sameer
-
నార్సింగి : సెలూన్ ప్రారంభోత్సవంలో బిగ్ బాస్ సెలబ్రిటీలు సందడి (ఫొటోలు)
-
అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడిన దర్శకుడు.. స్టార్ హీరో పోస్ట్ వైరల్!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సమీర్ విద్వాన్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్ జూలీ సోనాల్కర్ను ఆయన పెళ్లాడారు. గతేడాది సత్య ప్రేమ్ కి కథ మూవీతో హిట్ కొట్టిన సమీర్ విద్వాన్స్ తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట జూన్ 29న మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లికి బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' సత్యప్రేమ్ కి కథ సెట్స్‌లో మీ లవ్ స్టోరీని చూశా. ఈ రోజు మీ అందమైన ప్రయాణంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. నూతన జంటకు నా అభినందనలు.' అంటూ రాసుకొచ్చారు. కాగా.. సత్యప్రేమ్ కి కథ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించారు. అయితే వీరి పెళ్లికి హీరోయిన్ కియారా అద్వానీ హాజరు కాలేదు. కాగా.. సమీర్ విద్వాన్స్ ప్రస్తుతం మరాఠీ చిత్రం మహాత్మను తెరకెక్కిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ నటించిన చిత్రం ‘చందు ఛాంపియన్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
సత్తా ఉన్న ప్రతిభావంతులకు తారా జువ్వలా దూసుకుపోయేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక. స్వదేశీ ఆటగాళ్లయినా... విదేశీ ఆటగాళ్లయినా ఒక్కసారి ఐపీఎల్లో ఆడి మెరిపిస్తే కావాల్సినంత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. నిలకడైన ఆటతీరుతో కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడానికి.... ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ దోహదం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్లో అదరగొట్టి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రాబోయే ఐపీఎల్ 17వ సీజన్లో అరంగేట్రంలోనే తమ విధ్వంసకర ఆటతీరుతో, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం గెలుపు గుర్రం... రచిన్ రవీంద్ర (చెన్నై) అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనతికాలంలోనే జట్టు ముఖ్య సభ్యుడిగా ఎదిగాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో రచిన్ 10 మ్యాచ్‌లు ఆడి 578 పరుగులు సాధించి న్యూజిలాండ్ టాప్ స్కోరర్‌గా నిలవడంతోపాటు టాప్–4లో చోటు సంపాదించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో చెలరేగి 68 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్న రచిన్ తన మెరుపులతో మెరిపించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తనవంతు పాత్ర పోషిస్తే మాత్రం భవిష్యత్ లో టాప్ స్టార్‌గా ఎదగడం ఖాయం. సిక్సర్ల వీరుడు... సమీర్ రిజ్వీ (చెన్నై) ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఆటగాళ్లను ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ గత మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోసం చెన్నై పట్టుబట్టింది. ఇంకా భారత జట్టుకు ఆడని సమీర్ రిజ్వీని చెన్నై ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలు వెచ్చించింది. ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వీ యూపీని గెలిపించినంత పనిచేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు సాయికిశోర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలపై విరుచుకుపడిన రిజ్వీ ఆ మ్యాచ్‌లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. యూపీ టి20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టు తరఫున అత్యధిక సిక్స్‌లు బాది వెలుగులోకి వచ్చిన రిజ్వీ కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసేందుకు రిజ్వీ రెడీ అవుతున్నాడు. వేగం.. వైవిధ్యం.. గెరాల్డ్ కొయెట్జీ (ముంబై) గతంలో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గెరాల్డ్ కొయెట్జీని ప్రత్యామ్నాయ ప్లేయర్‌గా తీసుకున్నా మ్యాచ్ ఆడించలేదు. వేగంతోపాటు వైవిధ్యభరిత బౌలింగ్‌తో కొయెట్జీ గత వన్డే వరల్డ్‌కప్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టాప్–5లో నిలిచాడు. ఈ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఆకట్టుకుంది. 23 ఏళ్ల కొయెట్జీని ముంబై రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్లో బుమ్రా తర్వాత ముంబై తరఫున రెండో ప్రధాన బౌలర్‌గా కొయెట్జీని చూడవచ్చు. ఆల్‌రౌండర్... అజ్మతుల్లా (గుజరాత్) 2022లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ ఏడాది పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోయాడు. దాంతో పాండ్యా తరహాలో టైటాన్స్‌కు ఆల్‌రౌండర్ కొరత ఏర్పడింది. ఈ లోటును కొంతలో కొంత అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేస్తాడని చెప్పవచ్చు. రూ. 50 లక్షలకు అజ్మతుల్లాను టైటాన్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో అజ్మతుల్లా 353 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ పేసర్... జాన్సన్ (గుజరాత్) మడమ గాయంతో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో టైటాన్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది. అయితే ఆ్రస్టేలియాకు చెందిన లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో టైటాన్స్‌కు మరో మంచి బౌలర్ దొరికాడనే చెప్పాలి. 28 ఏళ్ల జాన్సన్ గత రెండేళ్లలో ఎంతో రాటుదేలాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి జాన్సన్‌ను తీసుకుంది. లక్కీ చాన్స్... షామర్ జోసెఫ్ (లక్నో) ఆ్రస్టేలియాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన టెస్టులో షామర్ జోసెఫ్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో షామర్ అంతర్జాతీయస్థాయిలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మినీ వేలంలో షామర్ను ఎవరూ తీసుకోలేదు. అయితే ఇంగ్లండ్‌కు చెందిన పేస్ బౌలర్ మార్క్ వుడ్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ షామర్ జోసెఫ్‌ను రూ. 3 కోట్లకు తీసుకుంది. -
శివాజీకి కూతురు ఉంది.. బయటపెట్టిన సమీర్
శివాజీ.. ఒకప్పుడు మంచి నటుడు.. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి మురికిపట్టిపోయాడు. స్వార్థపరులకు, అవకాశవాదులవైపు నిలబడి అందరితో ఛీ కొట్టించుకున్నాడు. ఫలితంగా జనాల్లో ఆదరణ తగ్గిపోయింది. అవకాశాలు దూరమయ్యాయి. ఇంట్లో ఖాళీగా ఉంటున్న సమయంలో బిగ్‌బాస్ ఛాన్స్ రావడంతో ఓకే చెప్పాడు. అలా బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్నాడు. ఎప్పుడూ నిజాలే మాట్లాడతాను, అబద్ధం చెప్పను.. అసలు అబద్ధం అంటే ఎలా ఉంటుందో తెలీదన్నట్లుగా పోజు కొడుతుంటాడు శివాజీ. పీక మీద కాలేసి తొక్కుతా.. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేది చిల్లర పనులు అన్నట్లుగా ఈయన చెప్పేది ఒకటుంటుంది.. వాస్తవం మరొకటి ఉంటుంది. ఈ మధ్య అతడు షోలో ఆడవాళ్ల గురించి పిచ్చి కూతలు కూశాడు. శోభ కోపంతో అరిచినందుకుగానూ.. అలాంటి అమ్మాయిలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడిని.. రెండు పీకేవాడిని.. అంటూ నోటికొచ్చింది వాగాడు శివాజీ. అలా అపడం తప్పని నాగార్జున చెప్పినా వినిపించుకోలేదు. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే పీక మీద కాలేసి తొక్కుతావా? అని నాగ్ నిలదీస్తే.. అవును.. ఇలాగే ప్రవర్తిస్తా.. రెండు పీకుతా అని దురుసుగా సమాధానమిచ్చాడు. ఎవరికీ తెలియని విషయం చెప్పిన సమీర్ ఆఖరికి ఆడియన్స్ కూడా అలా కాలేసి తొక్కుతాననడం నచ్చలేదని చెప్తున్నా.. తనను తాను సమర్థించుకున్నాడే తప్ప తప్పును అంగీకరించడానికి ఇష్టపడలేదు. హౌస్‌లో ఉన్న ప్రియాంక, శోభను కూడా ఎప్పుడూ చులకన చేసి మాట్లాడుతూ ఆడవారి పట్ల తనకెంత చులకన భావం ఉందనే విషయాన్ని బయటపెడుతూనే వచ్చాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు సమీర్.. శివాజీ గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు ఉందని చెప్పాడు. శివాజీకి కూతురు ఉందా? ఈ విషయం తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎందుకంటే శివాజీ.. ఇప్పటివరకు తనకు ఇద్దరు కొడుకులు మాత్రమే సంతానం అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడా తనకు కూతురు ఉన్నట్లు ప్రస్తావించలేదు. బిగ్‌బాస్ షోలోనూ పెద్ద కొడుకు ఫ్యామిలీ వీక్‌లో హౌస్‌లోకి వెళ్లాడు. అలాగే సండే ఎపిసోడ్లో శివాజీ భార్యతో పాటు చిన్న కొడుకు స్టేజీపై కనిపించారు. కానీ కూతురు ప్రస్తావన, ఉనికి మాత్రం ఎక్కడా లేదు. నెటిజన్ల డౌటానుమానాలు అయితే ఇన్నాళ్లూ శివాజీ గుట్టుగా దాచిన తన కూతురి విషయాన్ని బయటపెట్టాడు సమీర్. ఓ ఇంటర్వ్యూలో సమీర్ మాట్లాడుతూ.. శివాజీకి ఓ కూతురు ఉందన్నాడు. దీంతో యాంకర్.. శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు ఉందా? అని తిరిగి ప్రశ్నించగా.. అవును, అతడికి ఓ కూతురు కూడా ఉందని నొక్కి చెప్పాడు. మరి శివాజీ ఆ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు? తన కూతురి గురించి ఇంతవరకు ఎక్కడా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? అని నెటిజన్లు రకరకాలుగా అనుమానిస్తున్నారు. చదవండి: Adhik Ravichandran Marriage Photos: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి.. విశాల్ స్వీట్ వార్నింగ్.. -
'వీళ్లతో మాట్లాడాక.. హాయ్ పెడతా'.. 24 గంటల్లోనే వీడిన మిస్టరీ..
జగిత్యాల: ‘నేను వీళ్లతో మాట్లాడుతున్న.. తర్వాత నీకు హాయ్ పెడత.. అప్పుడు ఫోన్ చెయ్’ అని ఓ వివాహితకు పెట్టిన చివరి వాయిస్ మేసేజ్ సమీర్ హత్య కేసు నిందితులను పట్టించింది. బుధవారం రాత్రి కనిపించకుండా పోయిన పట్టణానికి చెందిన సమీర్(25) మృతదేహం పట్టణ శివారులోని ఎస్సారెస్పీ డీ–40 కెనాల్లో లభించడం కలకలం రేపింది. యువ కుడి మృతదేహం లభించిన 24 గంటల వ్యవధిలోనే సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై కిరణ్.. నిందితులను అదుపులోకి తీసుకోవడం విశేషం. వివాహితతో సాన్నిహిత్యం.. ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న షేక్ సమీర్ కొంతకాలంగా ఓ వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతో ఇప్పటికే సన్నిహితంగా ఉండే మరో వ్యక్తికి ఇది నచ్చలేదు. దీంతో తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సంగెం మెయిన్ కెనాల్‌కు అనుబంధంగా ఉన్న డీ–40 కెనాల్ వద్దకు వచ్చిన ఇద్దరు.. సమీర్‌తో గొడవ పడ్డట్లు సమాచారం. ఈ సమయంలోనే సమీర్.. తాను ‘హాయ్’ పెట్టేవరకు ఫోన్ చేయద్దని సదరు వివాహిత ఫోన్‌కు వాయిస్ మేసేజ్ పంపినట్లు సమాచారం. సమీర్‌తో గొడవ పడ్డ ఇద్దరు అతడిని హతమార్చి మోటార్‌సైకిల్‌తో సహా మెయిన్ కెనాల్లోకి తోసేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. డీ–40 కాలువలో సమీర్ మృతదేహం కొట్టుకువచ్చి ఇటుక బట్టీల వద్ద తేలింది. సమీర్ బావ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. వాయిస్ మేసేజ్ ఆధారంగా విచారణ చేసి సమీర్ హత్యలో పాలుపంచుకున్న ఇద్దరిని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిని విచారించిన సీఐ ప్రవీ ణ్‌కుమార్, ఎస్సై కిరణ్.. శనివారం ఉదయం సంగెం మెయిన్ కెనాల్లో సమీర్ తీసుకెళ్లిన మోటార్‌సైకిల్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మొత్తమ్మీద 24 గంటల వ్యవధిలోనే పోలీసులు సమీర్ హత్యోదంతంలో మిస్టరీని ఛేదించారు. -
బీఆర్ఎస్, బీజేపీలకు కార్మికలోకం బుద్ధి చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఫ్యూడల్, కేంద్రంలోని కేపిటలిస్టు ప్రభుత్వాల కుట్రలో కార్మికులు పడొద్దని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పి) నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హక్కులను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు కార్మికలోకం సిద్ధం కావాలని కోరారు. ఆదివారం ఇక్కడి గాంధీభవన్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ (కేకేసీ) రాష్ట్ర చైర్మన్ సమీర్ కౌశల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రూ.10 వేల కోట్ల సెస్ నిధులను కార్మికుల కోసం ఖర్చు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, ఔట్సోర్సింగ్ విధానంలో కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి కార్మికులు గుణపాఠం చెప్పాలని భట్టి కోరారు. త్వరలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. సమావేశం వేదికపైకి తమను ఆహ్వానించలేదంటూ ఐఎన్టీయూసీ నేతలు ఆందోళనకు దిగారు. వీరికి సర్దిచెప్పి సమావేశాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, కేకేసీ చైర్మన్ డాక్టర్ ఉదిత్‌రాజ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రేను కార్మికనేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. -
పాస్ వర్డ్ పిన్ అవసరం లేకుండానే ఫోన్ పే పేమెంట్స్...
-
నాటునాటుకు ఆస్కార్.. లాబీయింగ్‌తోనే అవార్డులు: నటుడు
తమిళ సినిమా: టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఘన విజయాన్ని సాధించడంతోపాటు ప్రపంచ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును సాధించి భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టింది. ఆ చిత్రంలోని నాటునాటు పాట ఈ అవార్డును గెలుచుకున్నట్లు తెలిసింది. దీంతో భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా గర్వపడుతోంది. అయితే ఈ అవార్డు విషయంలో కొన్ని విమర్శలు ఎదురవుతున్నాయి. ఎవరి అభిప్రాయాలు వారివి కాబట్టి అది సహజమే. కాగా తమిళ దర్శకుడు, నటుడు అమీర్ ఆస్కార్ అవార్డుల విషయంలో తనదైన శైలిలో స్పందించారు. ఇంకా చెప్పాలంటే ఆస్కార్ అవార్డునే విమర్శించారు. ఈయన శుక్రవారం సాయంత్రం ఒక సినిమా వేడుకలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన అమీర్ ఒక భారతీయ సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం సంతోషం అన్నారు. అయితే ఆస్కార్ అవార్డు అనేది ఆ దేశంలో అందించే జాతీయ అవార్డు అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఉత్తమ నటుడు అయిన శివాజీ గణేషన్‌కు చివరి వరకు ఎందుకు జాతీయ అవార్డు రాలేదన్నారు. దేవర్ మగన్ చిత్రంలోని ఆయన నటనకు గాను ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారని, అయితే దానిపై స్పందించిన శివాజీ గణేషన్ ఈ అవార్డు వచ్చింది కాదని, ఆ జ్యూరీ సభ్యులను మనవారు పట్టుబట్టి ఇప్పించిన అవార్డు అని పేర్కొన్నారన్నారు. పక్షపాతంలేని ఉత్తమ నటుల అవార్డుల ప్రదానం 30 ఏళ్ల క్రితమే ముగిసిందన్నారు. ఇప్పుడు అందిస్తున్న అవార్డులన్నీ లాబీయింగే కారణం అనే విమర్శలు ఉన్నాయన్నారు. 2007లో శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన శివాజీ చిత్రంలోని నటనకు గాను ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డు ప్రదానం చేసిందన్నారు. అలాగని రజనీకాంత్ ఉత్తమ నటుడు అని చెప్పగలమా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక ఎంటర్ టెయినర్ మాత్రమేనని పేర్కొన్నారు. నిజానికి రజనీకాంత్ ఉత్తమ నటన గురించి చెప్పాలంటే ముల్లుమ్ మలరుమ్, ఆరిలిరుందు అరుబదు వరై వంటి చిత్రాలని చెప్పాలన్నారు. ఆ చిత్రాలకు ఎందుకు అవార్డును ఇవ్వలేదని ప్రశ్నించారు. -
భారత్‌కు మారేందుకు రూ. 8,000 కోట్ల పన్నులు కట్టాం..
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకోవడానికి దాదాపు రూ. 8,000 కోట్ల మేర పన్నులు కట్టాల్సి వచ్చింది. పైగా సంబంధిత నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను వ్యాపార పునర్వ్యవస్థీకరణగా పరిగణించడం వల్ల సుమారు రూ. 7,300 కోట్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ ఈ విషయాలు వెల్లడించారు. ప్రధాన కార్యాలయాలను మార్చుకోవడానికి సంబంధించిన స్థానిక చట్టాలు పురోగామిగా లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనల కారణంగా ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఎసాప్) కింద ఇచ్చే ప్రోత్సాహకాలన్నింటినీ ఉద్యోగులు కోల్పోయారని నిగమ్ చెప్పారు. ‘భారత్ కేంద్రంగా చేసుకోవాలంటే కొత్తగా మార్కెట్ వేల్యుయేషన్‌ను జరిపించుకుని, పన్నులు కట్టాల్సి ఉంటుంది. మేము భారత్ రావడానికి మా ఇన్వెస్టర్లు దాదాాపు రూ. 8,000 కోట్లు పన్నులు కట్టాల్సి వచ్చింది. ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాని వ్యాపార సంస్థకు ఇది చాలా గట్టి షాక్‌లాంటిది‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వాల్‌మార్ట్, టెన్సెంట్ వంటి దీర్ఘకాల దిగ్గజ ఇన్వెస్టర్లు తమ వెంట ఉండటంతో దీన్ని తట్టుకోగలిగామని వివరించారు. గతేడాది అక్టోబర్‌లో ఫోన్‌పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకుంది. -
సంపూర్ణేశ్‌కు రూ.25 లక్షలు ఫైన్.. అప్పుడు తారక్ ఏం చేశారంటే?
బిగ్‌బాస్ షోకి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతి ఏడాది ఎప్పుడెప్పుడు బిగ్‌బాస్ ప్రారంభమవుతుందా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు అభిమానులు. కానీ ఆరో సీజన్ పుణ్యమా అని మెచ్చినవాళ్లే మండిపడ్డారు. చెత్త కంటెస్టెంట్లు, చెత్త సీజన్ అని ఈసారి బిగ్‌బాస్ షోను ఏకిపారేశారు. మొదట్లో బాగానే ఉండేది కానీ రానురానూ మరీ దారుణంగా తయారవుతుందని పెదవి విరిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మొదటి సీజన్ కంటెస్టెంట్ సమీర్. 'మా సీజన్లో చాలా బాగా ఉండేది. కానీ ఈసారి స్క్రిప్టెడ్ అయిందేమోనని అందరూ డౌట్ పడుతున్నారు. అయితే మా సీజన్లో సంపూర్ణేశ్ బాబు స్వతాహాగా ఎలిమినేషన్‌కు సిద్ధపడటాన్ని కూడా కొందరు స్క్రిప్ట్ అనుకున్నారు, కానీ అసలు నిజమేంటంటే.. అతడు పల్లెటూరి వ్యక్తి, పల్లెటూరి వాతావరణాన్ని అతడు బాగా ఇష్టపడతాడు. ఇప్పటికీ షూటింగ్ అయిపోగానే సిటీలో ఉండలేక తిరిగి సిద్దిపేటకు వెళ్లిపోతాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక మహల్ లాంటి బిగ్‌బాస్ హౌస్‌లో పడేశారు. ఒక వారం ఉన్నాడు, కానీ తనవల్ల కాలేదు. గదిలో బంధించినట్లుగా ఫీలయ్యాడు. మైండ్ డిస్టర్బ్ అయింది, ఆ క్షోభ భరించలేక నిజంగా ఏడ్చాడు. అప్పుడు నేనక్కడే ఉన్నాను. గేట్లు ఓపెన్ చేయండి, వెళ్లిపోతా.. లేదంటే గేట్లు పగలగొట్టుకుని వెళ్లిపోతానన్నాడు. కానీ బిగ్‌బాస్‌లో అగ్రిమెంట్లు ఉంటాయి. ఎలిమినేషన్ ద్వారా వెళ్లిపోతే ఓకే కానీ తనంతట తానుగా వెళ్లాలంటే తిరిగి రూ.25 లక్షలు కట్టాలి. డబ్బులు కట్టడానికైనా సరే కానీ ఉండనని ఏడుస్తూనే ఉన్నాడు. సరిగా తిండి కూడా తినలేదు. సంపూ పరిస్థితి చూసి తారక్ బిగ్‌బాస్ టీమ్‌తో మాట్లాడాడు. పాతిక లక్షలు కట్టకుండానే అతడిని హౌస్ నుంచి పంపించేశాడు. ఇప్పుడంటే సిటీ మధ్యలోనే బిగ్‌బాస్ హౌస్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ, మాది మహారాష్ట్ర లోనావాలాలోని అడవిలో సెట్ వేశారు' అని చెప్పుకొచ్చాడు సమీర్. చదవండి: ఏమున్నాడ్రా బాబూ, హృతిక్ రోషన్ ఎయిట్ ప్యాక్ లుక్ వైరల్ వంద కోట్లకు చేరువలో ధమాకా -
హీరోయిన్‌తో ఎఫైర్ అంటగట్టి, బయటకు పంపించారు : నటుడు
సాధారణంగా సీరియల్స్‌లో కష్టపడి ఫేమ్ తెచ్చుకున్నాక సినిమాల్లో నటిస్తుంటారు. కానీ నటుడు సమీర్ విషయంలో మాత్రం సీరియల్స్ నుండి ఉన్నపలంగా తొలగించడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా పలు గుర్తిండిపోయే పాత్రలు చేశాడు. కెరీర్ ప్రారంభంలో ఓ ప్రముఖ ఛానెల్లో వరుస సీరియల్స్‌లో నటించిన సమీర్ ఆ తర్వాత అదే ఛానెల్ నుంచి బయటకు పంపిచేయడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇష్యూపై స్పందించాడు. నా మొగుడు నాకు సొంతం సీరియల్ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నానని, సెట్లోనే రాసలీలలు అంటూ కొందరు నాపై ప్రచారం చేశారు. దీంతో సదరు యాజమాన్యం అసలు ఏం జరిగిందో కూడా కనుక్కోకుండా నన్ను అర్థాంతరంగా సీరియల్ నుంచి తప్పించారు. నాకు రావాల్సిన చెక్కులు కూడా ఆపేశారు. దీంతో అద్దెలు కట్టుకోలేక, ఈఐఎంలు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ తర్వాత కొన్నాళ్లకు అసలు విషయం తెలిసి ఆయనే ఫోన్ చేసి సారీ చెప్పారు. కానీ అప్పటికే నా మనసు విరిగిపోయింది. అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు సమీర్. -
‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు
న్యూఢిల్లీ: ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారంటూ ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సమర్పించిన అఫిడవిట్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వేగంగా స్పందించింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేతోపాటు మరికొందరు అధికారులపై ప్రభాకర్ సాయిల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విజిలెన్స్ దర్యాప్తు కోసం ఎన్సీబీ ఉత్తర రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలో త్రిసభ్య బృందం ఏర్పాటయ్యింది. జ్ఞానేశ్వర్ సింగ్ ఎన్సీబీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీఓ)గానూ పనిచేస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్ట్టడానికి రూ.25 కోట్లు ఇవ్వాలంటూ ఎన్సీబీ కీలక అధికారులతోపాటు ఈ కేసులో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారని ప్రభాకర్ సాయిల్ ఆదివారం బాంబు పేల్చాడు. ఈ మేరకు ముంబై పోలీసులకు అఫిడవిట్ అందజేశాడు. డ్రగ్స్ కేసులో మరో సాక్షి అయిన కె.పి.గోసవికి ప్రభాకర్ సాయిల్ బాడీగార్డుగా పనిచేస్తున్నాడు. ప్రభాకర్ సాయిల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని డ్రగ్స్ కేసులో మరో సాక్షి కిరణ్ గోసవి పేర్కొన్నాడు. క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ దాడులు జరిగిన అక్టోబర్ 2 నుంచి పరారీలో ఉన్న అతడు సోమవారం గుర్తుతెలియని ప్రాంతం నుంచి టీవీ చానళ్లతో మాట్లాడాడు. తాను అతి త్వరలో లక్నో పోలీసుల ఎదుట లొంగిపోతానని చెప్పాడు. పారదర్శకంగా దర్యాప్తు ప్రభాకర్ సాయిల్ సమర్పించిన అఫిడవిట్, కేసు రిపోర్టు ముంబైలోని తమ అధికారుల నుంచి అందిందని జ్ఞానేశ్వర్ సింగ్ సోమవారం ఢిల్లీలో చెప్పారు. ఈ రిపోర్టును ఎన్సీబీ డైరెక్టర్ జనరల్పరిగణనలోకి తీసుకున్నారని, విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారని వెల్లడించారు. సిబ్బందిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా పారదర్శకంగా, నిజాయతీగా దర్యాప్తు జరుపుతామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ వాంఖెడేను డ్రగ్స్‌కేసు విచారణ నుంచి తప్పించడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాలను బట్టి చర్యలుంటాయన్నారు. విజిలెన్స్ దర్యాప్తులో భాగంగా వాంఖెడేను, ఇతర అధికారులను, సాయిల్‌ను నిశితంగా ప్రశ్నించనున్నట్లు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సమీర్ వాంఖెడే సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్సీబీ ఉన్నతాధికారులెవరూ తనను పిలిపించలేదని, వేరే పని కోసం ఇక్కడికి వచ్చానన్నారు. సాయిల్‌కు పోలీసు భద్రత ముంబై డ్రగ్స్ కేసులో సాక్షి అయిన ప్రభాకర్ సాయిల్‌కు పోలీసు భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌వాల్సే పాటిల్ ప్రకటించారు. సాయిల్ సోమవారం ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. జాయింట్ కమిషనర్(క్రైమ్) మిలింద్‌ను కలిసి మాట్లాడాడు. అనంతరం ముంబై శివారులోని సహర్ పోలీసులను కలిశాడు. తనకు భద్రత కల్పించాలని కోరాడు. విచారణకు అనన్య పాండే డుమ్మా డ్రగ్స్ కేసులో నటి అనన్య పాండే సోమవారం ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఇంతకుముందే రెండు రోజులపాటు ఎన్సీబీ ఆమెను ప్రశ్నించింది. సోమవారం మళ్లీ రావాలని సూచించినప్పటికీ రాలేదు. వాంఖెడే ఫోర్జరీ సర్టిఫికెట్లు: నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ డెరెక్టర్ సమీర్ వాంఖెడే పుట్టినతేదీ సహా సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి, ఉద్యోగంలో చేరారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరో పించారు. సోమవారం సదరు సర్టిఫికెట్లను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఆరోపణలను వాంఖెడే కొట్టిపారేశారు. ఈ కేసులో నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌ను వాంఖెడే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వాంఖెడేకు ఉపశమనం సాధ్యం కాదు: ప్రత్యేక కోర్టు ముంబై: డ్రగ్స్ కేసులో సాక్షి ప్రభాకర్ సాయిల్ అఫిడవిట్ ఆధారంగా న్యాయస్థానాలు తనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖెడేకు నిరాశే ఎదురయ్యింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఎన్సీబీ, సమీర్ వాంఖెడే సోమవారం ప్రత్యేక కోర్టులో రెండు వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో విచారణకు అడ్డంకులు సృష్టించడానికి ప్రభాకర్ సాయిల్ ప్రయత్నిస్తున్నాడని, అందులో భాగంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎన్సీబీ, వాంఖెడే తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై పెద్ద కుట్ర జరుగుతోందని వాంఖెడే చెప్పారు. తమను నైతికంగా దెబ్బతీసే యత్నం జరుగుతోందన్నారు. అందుకే తమపై న్యాయస్థానాలు చట్టపరమైన చర్యలు ప్రారంభించకుండా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. అయితే, ఈ కేసులో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రత్యేక జడ్జి వి.వి.పాటిల్ స్పష్టం చేశారు. -
MAA Elections 2021: శివబాలాజీ, సమీర్ మధ్య తీవ్ర ఘర్షణ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నిక పోలింగ్ లో ఊహించిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ ప్రారంభమైన ఒక గంట మాత్రమే ప్రశాంతంగా సాగిన ఎన్నికలు.. ఆ తర్వాత పూర్తిగా గందరగోళంగా మారిపోయాయి. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రం లోపల ప్రకాశ్ రాజ్ ప్యానల్ ప్రచారం చేస్తున్నారంటూ.. మంచు మోహన్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శివబాలాజీ చేయిని హేమ కొరకడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పోలింగ్ కేంద్రం వద్ద సమీర్, శివబాలాజీ సైతం ఘర్షణకు దిగారు. సమీర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నాడు అంటూ శివబాలాజీ ఆరోపించాడు. సమీర్ సైతం అతనిపై విరుచుకుపడ్డాడు. ఇద్దరికీ ఇరు వర్గాల సభ్యులు సర్ది చెప్పారు. ప్రస్తుతం ‘మా’ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్నాహ్నం 12 గంటల వరకు 380 ఓట్లు పోలైయ్యాయి. ఆగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రామ్ చరణ్ తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 925 మంది ‘మా’ సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. -
డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్టు
ముంబై/థానే: దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరం సమీపంలో సముద్రంపై విహరిస్తున్న ఓ పర్యాటక నౌకలో జరుగుతున్న డ్రగ్స్పార్టీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు భగ్నం చేశారు. ఈ ఘటనలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశారు. నిషేధిత మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నందుకు గాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, అర్బాజ్ మర్చంట్‌ను ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా, తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఒకరోజు ఎన్సీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్‌పై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 27, సెక్షన్ 8సీ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అతడిని ఎన్సీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని, విచారిస్తున్నారు. నౌకలో మాదక ద్రవ్యాలతో ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, నూపూర్ సారిక, ఇస్మీత్ సింగ్, మొహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మర్చంట్ పట్టుబడ్డారని, వీరిలో ఇద్దరు యువతులు ఉన్నారని వెల్లడించారు. శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరస్, 22 ఎక్స్టసీ మాత్రలు, 5 గ్రాముల మెఫిడ్రోన్(ఎండీ), 1.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుస్తులు, పర్సుల్లో డ్రగ్స్ ముంబై నుంచి గోవాకు పయనమైన కార్డెలియా క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడి చేశారు. నౌకలో అనుమానితులను సోదా చేశారు. వారి వద్ద పలు రకాల మాదక ద్రవ్యాలు లభించాయి. వాటిని దుస్తుల లోపల దాచిపెట్టినట్లు గుర్తించారు. యువతులు తమ పర్సుల్లో డ్రగ్స్ దాచుకున్నారు. ఆదివారం ఉదయం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో నిందితులను ప్రశ్నించారు. అయితే, డ్రగ్స్ పార్టీతో తమకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని క్రూయిజ్ కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు ప్రైవేట్ కార్యక్రమం కోసం ఈ నౌకను అద్దెకు ఇచ్చామని వాటర్‌వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, అధ్యక్షుడు జుర్గెన్ బైలామ్ తెలియజేశారు. కేవలం కుటుంబాలకు వినోదం కలిగించడమే తమ సంస్థ లక్ష్యమని, తమ నౌకల్లో అనుచితమైన పనులను ప్రోత్సహించబోమని వివరించారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తు విషయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటు న్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్యన్ ఖాన్ అరెస్టును అధికారులు ప్రకటించడానికంటే కొద్ది సేపటి ముందు షారుఖ్ ఖాన్ తన ఇంటి నుంచి లాయర్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. తన కుమారుడి అరెస్టుపై ఆయన ఇంకా అధికారికంగా స్పందించలేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి: రాందాస్ అథవాలే నిషేధిత మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వంటి తప్పుడు పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆదివారం డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో డ్రగ్స్‌కు స్థానం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కోరుతానని అన్నారు. నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ దందా బహిర్గతమయ్యిందని గుర్తుచేశారు. సినీ పరిశ్రమలో ఇదొక పెద్ద జాడ్యంగా తయారయ్యిందని చెప్పారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. ముంద్ర పోర్టు ఘటన నుంచి దృష్టి మరల్చడానికే: కాంగ్రెస్ గుజరాత్‌లోని ముంద్ర పోర్టులో ఇటీవల పట్టుకున్న రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ముంబైలో డ్రగ్స్ పార్టీ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత షమా మహమ్మద్ ఆరోపించారు. ముంద్ర పోర్టు ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో ముంద్ర పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) రూ.21,000 కోట్ల విలువైన 2,988 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. షారుక్‌ఖాన్ తనయుడికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఎన్సీబీని షమా మహమ్మద్ ప్రశ్నించారు. ముంద్ర పోర్టులో పట్టుబడిన డ్రగ్స్‌పై దర్యాప్తు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలన్నారు. ఎవరీ సమీర్ వాంఖెడే పర్యాటక నౌకలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి, బడా బాబుల బరితెగించిన పిల్లలను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతడి గురించి ఇంటర్నెట్లో జనం ఆరా తీస్తున్నారు. 40 ఏళ్ల సమీర్ వాంఖెడే ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్. సమీర్ 2017లో మరాఠి నటి క్రాంతీ రెద్‌కర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2004లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు(ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. మొదట ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. పన్నులు ఎగవేస్తున్న ధనవంతుల బండారాన్ని బయటపెట్టారు. పన్నుల ఎగవేతపై ఉక్కుపాదం మోపారు. ఎగవేతదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సమీర్‌కు భయం అంటే ఏమిటో తెలియదని, క్రమశిక్షణ కలిగిన నిజాయతీపరుడైన అధికారి అని ఆయనతో కలిసి పనిచేసినవారు చెబుతుంటారు. బాలీవుడ్ సినిమాలంటే సమీర్‌కు చాలా ఇష్టం. అయినప్పటికీ విధి నిర్వహణలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను చోటివ్వరు. 2020 నవంబర్ 22న డ్రగ్స్ ముఠా సమీర్‌తోపాటు మరో ఐదుగురు ఎన్సీబీ అధికారులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. -
నవ్వులే నవ్వులు
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు సమీర్ వేగేశ్న కథానాయకులుగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. ఎమ్ఎల్వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ సినిమా నిర్మించనున్నారు. ఆగస్టు 15న డా. శ్రీహరి జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. సతీష్ వేగేశ్న మాట్లాడుతూ –‘‘వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేశాను. ఇప్పుడు ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా చేయబోతున్నాను. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ మొదలు పెడతాం’’ అన్నారు. ‘‘శతమానం భవతి’ సినిమా నా మనసుకి బాగా నచ్చింది. సతీష్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎమ్ఎల్వి సత్యనారాయణ (సత్తిబాబు). -
జపాన్ ఓపెన్: శ్రీకాంత్, సమీర్ ఔట్
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. బుధవారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–13, 11–21, 20–22తో మనదేశానికే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ చేతిలో పోరాడి ఓడాడు. 59 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో తొలి సెట్‌ను సునాయాసంగా దక్కించుకున్న శ్రీకాంత్ రెండో సెట్‌ను అలాగే జారవిడుచు కున్నాడు. నిర్ణయాత్మక మూడోసెట్లో పోరాడినప్పటికీ కీలకదశలో తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్ సమీర్ వర్మ 17–21, 12–21తో ఆండర్స్ ఆంటోన్సెన్(డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా– సిక్కిరెడ్డి ద్వయం 11–21, 14–21తో జెంగ్ సి వీ– హువాంగ్ యా క్వియాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి– చిరాగ్ షెట్టి ద్వయం 21–16, 21–17తో మార్కస్ ఎల్లిస్– క్రిస్ లాంగ్రిడ్జ్(ఇంగ్లండ్)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరింది. సింధు అలవోకగా... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు అలవోకగా రెండో రౌండ్లో ప్రవేశించింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–9, 21–17తో వరల్డ్ నెం.12 యూ హాన్(చైనా)పై గెలుపొందింది. తొలి సెట్ ఆరంభంలో 0–2తో వెనకబడిన సింధు ఆ తర్వాత వరుసగా 6 పాయింట్లు సాధించి 6–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే ఊపులో ప్రత్యర్థికి కేవలం మరో మూడు పాయింట్లు మాత్రమే కోల్పోయి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో సింధుకు ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే అనుభవాన్ని రంగరించిన సింధు సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. తదుపరి రౌండ్లో అయ ఒహొరి(జపాన్)తో సింధు తలపడుతుంది. -
ఏ టోర్నమెంట్లోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది..
సాక్షి క్రీడావిభాగం : కొత్త ఏడాదిలో లోటుగా ఉన్న టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు మరో సమరానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో సింధు నేడు తొలి మ్యాచ్ ఆడనుంది. సిడ్నీలో బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 56వ ర్యాంకర్, క్వాలిఫయర్ చౌరున్నిసా (ఇండోనేసియా)తో సింధు తలపడనుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాదే జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో చౌరున్నిసాతో ఆడిన సింధు వరుస గేముల్లో గెలుపొందింది. ఈ సీజన్లో సింధు మొత్తం ఆరు టోర్నమెంట్లలో బరిలోకి దిగింది. కానీ ఏ టోర్నమెంట్లోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 23 ఏళ్ల సింధు ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో... ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్లో... ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్లో... మలేసియా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో... సింగపూర్ ఓపెన్‌లో సెమీఫైనల్లో... ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ఈ ఆరు టోర్నమెంట్లలోనూ సింధును వేర్వేరు క్రీడాకారిణులు ఓడించడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అంతగా సులువైన ‘డ్రా’ ఎదురుకాలేదు. తొలి రౌండ్ అడ్డంకిని ఆమె దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) లేదా పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)లలో ఒకరితో ఆడాల్సి ఉంటుంది. ర్యాంకింగ్ పరంగా సింధుకంటే వెనుకలో ఉన్నప్పటికీ థాయ్‌లాండ్ క్రీడాకారిణులు తమదైన రోజున సంచలన ఫలితాలు సాధించే సత్తాగలవారే. ఈ అవరోధాన్ని సింధు అధిగమిస్తే క్వార్టర్ ఫైనల్లో 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా) లేదా ప్రపంచ 17వ ర్యాంక్ సయాక తకహాషి (జపాన్) ఎదురయ్యే అవకాశముంది. క్వార్టర్ ఫైనల్‌నూ దాటితే సింధుకు సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా) ప్రత్యర్థిగా ఉండవచ్చు. మరో పార్శ్వం నుంచి సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా), టాప్ సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్) సెమీఫైనల్ చేరుకునే అవకాశముంది. పురుషుల సింగిల్స్ విభాగంలో నలుగురు భారత క్రీడాకారులు నేరుగా మెయిన్ ‘డ్రా’లో పోటీపడుతున్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చైనా దిగ్గజం లిన్ డాన్‌తో హెచ్ఎస్ ప్రణయ్... సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో పారుపల్లి కశ్యప్... లీ జి జియా (మలేసియా)తో సమీర్ వర్మ... లీ డాంగ్ కెయున్ (కొరియా)తో భమిడిపాటి సాయిప్రణీత్ ఆడతారు. -
ముంబై రాకెట్స్ దూకుడు
పుణే: ఉత్కంఠగా సాగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన ముంబై రాకెట్స్ 5–2తో అవధ్ వారియర్స్‌పై గెలిచింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో తమ ఖాతాలో రెండో విజయం నమోదు చేసుకుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లనే ‘ట్రంప్’గా ఎంచుకున్నాయి. మహిళల సింగిల్స్‌లో బీవెన్ జాంగ్ (అవధ్) 15–10, 15–10 తేడాతో శ్రేయాన్షి పరదేశి (ముంబై)పై నెగ్గి జట్టును 2–0 ఆధిక్యంలో నిలిపింది. అనంతరం పురుషుల డబుల్స్‌ను ముంబై ‘ట్రంప్’గా ఎంచుకుంది. లియాంగ్ డె–కిమ్ జి జంగ్ జోడీ 15–7, 15–9తో లి చాంగ్ వి–ఎంఆర్ అర్జున్ జంటపై గెలుపొందింది. స్కోర్లు 2–2తో సమంగా నిలిచిన ఈ స్థితిలో పురుషుల సింగిల్స్ హోరాహోరీగా సాగాయి. తొలి మ్యాచ్‌లో ఆండర్స్ ఆంటోన్సెన్ (ముంబై) 6–15, 15–11, 15–14తో సన్ వాన్ హోపై, రెండో మ్యాచ్‌లో సమీర్ వర్మ (ముంబై) 15–11, 8–15, 15–11తో లీ డాంగ్ కుయెన్‌పై శ్రమించి నెగ్గారు. దీంతో 4–2తో ఫలితం తేలిపోయింది. నామమాత్రంగా మారిన మిక్స్డ్ డబుల్స్‌లోనూ ముంబై పట్టు విడవలేదు. కిమ్ జి జంగ్–పియా బెర్నాడెత్ జంట 15–10, 7–15, 15–13తో అశ్విని పొన్నప్ప–మథియాస్ క్రిస్టియన్‌సెన్‌లపై జయభేరి మోగించింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్‌తో నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ తలపడుతుంది. -
‘బిచ్చగాడు’లా హిట్ అవ్వాలి
‘‘మా సంస్థ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన అన్ని సినిమాలకంటే వైవిధ్యంగా ‘కర్త కర్మ క్రియ’ ఉండబోతోంది. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురి చేసేలా ఉంటుంది. ట్రైలర్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో సినిమా అంతకుమించి ఉంటుంది’’ అని సమర్పకులు చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. వసంత్ సమీర్, సెహర్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ‘వీకెండ్ లవ్’ ఫేం నాగు గవర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కర్త కర్మ క్రియ’. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసిన అనంతరం చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నాగు గవర కథ చెప్పిన దాని కంటే ది బెస్ట్‌గా ఈ సినిమాను బాధ్యతగా తీశారు. మా బ్యానర్లో సూపర్ హిట్ అయిన ‘బిచ్చగాడు’ సినిమా తరహాలో ‘కర్త కర్మ క్రియ’ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కథ ఇది. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఉంటుంది. పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి ఈ సినిమాను పూర్తి చేశాం. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెర కెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నాగు గవర. ‘‘ఓ మంచి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’’ అని వసంత్ సమీర్, సెహర్ అన్నారు. -
సింధుకు చుక్కెదురు
ఓడెన్స్: కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తూ... పలు టోర్నీలలో ఫైనల్‌కు చేరుకొని తుది పోరులో తడబడుతోన్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు డెన్మార్క్ ఓపెన్‌లో మాత్రం నిరాశ ఎదురైంది. చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్ పోరాట పటిమ ముందు సింధు చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 17–21, 21–16, 18–21తో ప్రపంచ పదో ర్యాంకర్ బీవెన్ జాంగ్ చేతిలో ఓడిపోయింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో చెరో గేమ్ గెలిచాక... నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు రెండుసార్లు 13–12తో... 15–13తో స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే బీవెన్ జాంగ్ వెంటనే తేరుకొని వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17–15తో ముందంజ వేసింది. అదే జోరులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. బీవెన్ జాంగ్ చేతిలో సింధు ఓడిపోవడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఇండియా ఓపెన్ ఫైనల్లో, 2017 ఇండోనేసియా ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనూ బీవెన్ జాంగ్ చేతిలో సింధుకు పరాజయం ఎదురైంది. వచ్చే వారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ తొలి రౌండ్లో బీవెన్ జాంగ్తోనే సింధు తలపడనుంది. గతేడాది అక్టోబరు 18న డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో చెన్ యుఫె (చైనా) చేతిలో ఓడిపోయాక ఈ హైదరాబాద్ అమ్మాయికి మళ్లీ డెన్మార్క్ ఓపెన్లోనే తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. అయితే ఈ ఏడాది కాలంలో సింధు హాంకాంగ్ ఓపెన్, వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్, థాయ్‌లాండ్ ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్, ఇండియా ఓపెన్లలో ఫైనల్లోకి చేరి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ హోరాహోరీ పోరులో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ప్రపంచ 24వ ర్యాంకర్ యి ఎన్గాన్ చెయుంగ్ (హాంకాంగ్)తో 81 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 20–22, 21–17, 24–22తో విజయం సాధించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 20–21తో, 21–22తో రెండుసార్లు పరాజయం అంచున నిలిచింది. అయితే కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా పాయింట్లు సాధించి గట్టెక్కింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సైనా తలపడుతుంది. సమీర్ సంచలనం పురుషుల సింగిల్స్ విభాగంలో సమీర్ వర్మ సంచలనం సృష్టించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ షు యుకి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–17, 21–18తో గెలుపొందాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి 23–25, 21–18, 16–21తో కిమ్ యాస్‌ట్రప్–ఆండెర్స్ (డెన్మార్క్) చేతిలో... మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప 17–21, 18–21తో సియో సెయుంగ్ జే–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయారు. -
చిరంజీవిగారు మా సినిమాను మెచ్చుకున్నారు
‘‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమా టీజర్‌ని చిరంజీవిగారు విడుదల చేయడం వల్లే మా సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. మా సినిమాకి అలీగారు యాడ్ అయినప్పటి నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది’’ అని డైరెక్టర్ గౌతమ్ రాజ్‌కుమార్ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. మొహమ్మద్ అలీ సమర్పణలో రమా గౌతమ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. గౌతమ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ బ్యాగ్రౌండ్లో పనిచేస్తున్న వ్యక్తులను తీసుకుని దొంగలు అనే కాన్సెప్ట్‌ని యాడ్ చేశాం. అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ చుట్టూ సాగే కథ కాదిది. మంచి కాన్సెప్ట్ ఉండడం వల్లే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సెలెక్ట్ అయింది. చిరంజీవిగారు కేవలం అలీగారి కోసమే మా సినిమా మొత్తం చూసి, బాగుందని మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. స్టార్ హీరోలున్నంత మాత్రాన సినిమా చూడరు. కొత్త హీరోలైనా సినిమా బావుంటే చూస్తున్నారు. ఈ చిత్రకథ డార్క్ జానర్ కావడంతో సహజంగా రామ్‌గోపాల్ వర్మగారే గుర్తొస్తారు. అందుకే అలీగారు నన్ను వర్మగారితో పోల్చి ఉంటారు’’ అన్నారు. -
ట్రైలర్ చాలా బాగుంది
ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, ఫృథ్వీరాజ్, సమీర్, లోహిత్ ముఖ్య తారలుగా గౌతమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. అలీ సమర్పణలో సారా క్రియేషన్స్ పతాకపంపై రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు చిరంజీవి రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నా చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ముందు అలీ నా దగ్గరికి వచ్చి ఖయ్యూమ్ నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నాను. కానీ ట్రైలర్ చూశాక అర్థం అయ్యింది.. ఇది సీరియస్ మూవీ అని. ఈ సినిమా ఖయ్యూమ్కు కచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అతని కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. మొదటి సినిమా అయినప్పటికీ మంచి అనుభం ఉన్న దర్శకునిలా గౌతమ్ హ్యాండిల్ చేసాడని అనిపిస్తుంది. ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉంది. పిల్లల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాతో గౌతమ్ ఒక మంచి సందేశాన్ని అందిస్తాడని భావిస్తున్నాను. అలాగే కొత్త అమ్మాయి తనిష్క కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించిందని అర్థం అవుతోంది. ఖయ్యూమ్, గౌతమ్‌లతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. గిరిధర్, ‘జబర్దస్త్’ రాఘవ, తడివేలు తదితరులు నటించిన ఈ సినిమాకు సంతోష్ డొంకాడ, సెలెబ్ కనెక్ట్ ప్రతినిథులు సహ–నిర్మాతలు. -
సిటీకి ఉగ్రవాది సమీర్
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన (ఎల్ఈటీ) ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ సమీర్ అలియాస్ నయ్యూను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు సిటీకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఇతడిపై నాంపల్లి కోర్టు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ జారీ చేసింది. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడంలో దిట్టగా సమీర్‌కు పేరుంది. సాక్షి, సిటీబ్యూరో: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబాకు చెందిన (ఎల్ఈటీ) ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ సమీర్ అలియాస్ నయ్యూను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు సిటీకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సమీర్‌పై నాంపల్లి కోర్టు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ జారీ చేసింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడంలో దిట్టగా పేరున్న సమీర్ 2007లో ఉత్తర మండలంలోని మహంకాళి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆపై 2014లో కోల్‌కతా పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇతడిని తీసుకురావడానికి పటిష్టమైన ఎస్కార్ట్‌ను ఢిల్లీ పంపినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఇతడిని 2007 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ సరిహద్దులు దాటుతుండగా బీఎస్ఎఫ్ అధికారులు వెస్ట్ బెంగాల్లో పట్టుకున్నారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు సమీర్ మరో అయిదుగురితో కలిసి ఆపరేషన్ ‘మాద్రా’ కోసం వస్తున్నట్లు గుర్తించారు. అదే ఏడాది మే 18న నగరంలోని మక్కా మసీదులో చోటు చేసుకున్న పేలుడు కేసులోనూ అనుమానితుడిగా మారాడు. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు విభాగం పీటీ వారెంట్‌పై 2007 జూన్ 6న ఇక్కడికి తీసుకువచ్చింది. విచారణ నేపథ్యంలోనే గతంలో కొన్నాళ్ల పాటు నగరంలో ఉన్న సమీర్ తన సహచరులు షోయబ్ జాగిర్దార్, ఇమ్రాన్, రఫీయుద్దీన్లతో కలిసి తప్పుడు పత్రాలతో పాస్‌పోర్ట్ పొందడానికి ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడంతో మరో కేసు నమోదు చేశారు. తదుపరి విచారణలో నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో సిట్‌లో మరో కేసు (ఎఫ్ఐఆర్ నెం.100/2007) నమోదు చేసిన పోలీసులు కస్టడీలో ఉన్న సమీర్‌ను మహంకాళి ఠాణాలో ఉంచి విచారించారు. ఈ నేపథ్యంలోనే అతను 2007 జూన్ 18న అదును చూసుకుని తప్పించుకుని, పారిపోవడానికి ప్రయత్నించిన ఇతగాడిని వెంటాడిన అధికారులు కాస్తా దూరంలోనే పట్టుకున్నారు. దీనిపై మహంకాళి ఠాణాలో కేసు నమోదైంది. 2013 జూన్‌లో ఈ ఎస్కేప్ కేసు, ఏప్రిల్‌లో పాస్‌పోర్ట్ కేసు కోర్టులో వీగిపోయాయి. సమీర్‌పై దేశ వ్యాప్తంగా అనేక కేసులు నమోదై ఉండటంతో అయా పోలీసులు పీటీ వారెంట్లపై తరలిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కోల్‌కతా పోలీసులు 2014 సెప్టెంబర్ 24న ముంబై కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి తిరిగి హౌరా–ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతాకు తీసుకువెళ్తుండగా... ఖర్సియా–శక్తి రైల్వేస్టేషన్ల మ«ధ్య తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయ్యూను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు 2017 నవంబర్‌లో లక్నోలో పట్టుకున్నారు. ఆపై విచారణ నిమిత్తం సమీర్‌ను ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. నగరంలోని సిట్‌లో నమోదైన కేసులో ట్రయల్ నిర్వహించాల్సి ఉండటంతో అధికారులు నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకున్నారు. దీని ఆధారంగా సమీర్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీ నుంచి గురువారం రాత్రి సిటీకి తరలించారు. శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. ఆపై తదుపరి విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. -
నేను పెద్ద స్టార్ అవుతానన్నారు
‘‘టి. కృష్ణగారి ‘దేశంలో దొంగలుపడ్డారు’ సినిమాలో వేషం కోసం వెళ్లా. ‘నీ ఫేస్ కామెడీగా ఉంటుంది.. పైగా చిన్నపిల్లాడివి.. నువ్వు చచ్చిపోయే పాత్ర చేస్తే జనాలు నవ్వుతారు.. వద్దు.. అన్నారు. ‘ఏ రోజుకైనా ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు’ అని ఆయన తన స్నేహితులతో ఆ రోజే చెప్పారట’’ అని నటుడు అలీ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మించిన ఈ సినిమాకి అలీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘టి.కృష్ణగారి స్నేహితుడు నాగేశ్వరరావుగారు ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో తీసిన ‘అమ్మాయి కాపురం’ సినిమాకు నాకు ఉత్తమ కథానాయకుడిగా అవార్డు వచ్చింది. ‘దేశంలో దొంగలుపడ్డారు’ కోసం కొన్నాళ్లు భోజనం కూడా సరిగా లేకుండా పని చేశానని నా తమ్ముడు ఖయ్యూమ్ చెప్పాడు. వాడి కోసమే ఈ సినిమా చూశా. గౌతమ్ రాజ్‌కుమార్ కొత్త దర్శకుడైనా తనని చూస్తే 30 ఏళ్లకు ముందు రామ్‌గోపాల్ వర్మను చూసినట్టు అనిపించింది’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ తెరకెక్కించాం. విడుదలకు ముందే మా సినిమా బ్లాక్ బెర్రీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అన్నారు గౌతమ్ రాజ్‌కుమార్. ఖయ్యూమ్, సహ నిర్మాత సంతోష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికుమార్ పాలకుర్తి, సహ నిర్మాతలు: సంతోష్ డొంకాడ, సెలెట్ కనెక్ట్స్. -
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో...
‘‘స్టార్ హీరోలు ఉన్న సినిమాలనే చూడాలని ఇప్పటి ప్రేక్షకులు అనుకోవడంలేదు. కొత్త కథలతో వచ్చే సినిమాలనూ ఆదరిస్తున్నారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని కాకుండా బాగున్న సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నిదర్శనం ‘క్షణం, పెళ్లి చూపులు, ఆర్ఎక్స్ 100’ వంటి చిత్రాలు. మా ‘దేశంలో దొంగలు పడ్డారు’ చిత్రం ఈ కోవకు చెందినదే’’ అని గౌతమ్ రాజ్‌కుమార్ అన్నారు. ఖయూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీరాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రలలో రమా గౌతమ్ నిర్మించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూఎస్‌లోని మిల్‌ఫోర్డ్‌లో జరగనున్న ‘బ్లాక్ బీర్’ ఫిల్మ్ ఫెసివల్‌కి ఎంపికైంది. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తీసిన చిత్రం ఇది. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందిన బ్లాక్ బీర్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అధికారికంగా నామినేట్ కావడం హ్యాపీగా ఉంది. అక్టోబర్‌లో జరిగే ఈ చిత్రోత్సవాల్లో పలు అంతర్జాతీయ చిత్రాల మధ్య మా సినిమా ప్రదర్శితం అవుతుంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ.