నల్లగా ఉండటం కూడా ఒక ఎసెట్‌.. బ్లాక్‌ స్టార్‌ అని పిలుస్తారు: నటుడు | Ram Asur Fame Sye Shani Latest Interview | Sakshi
Sakshi News home page

'రామ్ అసుర్'లో నా పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది

Published Tue, Nov 30 2021 1:34 PM | Last Updated on Tue, Nov 30 2021 1:54 PM

Ram Asur Fame Sye Shani Latest Interview - Sakshi

బ్లాక్‌స్టార్‌గా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు సుప‌రిచితుడైన షానీ న‌టించిన రామ్ అసుర్ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయం తన జీవితంలో ఎంతో కీలకమని, బయట ఎక్కడకు వెళ్లినా తనను శివన్నా అంటూ ప్రేక్షకులు ఆప్యాయంగా పలకరిస్తున్నారిని షానీ అన్నాడు. 

తన జర్నీ గురించి మాట్లాడుతూ.. ఓసారి హైదరాబాద్‌లో అథ్లెటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు కావాలని యాడ్‌ చూశాను. స్వతహాగా స్పోర్ట్స్‌మెన్ కావ‌డంతో దరఖాస్తు చేసుకున్నాను. 2003లో ఇంట‌ర్వ్యూకి వెళ్లిన‌ప్పుడు అది రాజమౌళి గారి సినిమా కోసం ఆడిషన్స్‌ యాడ్‌ అని తెలిసింది. ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు రాజమౌళి గారు ఎంతో ఆప్యాయంగా  ఎంతో ఆప్యాయంగా మాట్లాడి భుజం తట్టి ప్రోత్సహించారు.

లుక్‌ వెరైటీగా ఉండటంతో అవకాశం కల్పించారు. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో సై షాని గా పిలవడం మొదలుపెట్టారు. ఆ సినిమా సక్సెస్‌ కావడంతో మరిన్ని ఆఫర్స్‌ వచ్చాయి.  ఘ‌ర్ష‌ణ‌, దేవదాస్‌, హ్యాపీ, రెడీ, ఒక్క మ‌గాడు, శ‌శిరేఖా ప‌రిణ‌యం సహా ఇప్పటివరకు 70 సినిమాల్లో నటించగా వాటిలో 30 సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి.

నల్లగా ఉండటం కూడా ఒక ఎసెట్‌.. స్నేహితులు నన్ను ముద్దుగా తనను బ్లాక్‌ స్టార్‌ అని పిలుస్తారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లో కూడా నటించాను. బాలీవుడ్‌లో వెల్‌కం టూ స‌జ్జ‌న్‌పూర్ చిత్రంలో మంచి పాత్ర పోషించాను. డిసెంబర్‌లో నేను నటించిన  కిన్నెర‌సాని, అమ‌ర‌న్, గ్రే, పంచతంత్ర క‌థ‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అని వివరించారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement