
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల ఒడిశాలో ప్రారంభమైంది. మహేశ్‌బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి.
అలాగే మంగళవారం నుంచి ఈ షెడ్యూల్‌లో ప్రియాంకా చోప్రా కూడా పాల్గొంటున్నారని తెలిసింది. మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంకల కాంబినేషన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. కాగా ఈ సినిమా షూటింగ్‌లోని ఓ వీడియో బయటికొచ్చింది. దీంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలిసింది.
అలాగే ఈ చిత్రానికి మైథలాజికల్ టచ్ ఉందని, రామాయణంలోని కొన్ని ముఖ్య సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని, నేటి ఆధునిక కాలానికి అన్వయించి, ఈ కథను విజయేంద్రప్రసాద్ రెడీ చేశారని సమాచారం. కథలో కాశీ నగరానికి కూడా ప్రాముఖ్యత ఉందట... దాంతో కాశీ నగరాన్ని పోలిన సెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని భోగట్టా.
Comments
Please login to add a commentAdd a comment