Shani
-
షాని సల్మాన్ తో సాక్షి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
-
Bigg Boss6: షానీ ఔట్.. మాట లేదు, ఆటా లేదు..ఇంత సాదాసీదా వీడ్కోలా?
బిగ్‌బాస్ ఇంట్లో మొదటి వారం కూల్‌గా ఉండి కంటెస్టెంట్స్‌తో సరదాగా ఆటలు ఆడించిన హోస్ట్ నాగార్జున..రెండో వారం మాత్రం ఫుల్ ఫైర్ అయ్యాడు. మీరంతా టైంపాస్‌కి, రిలాక్స్ అవ్వడానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చారా? అంటూ కంటెస్టెంట్స్‌పై మండిపడ్డాడు. అంతేకాదు ఆట ఆడకపోతే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండలేరని వార్నింగ్ ఇచ్చాడు. ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేయడమే మీ ప్రధాన కర్తవ్యం అని ఇంటి సభ్యులకు హితబోధ చేశాడు. చివరకి ఇంటి నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించాడు. హాలులో కూర్చున్న 20 మంది కంటెస్టెంట్స్‌లో బాలాదిత్య, షానీ, వాసంతి, సుదీప, శ్రీసత్య, రోహిత్ అండ్ మెరీనా, అభినయ, కీర్తి, శ్రీహాస్లను సోఫా బయట నిలబెట్టాడు. ఆ తర్వాత ఒక్కోక్కరి ఆట తీరుని వివరిస్తూ గట్టి క్లాస్ తీసుకున్నాడు. మొదటగా ఫైమా ఆట తీరు గురించి మాట్లాడుతూ.. నీ ఆట బాగుందని అనుకుంటున్నావా? అని అడిగాడు. అప్పుడు ఫైమా నేను బాగానే ఆడుదాము అనుకున్నాను కానీ నా కాలు సహకరించలేదు. అందుకే ఆడలేకపోయాను అని చెప్పగా...‘నీ కాలు కాదు నీ మైండ్ పనిచేయడం లేదు’అని నాగ్ ఫైర్ అయ్యాడు. నువ్ గెలవడానికి ఆడతావా లేదా పక్కన వాళ్లని ఓడించడానికా? రేవంత్‌కు నువ్ సాయం చేయకపోయినా.. రేవంత్ నీకు సాయం చేశాడు.సంచాలక్‌గా రేవంత్ నిన్ను టాస్క్ నుంచి డిస్క్వాలిఫై చేస్తే బాధెందుకు? సంచాలక్‌గా రేవంత్ తప్పుచేశాడా? నిన్ను గెలిపించిన వ్యక్తి నిన్ను ఎందుకు తప్పిస్తాడు? నీ ఆట తీరు బాగాలేదు. నువ్వు ఆడుతుంటే మాకు ఒక పులి కనబడాలి. స్ట్రాటజీ పేరుతో నిన్ను నువ్వు మోసం చేసుకోకు’అని నాగ్ సూచించాడు. చంటి గురించి మాట్లాడుతూ.. కెప్టెన్సీ టాస్క్ అనేది ఎంత ముఖ్యమైనదో తెలుసు కదా? ఎందుకు అంత ఈజీగా తీసుకున్నావ్? కెప్టెన్సీ టాస్క్ అంటే ఇమ్యునిటీ అనేది నీకు అర్థం కాలేదా? నువ్వు చేస్తున్న కామెడీ బాగుంది. కానీ నీ ఆటతీరు మాత్రం ఎక్కడో లోతులో నూతిలో ఉంది. నవ్వించడమే కాదు ఆట కూడా బాగా ఆడాలి’అని క్లాస్ పీకాడు. సూర్య నీకు బయట చాలా పనులు ఉంటాయి కదా? యాక్టింగ్,రైటింగ్..ఇలా ఫుల్ బిజీగా ఉంటావ్ కదా? ఏంటి మా బిగ్‌బాస్ హౌస్‌కి చిల్ అవ్వడానికి వచ్చావా? హాలిడేలాగా ఉందా? అందరికి కావాల్సింది వండేస్తే చాలు మార్కులు పడిపోతాయి అనుకుంటున్నావా? బిగ్‌బాస్ ఆట అంత సింపుల్ కాదు.నీకు వచ్చిన అవకాశం కోసం నువ్వు పోరాటం చేయకపోతే మళ్లీ నీకు ఆ అవకాశం రాదు. అప్పుడు నువ్వు చిల్ కావొచ్చు అని చురకలు అంటిచాడు. రేవంత్ గురించి చెబుతూ.. కోపం తగ్గించుకున్నావ్ కానీ పక్కన వాళ్లకి సలహాలు, నీతులు చెప్పకు. నువ్వేమైనా తోపువా? బొట్టు పెట్టుకుంటే.. నచ్చుతారు.. ఇలా తయారవ్వాలి.. మనుషులు ఇలా ఉండాలి.. అని చెబుతున్నావ్.. అందరినీ కరెక్ట్ చేయడం ఆపేయ్.. నిన్ను నువ్ కరెక్ట్ చేసుకో.. నీ స్నేహితులతో చేసే ఫన్ బాగుంటుంది కానీ దానికిఒక హద్దు ఉంటుంది. అందరినీ దగ్గరకు చేసుకుందామని వచ్చావ్.. దూరం చేసుకోవడానికి కాదు.వాళ్లు దగ్గరైతే మా ఆడియన్స్ కూడా దగ్గరవుతావు. లాస్ట్ వీక్ ఆట మాత్రం ఇరగదీశావ్.. కసి ఉంది కదా? కంటిన్యూ చేయ్.. కోపం తీసేయ్.. కసి ఉంచు. నిన్వు ఓడించిన వ్యక్తి(ఫైమా) కోసం ఆడి ఆమెను గెలిపించావ్ చూడు..దానితో నీ గ్రోత్ పెరిగిపోయింది’అని నాగ్ అన్నాడు. నేహా.. స్పోర్ట్స్‌లో ఎన్ని గాయాలు తగులుతాయో తెలుసు కదా? బిగ్‌బాస్ షో అంటే నీకు చులకనా? ఇనయా, ఫైమా, రేవంతలకు కూడా నీలాగే దెబ్బలు తగిలాయి. వాళ్లు ఆడలేదా? వచ్చేవారం నుంచైనా నవ్వు బాగా ఆడాలి అని నాగ్ సూచించాడు. అర్జున్ నువ్ మాత్రం.. రేవంత్ నా గురించి అదన్నాడు.. ఇదన్నాడు.. తప్పా.. ఇంకేం ఆడటం లేదు.. వారంలో ప్రతీ రోజూ పడుకునే ఉన్నావ్.. కూర్చుని కంప్లైంట్ చెప్పడానికి వచ్చావా?.. గేమ్ మీద దృష్టి పెట్టు అని గడ్డిపెట్డాడు. ఆరోహి నువ్వు ఒక్కోసారి బ్రెయిన్ వాడతావు.నలుగురు ఆడపిల్లలు కలిసి ఆడినప్పుడు మన టార్గెట్ అర్జున్ అని చెప్పి అతన్ని రింగ్ నుంచి బయటకు తోశావ్ కదా?. మరి అదే విషయాన్ని రేవంత్ అంటే ఎందుకు ఎమోషనల్ అయ్యావ్? నీ ఆటకు నువ్ 70 మార్కులు ఇచ్చుకున్నావ్.. నేను 50 మార్కులే ఇస్తా’అని నాగ్ అన్నాడు గీతూపై నాగ్ ప్రశంసలు కురిపించాడు. ఆమె ఆటకు వందకు రెండువందల మార్కులు ఇస్తానని చెప్పగా.. ‘మీరు చూసింది 20 శాతం.. ఇంకా భయంకరంగా ఉంది సర్’ అని గీతూ అంది.అవునా.. మరి ఎందుకమ్మా నీ బొమ్మను కాపాడుకోలేకపోయావ్ అని కౌంటర్ ఇచ్చాడు. తాడిని తన్నేవాడు ఒకడుంటే.. తలను తన్నేవాడుంటాడు.. అని రేవంత్ చెప్పిన డైలాగ్ గుర్తు చేస్తాడు. ఇనయ.. ఆటలోకి వచ్చావ్.. బాగా ఆడావ్.. మనుషుల సపోర్ట్ లేదని బాధపడకు.. అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. రాజ్.. నువ్ అడుక్కుని కెప్టెన్ అయ్యావ్.. కెప్టెన్ అయిన తీరు కరెక్ట్ కాదు. జాలి కరుణతో అయ్యావ్.. ఓడినా పర్లేదు.. గెలుపు అడుక్కుంటే బాగుండదు.. సెల్ఫ్ సింపతీ వర్కౌట్ కాదు.. నీలో శక్తి ఉంది.. ఇక వేళ బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటే కెప్టెన్‌గా వచ్చే వారం ఏం ప్రూవ్ చేసుకుంటావో చూస్తాం’అన్నాడు ఇక మిగిలిన తొమ్మింది మందిలో ఎవరు వేస్ట్ అనేది ఓటింగ్ ద్వారా చెప్పమని మిగతా 11 మంది కంటెస్టెంట్స్‌ని కోరాడు నాగ్. వారిలో శ్రీసత్య, వాసంతి, షానీలకు మూడు మూడు ఓట్లు పడ్డాయి. ఇక ఇంటి సభ్యుల ఓటింగ్, ఆడియెన్స్ ఓటింగ్లతో మ్యాచ్ అయిందని షానీని ఎలిమినేట్ చేశారు. అయితే అతన్ని గత సీజన్ల మాదిరిగా కాకుండా సాదాసీదాగా బయటకు పంపించారు. స్టేజ్ మీద అతని జర్నీ వీడియోను చూపించలేదు. కంటెస్టెంట్స్‌తో మాట్లాడించలేదు. ఒక టాస్క్ ఇవ్వలేదు. అతని అనుభవాలను పంచుకోనివ్వలేదు. చాలా సింపుల్‌గా హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఇక ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యే రెండో వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది. తాజా సమాచారం ప్రకారం..అభినయశ్రీ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. -
నల్లగా ఉండటం కూడా ఒక ఎసెట్.. బ్లాక్ స్టార్ అని పిలుస్తారు: నటుడు
బ్లాక్‌స్టార్‌గా తెలుగు చిత్రపరిశ్రమకు సుపరిచితుడైన షానీ నటించిన రామ్ అసుర్ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయం తన జీవితంలో ఎంతో కీలకమని, బయట ఎక్కడకు వెళ్లినా తనను శివన్నా అంటూ ప్రేక్షకులు ఆప్యాయంగా పలకరిస్తున్నారిని షానీ అన్నాడు. తన జర్నీ గురించి మాట్లాడుతూ.. ఓసారి హైదరాబాద్‌లో అథ్లెటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు కావాలని యాడ్ చూశాను. స్వతహాగా స్పోర్ట్స్‌మెన్ కావడంతో దరఖాస్తు చేసుకున్నాను. 2003లో ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు అది రాజమౌళి గారి సినిమా కోసం ఆడిషన్స్ యాడ్ అని తెలిసింది. ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు రాజమౌళి గారు ఎంతో ఆప్యాయంగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడి భుజం తట్టి ప్రోత్సహించారు. లుక్ వెరైటీగా ఉండటంతో అవకాశం కల్పించారు. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సై షాని గా పిలవడం మొదలుపెట్టారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. ఘర్షణ, దేవదాస్, హ్యాపీ, రెడీ, ఒక్క మగాడు, శశిరేఖా పరిణయం సహా ఇప్పటివరకు 70 సినిమాల్లో నటించగా వాటిలో 30 సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. నల్లగా ఉండటం కూడా ఒక ఎసెట్.. స్నేహితులు నన్ను ముద్దుగా తనను బ్లాక్ స్టార్ అని పిలుస్తారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లో కూడా నటించాను. బాలీవుడ్లో వెల్కం టూ సజ్జన్‌పూర్ చిత్రంలో మంచి పాత్ర పోషించాను. డిసెంబర్లో నేను నటించిన కిన్నెరసాని, అమరన్, గ్రే, పంచతంత్ర కథలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అని వివరించారు. -
ట్రైలర్ చాలా బాగుంది
ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, ఫృథ్వీరాజ్, సమీర్, లోహిత్ ముఖ్య తారలుగా గౌతమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. అలీ సమర్పణలో సారా క్రియేషన్స్ పతాకపంపై రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు చిరంజీవి రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నా చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ముందు అలీ నా దగ్గరికి వచ్చి ఖయ్యూమ్ నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నాను. కానీ ట్రైలర్ చూశాక అర్థం అయ్యింది.. ఇది సీరియస్ మూవీ అని. ఈ సినిమా ఖయ్యూమ్కు కచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అతని కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. మొదటి సినిమా అయినప్పటికీ మంచి అనుభం ఉన్న దర్శకునిలా గౌతమ్ హ్యాండిల్ చేసాడని అనిపిస్తుంది. ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉంది. పిల్లల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాతో గౌతమ్ ఒక మంచి సందేశాన్ని అందిస్తాడని భావిస్తున్నాను. అలాగే కొత్త అమ్మాయి తనిష్క కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించిందని అర్థం అవుతోంది. ఖయ్యూమ్, గౌతమ్‌లతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. గిరిధర్, ‘జబర్దస్త్’ రాఘవ, తడివేలు తదితరులు నటించిన ఈ సినిమాకు సంతోష్ డొంకాడ, సెలెబ్ కనెక్ట్ ప్రతినిథులు సహ–నిర్మాతలు. -
నేను పెద్ద స్టార్ అవుతానన్నారు
