మహేశ్‌బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్‌ ప్రారంభం | Mahesh Babu And SS Rajamouli SSMB29 Project Officially Launched | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్‌ ప్రారంభం

Published Thu, Jan 2 2025 11:32 AM | Last Updated on Thu, Jan 2 2025 11:51 AM

Mahesh Babu And SS Rajamouli SSMB29 Project Officially Launched

మహేశ్‌బాబు- ఎస్‌ఎస్‌ రాజమౌళి  కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న అత్యంత భారీ ప్రాజెక్ట్‌ సినిమా ప్రారంభమైంది . గురువారం హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అధికారికంగా 'SSMB 29' చిత్రాన్ని లాంచ్‌ చేశారు. చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కానీ,  ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న‍ట్లు తెలుస్తోంది.  భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇప్పటికే  ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్‌ నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌ కూడా ఇందులో భాగం కానున్నారు. అయితే, హీరోయిన్‌ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఒక వార్త భారీగా వైరల్‌ అయింది.

ఈ సినిమాలో మహేశ్‌ సరికొత్తగా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం చాలా రోజులుగా ఆయన కసరత్తులు కూడా చేస్తున్నారు. ఈ సమ్మర్‌లో చిత్రీకరణ కూడా రాజమౌళి ప్రారంభించనున్నారు. అందుకోసం ఆయన ఇప్పటికే పలు లొకేషన్స్‌ కూడా సెర్చ్‌ చేసిన విషయం తెలిసిందే. ఒడిశాతో పాటు ఆఫ్రికా వంటి  అడవుల్లో ఆయన పర్యటించారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement