
‘‘నా సినిమా విడుదలై సంవత్సరం దాటిపోయింది. ఈ నెల 21న ‘షణ్ముఖ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ సినిమా ఘనత అంతా దర్శక, నిర్మాత షణ్ముగం సాప్పనికే దక్కుతుంది. మంచి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుంది. మా చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఆది సాయికుమార్(Adi Sai kumar) చెప్పారు.
షణ్ముగం సాప్పని దర్శకత్వంలో ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేశ్ యాదవ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలకు ముందే అన్ని భాషల శాటిలైట్ హక్కులు, డిజిటల్, థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
‘‘డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపోందిన ఈ మూవీ చేయడం హ్యాపీ’’ అని అవికా గోర్ పేర్కొన్నారు. ‘‘మా సినిమాని ఏపీ, తెలంగాణలో నా మిత్రుడు శశిధర్ రెడ్డి విడుదల చేస్తున్నారు’’ అన్నారు షణ్ముగం సాప్పని.
Comments
Please login to add a commentAdd a comment