‘‘టి. కృష్ణగారి ‘దేశంలో దొంగలుపడ్డారు’ సినిమాలో వేషం కోసం వెళ్లా. ‘నీ ఫేస్ కామెడీగా ఉంటుంది.. పైగా చిన్నపిల్లాడివి.. నువ్వు చచ్చిపోయే పాత్ర చేస్తే జనాలు నవ్వుతారు.. వద్దు.. అన్నారు. ‘ఏ రోజుకైనా ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు’ అని ఆయన తన స్నేహితులతో ఆ రోజే చెప్పారట’’ అని నటుడు అలీ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మించిన ఈ సినిమాకి అలీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘టి.కృష్ణగారి స్నేహితుడు నాగేశ్వరరావుగారు ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో తీసిన ‘అమ్మాయి కాపురం’ సినిమాకు నాకు ఉత్తమ కథానాయకుడిగా అవార్డు వచ్చింది. ‘దేశంలో దొంగలుపడ్డారు’ కోసం కొన్నాళ్లు భోజనం కూడా సరిగా లేకుండా పని చేశానని నా తమ్ముడు ఖయ్యూమ్ చెప్పాడు. వాడి కోసమే ఈ సినిమా చూశా. గౌతమ్ రాజ్‌కుమార్ కొత్త దర్శకుడైనా తనని చూస్తే 30 ఏళ్లకు ముందు రామ్‌గోపాల్ వర్మను చూసినట్టు అనిపించింది’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ తెరకెక్కించాం. విడుదలకు ముందే మా సినిమా బ్లాక్ బెర్రీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అన్నారు గౌతమ్ రాజ్‌కుమార్. ఖయ్యూమ్, సహ నిర్మాత సంతోష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికుమార్ పాలకుర్తి, సహ నిర్మాతలు: సంతోష్ డొంకాడ, సెలెట్ కనెక్ట్స్. -
చూడగానే ఇంప్రెస్ అయ్యా
‘‘దేశంలో దొంగలు పడ్డారు’ టైటిల్ ఆలోచింపజేసేలా ఉంది. టీజర్ నచ్చింది. చూడగానే ఇంప్రెస్ అయ్యా. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి యూనిట్‌కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్ రాజన్ జంటగా షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ముఖ్య తారలుగా గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఈ సినిమా టీజర్‌ని పూరి ఆవిష్కరించారు. గౌతమ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. ఉమెన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ తీశాం. ప్రస్తుత సమాజంలో జరుగుతోన్న విషయాలను ప్రస్తావించా. కథలో అన్ని ఎమోషన్స్ డిఫరెంట్ డైమెన్షన్లో కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘క్రైమ్ జానర్లో కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు రమా గౌతమ్. చిత్ర సహనిర్మాత సంతోష్ డొంకాడ, నటుడు ఖయ్యూమ్ పాల్గొన్నారు. -
శని మహిమలు చూడండి
శనీశ్వరుని మహిమల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శనిదేవుడు’. ‘చూడండి మహిమలు’ అనేది ఉపశీర్షిక. శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమన్, ఆకాశ్, శివ జొన్నలగడ్డ ఇందులో ప్రధాన పాత్రధారులు. నండూరి అనిల్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ పాటలకు మంచి స్పందన లభిస్తోందని శివ జొన్నలగడ్డ ఆనందం వెలిబుచ్చారు. ‘‘భారతదేశంలో శనిదేవునిపై వస్తున్న తొలి సినిమా ఇది. శనీశ్వరుణ్ణి పూజిస్తే ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయో తెలిపే సినిమా ఇది. విజయదశమి కానుకగా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్, సమర్పణ: గుద్దేటి బసవప్ప మేరు.