![Satish vegnesa to direct Meghamsh Srihari and Sameer Vegesna next - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/16/meg.jpg.webp?itok=b94INg8R)
మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు సమీర్ వేగేశ్న కథానాయకులుగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. ఎమ్‌ఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ సినిమా నిర్మించనున్నారు. ఆగస్టు 15న డా. శ్రీహరి జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు.
సతీష్ వేగేశ్న మాట్లాడుతూ –‘‘వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేశాను. ఇప్పుడు ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా చేయబోతున్నాను. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ మొదలు పెడతాం’’ అన్నారు. ‘‘శతమానం భవతి’ సినిమా నా మనసుకి బాగా నచ్చింది. సతీష్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎమ్‌ఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు).
Comments
Please login to add a commentAdd a comment