
శతమానం భవతి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న తరువాత శ్రీనివాస కల్యాణం సినిమాతో తడబడ్డాడు. దీంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సతీష్ ప్రస్తుతం మరో ఇంట్రస్టింగ్ సినిమాతో రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు ఈ దర్శకుడు. ‘ఆల్ ఈజ్ వెల్’ అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమాను రూపొందనుందని తెలుస్తోంది.
ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించనున్నారు. శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన సతీష్ వేగేశ్న ఆల్ ఈజ్ వేల్‌ను కూడా అదే తరహా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment