desam lo dongalu paddaru
-
చిరంజీవిగారు మా సినిమాను మెచ్చుకున్నారు
‘‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమా టీజర్‌ని చిరంజీవిగారు విడుదల చేయడం వల్లే మా సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. మా సినిమాకి అలీగారు యాడ్ అయినప్పటి నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది’’ అని డైరెక్టర్ గౌతమ్ రాజ్‌కుమార్ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. మొహమ్మద్ అలీ సమర్పణలో రమా గౌతమ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. గౌతమ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ బ్యాగ్రౌండ్లో పనిచేస్తున్న వ్యక్తులను తీసుకుని దొంగలు అనే కాన్సెప్ట్‌ని యాడ్ చేశాం. అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ చుట్టూ సాగే కథ కాదిది. మంచి కాన్సెప్ట్ ఉండడం వల్లే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సెలెక్ట్ అయింది. చిరంజీవిగారు కేవలం అలీగారి కోసమే మా సినిమా మొత్తం చూసి, బాగుందని మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. స్టార్ హీరోలున్నంత మాత్రాన సినిమా చూడరు. కొత్త హీరోలైనా సినిమా బావుంటే చూస్తున్నారు. ఈ చిత్రకథ డార్క్ జానర్ కావడంతో సహజంగా రామ్‌గోపాల్ వర్మగారే గుర్తొస్తారు. అందుకే అలీగారు నన్ను వర్మగారితో పోల్చి ఉంటారు’’ అన్నారు. -
ట్రైలర్ చాలా బాగుంది
ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, ఫృథ్వీరాజ్, సమీర్, లోహిత్ ముఖ్య తారలుగా గౌతమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. అలీ సమర్పణలో సారా క్రియేషన్స్ పతాకపంపై రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు చిరంజీవి రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నా చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ముందు అలీ నా దగ్గరికి వచ్చి ఖయ్యూమ్ నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నాను. కానీ ట్రైలర్ చూశాక అర్థం అయ్యింది.. ఇది సీరియస్ మూవీ అని. ఈ సినిమా ఖయ్యూమ్కు కచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అతని కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. మొదటి సినిమా అయినప్పటికీ మంచి అనుభం ఉన్న దర్శకునిలా గౌతమ్ హ్యాండిల్ చేసాడని అనిపిస్తుంది. ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉంది. పిల్లల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాతో గౌతమ్ ఒక మంచి సందేశాన్ని అందిస్తాడని భావిస్తున్నాను. అలాగే కొత్త అమ్మాయి తనిష్క కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించిందని అర్థం అవుతోంది. ఖయ్యూమ్, గౌతమ్‌లతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. గిరిధర్, ‘జబర్దస్త్’ రాఘవ, తడివేలు తదితరులు నటించిన ఈ సినిమాకు సంతోష్ డొంకాడ, సెలెబ్ కనెక్ట్ ప్రతినిథులు సహ–నిర్మాతలు. -
చిరు చేతుల మీదుగా ‘దేశంలో దొంగలు పడ్డారు’ ట్రైలర్
స్టార్ కమెడియన్ ఆలీ తమ్ముడు ఖయూమ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం దేశంలో దొంగలు పడ్డారు. కమెడియన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఖయూమ్ తాజాగా హీరోగా మారి చేస్తోన్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. “దేశంలో దొంగలు పడ్డారు' ట్రైలర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషం. దీనికి కారణం నా చిరకాల మిత్రుడు అలీ సోదరుడు ఖయ్యూం ఇందులో ప్రధాన పాత్ర పోషించడం చూసి నాకు ఓ గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ ఫస్ట్‌టైమ్ డైరెక్ట్ చేస్తున్నప్పటికీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఓ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నట్లుగా అనిపించింది. ట్రైలర్ ఇంప్రెస్సీవ్ గా ఉంది. ముందుగా అలీ నాదగ్గరికి వచ్చి ఖయ్యూం నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నాను, గానీ ఇది ఒక సీరియస్ సినిమా అని ట్రైలర్ చూసాక అర్థం అయ్యింది. ఇది ఖయ్యూంకు ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. తన కెరియర్‌కు ఇది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. అలాగే కొత్త అమ్మాయి తనిష్క కూడా పెరఫార్మర్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించిందని అర్థం అవుతుంది.. ఈ సందర్భంగా యూనిట్‌కు సంబంధించిన టెక్నీషియన్ సభ్యులందరికీ, అలాగే మా ఖయ్యూం కి ఆల్ ది వెరీ బెస్ట్, గౌతమ్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను’ అని అన్నారు.