హ్యాట్రిక్‌పై కన్నేసిన ఎన్టీఆర్‌ బామ్మర్ది.. ఆ హిట్‌ మూవీ డైరెక్టర్‌తో ! | Narne Nithin latest Movie Update Goes Viral Tollywood | Sakshi
Sakshi News home page

Narne Nithin: దసరా రేసులో నార్నె నితిన్.. ఆ హిట్ మూవీ డైరెక్టర్‌తో!

Published Tue, Aug 20 2024 9:25 PM | Last Updated on Tue, Aug 20 2024 9:28 PM

Narne Nithin latest Movie Update Goes Viral Tollywood

మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దిగా ఎంట్రీ ఇచ్చిన  నితిన్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపుతో మరో చిత్రానికి రెడీ అయ్యారు. తాజాగా "శతమానం భవతి" డైరెక్టర్‌ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంపద హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ... 'హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి ఫీల్ గుడ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్  సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్నారు. వీటికి భిన్నంగా మా సినిమా ఉంటుంది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్‌లో దర్శకుడు సతీష్ వేగేశ్నతెరకెక్కించారు .ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు. అందుకే ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం' అని అన్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement