
అలీ, చిరంజీవి, ఖయ్యూమ్, గౌతమ్
ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, ఫృథ్వీరాజ్, సమీర్, లోహిత్ ముఖ్య తారలుగా గౌతమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. అలీ సమర్పణలో సారా క్రియేషన్స్ పతాకపంపై రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు చిరంజీవి రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నా చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ముందు అలీ నా దగ్గరికి వచ్చి ఖయ్యూమ్ నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నాను. కానీ ట్రైలర్ చూశాక అర్థం అయ్యింది.. ఇది సీరియస్ మూవీ అని. ఈ సినిమా ఖయ్యూమ్‌కు కచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది.
అతని కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. మొదటి సినిమా అయినప్పటికీ మంచి అనుభం ఉన్న దర్శకునిలా గౌతమ్ హ్యాండిల్ చేసాడని అనిపిస్తుంది. ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉంది. పిల్లల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాతో గౌతమ్ ఒక మంచి సందేశాన్ని అందిస్తాడని భావిస్తున్నాను. అలాగే కొత్త అమ్మాయి తనిష్క కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించిందని అర్థం అవుతోంది. ఖయ్యూమ్, గౌతమ్‌లతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. గిరిధర్, ‘జబర్దస్త్’ రాఘవ, తడివేలు తదితరులు నటించిన ఈ సినిమాకు సంతోష్ డొంకాడ, సెలెబ్ కనెక్ట్ ప్రతినిథులు సహ–నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment