవ్‌స్టోరీ
‘రోజూపూలు, ఒకరికి ఒకరు’ ఫేమ్ శ్రీరామ్ హీరోగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఇందులో కన్నడ భామ సంచితా పదుకునే కథానాయికగా నటించారు. ఎక్స్‌డస్ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరామేన్ ఎన్వీఆర్ దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ‘‘కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రం ఇది’’ అని శ్రీరామ్ అన్నారు. ఈ సినిమాలోని పాటల జ్యూక్ బాక్స్‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. ‘‘తెలంగాణలో చిత్రీకరించిన ఈ చిత్రం పాటలను తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ సస్పెన్స్ లవ్‌స్టోరీ ఇది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. డా. చల్లా భాగ్యలక్ష్మి, చిర్రావూరి విజయ్‌కుమార్, వెంకటేష్ తదితరులు రచించిన ఈ చిత్రం పాటలను విజయ్ ఏసుదాస్, విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవికలు ఆలపించారు. -
కరోనా విరాళం
కృష్ణంరాజు, శ్యామలా దేవి – 10 లక్షలు (‘ పీయం కేర్స్’కు) (శ్యామలా దేవి పుట్టినరోజు ఏప్రిల్ 13న. ఈ సందర్భంగా 4 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే కృష్ణం రాజు, శ్యామల కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తీ, సాయి ప్రదీప్తీ తమ పాకెట్ మనీ నుంచి తలా రెండు లక్షలు తీసి 6 లక్షలను విరాళంగా ప్రకటించారు.) కె.కె. రాధా మోహన్ – 3 లక్షలు (సీసీసీ మనకోసం) వీకే నరేష్ – 11 లక్షలు ( ‘సీసీసీ మనకోసం’కి 1 లక్ష, ‘మా’లో 100 మంది సభ్యులను దత్తత తీసుకుని ఒక్కో సభ్యుని కుటుంబానికి 10 వేలు సాయం. ఇప్పటికే 58 కుటుంబాలకు వారి వారి బ్యాంకు ఖాతాలో 10 వేలు చొప్పున డిపాజిట్ చేశారు). ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త, దినేశ్ గుప్త, ఆదిత్య గుప్తలు కరోనాపై యుద్ధానికి – 31 లక్షలు విరాళం -
త్వరలో సెట్స్ మీదకు ‘ఆల్ ఈజ్ వెల్’
శతమానం భవతి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న తరువాత శ్రీనివాస కల్యాణం సినిమాతో తడబడ్డాడు. దీంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సతీష్ ప్రస్తుతం మరో ఇంట్రస్టింగ్ సినిమాతో రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు ఈ దర్శకుడు. ‘ఆల్ ఈజ్ వెల్’ అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమాను రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించనున్నారు. శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన సతీష్ వేగేశ్న ఆల్ ఈజ్ వేల్‌ను కూడా అదే తరహా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించానున్నారు. -
అమ్మమ్మగారింటికి వేసవిలోనే...
నాగశౌర్య, బేబి షామిలి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్ సూర్య దర్శకత్వంలో స్వాజిత్ మూవీస్ బ్యానర్లో రాజేష్, కె.ఆర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. స్వచ్ఛమైన తెలుగు టైటిల్ పెట్టడంతో సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఇటీవలే సినిమా శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. తాజాగా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ నెల 22న టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వేసవి కానుకగా సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: స్వప్న. -
నిర్మాణ రంగంలోకి టాప్ మ్యూజిక్ కంపెనీ
ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఎన్నో భారీ చిత్రాల ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న ఈ సంస్థ తొలిసారిగా ఓ డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'తీరన్ అధిగరమ్ ఒండ్రు' సినిమాను ఆదిత్య సంస్థ తెలుగులో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జిబ్రన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిమన్యు సింగ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. కార్తీ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌కు ఆదిత్య మ్యూజిక్ ఎండి ఉమేష్ గుప్తా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూన్ 30న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ తొలి వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.